Chiranjeevi: భార్యతో కలిసి చిరంజీవి టూర్ - ఎక్కడికి వెళ్లారంటే?
మెగాస్టార్ చిరంజీవి హాలిడే మోడ్ లోకి వెళ్లిపోయారు. తన భార్యతో సురేఖాతో కలిసి విదేశాలకు చెక్కేశారు.
గత కొంతకాలంగా 'ఆచార్య' సినిమాతో బిజీగా గడిపిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమా విడుదల కావడంతో హాలిడే మోడ్ లోకి వెళ్లిపోయారు. తన భార్యతో సురేఖాతో కలిసి విదేశాలకు చెక్కేశారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. కరోనా పాండమిక్ తరువాత ఇదే తన తొలి ఇంటర్నేషనల్ జర్నీ అని.. చాలా రోజుల తరువాత చిన్న బ్రేక్ తీసుకొని సురేఖాతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి.
ఈ సందర్భంగా ఫ్లైట్ లో తీసుకున్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన మెగాస్టార్ కోడలు ఉపాసన 'హేవ్ ఏ సూపర్ టైమ్ అత్తమ్మ, మామయ్య' అంటూ కామెంట్ చేసింది. చిరంజీవి నెల రోజుల పాటు ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చిన వెంటనే 'గాడ్ ఫాదర్' సినిమా పనులతో బిజీ కానున్నారు. మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు ఆయన చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య' అనే సినిమా చేయనున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా కమిట్ అయ్యారు. ఇవి పూర్తి కాకుండానే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా రాధికా కూడా చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పింది. ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: పవన్ సినిమాలో నోరా ఫతేహి క్యారెక్టర్ ఇదే!
Also Read: హాస్పిటల్ లో మిథున్ చక్రవర్తి - వైరల్ అవుతోన్న ఫొటో
View this post on Instagram