అన్వేషించండి
Advertisement
Acharya : రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. మెగాస్టార్ కు ఛాన్స్ దొరుకుతుందా..
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుందని కానీ ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమాపై కరోనా ఎఫెక్ట్ బాగా చూపించింది. ఇటీవల షూటింగ్ ను పునః ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ వాయిదా పడుతూ వస్తోంది.
ఇప్పుడేమో డిసెంబర్ నుండి సంక్రాంతి వరకు డేట్స్ అన్నీ లాక్ అయిపోయాయి. మిగిలిందల్లా అక్టోబర్ నెల ఒక్కటే. ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' అక్టోబర్ 13న రాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ టైమ్ కి థర్డ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాను విడుదల చేయాలంటే అన్ని చోట్ల విడుదలకు అనుకూలంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఉండకూడదు. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.
అందుకే 'ఆర్ఆర్ఆర్' సినిమా రాకపోతే తమ సినిమాను విడుదల చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్లతో 'ఆచార్య' రిలీజ్ డేట్ గురించి డిస్కషన్స్ సాగించారు. జనవరి విడుదల గురించి మాట్లాడుకున్నారు. దీంతో ఈరోజు హడావిడిగా పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ చిత్రనిర్మాతలు వెంటనే తమ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేశారు. దీంతో ఇప్పుడు 'ఆచార్య' టీమ్ ఆలోచనలో పడింది.
తెగించేసి జనవరిలో డేట్ అనౌన్స్ చేస్తే.. ఇద్దరు టాప్ మెగాహీరోల సినిమాలు ఒకేసారి రిలీజైతే అభిమానుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకునే ఛాన్స్ ఉంది. పైగా హెవీ కాంపిటీషన్ మధ్య సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. ఒక్క పవన్ సినిమా మాత్రమే కాకుండా.. మహేష్, ప్రభాస్ సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి 'ఆచార్య' టీమ్ రిస్క్ చేయలేదు.
మరోపక్క అన్ని సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తుండడంతో.. మెగాస్టార్ సినిమా ఎప్పుడు వస్తుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పలు రకాల మీమ్స్ ను షేర్ చేస్తూ 'ఆచార్య' రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు వాళ్లే ఓ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. జనవరి 7న సినిమాను రిలీజ్ చేయమంటూ సలహాలు ఇస్తున్నారు. ట్విట్టర్ లో 'ఆచార్య' ట్యాగ్ ను ట్రెండ్ నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion