By: ABP Desam | Updated at : 15 Mar 2023 11:53 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@KChiruTweets/boselyricist/twitter
‘RRR’ సినిమా ప్రపంచ సినీ వేదికపై సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ప్రస్తుతం ప్రపంచం అంతా ‘నాటు’ స్టెప్పులతో దుమ్మురేపుతోంది. తన కొడుకు నటించిన సినిమాకు ఆస్కార్ రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం పట్టలేకపోతున్నారు. చెర్రీ సాధించిన ఘనతకు ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఆస్కార్ అవార్డు తనకే వచ్చినట్లు ఫీలవుతున్నారు.
చిరంజీవి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ డీపీని మార్చారు. ఆస్కార్ అవార్డుతో కూడిన డీపీని పెట్టారు. ఆయన డీపీని మార్చడం పట్ల పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఎడిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడిన మాటలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆస్కార్ విజయాన్ని కేవలం తన కొడుకు రామ్ చరణ్ కు మాత్రమే ఆపాదించే ప్రయత్నం చేయడంపై నెటిజన్లు ఓ రేంజిలో విమర్శలు చేశారు. సర్వత్రా విమర్శలు రావడంతో చిరంజీవి వివరణ ఇస్తూ ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘RRR’ సినిమా దర్శక నిర్మాతలకు, పాట పాడిన సింగర్లు, కంపోజ్ చేసిన మాస్టర్, కీరవాణి, హీరోలకు శుభాకాంక్షలు చెప్పారు.
గత కొంతకాలంగా చిరంజీవి ఏదో ఒక కామెంట్ చేయడం, నెటిజన్లతో ట్రోలింగ్ కు గురికావడం కామన్ గా కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్ లో రవితేజను చిన్న హీరో అని సంబోధించి తీవ్ర విమర్శలపాలయ్యారు. అటు మరికొంత మంది చిరంజీవి అభిమానులు మాత్రం ఇందులో తప్పేముంది అంటున్నారు. మనకు ఆస్కార్ వచ్చిందనే సంతోషాన్ని వెల్లడించేందుకు ఆస్కార్ తో కూడిన డీపీ పెట్టి ఉంటారని సమర్థిస్తున్నారు. దీనికి కూడా ట్రోల్ చేయాలా? అంటూ మండిపడుతున్నారు.
People who are trolling Chiru for his dp.
— Nikkk…! (@NikhilVardhan48) March 13, 2023
He is just a proud father celebrating the victory of his son’s film #RRRWinsOscars & as a Mega Star of Telugu cinema he is very proud that a TELUGU song has won the #Oscars
He is not a professional editor, it’s pure excitement & cute too. pic.twitter.com/OKeIHe6QPz
అటు ‘RRR’ ‘నాటు నాటు’ పాట రాసిని చంద్రబోస్ సైతం తన సోషల్ మీడియా డీపీ మార్చుకున్నారు. ఆస్కార్ అందుకున్న సందర్భంగా తీసిన ఫోటోను పెట్టుకున్నారు. చేతిలో బంగారు ఆస్కార్ తో చిరు నవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. పలువురు నెటిజన్లు ఈ ఫోటోకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ అభినందనలు కురిపిస్తున్నారు.
Read Also: ‘నాటు నాటు’ స్టెప్పులు వెయ్యాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ మలయాళ పత్రిక చూస్తే సరిపోతుంది!
Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!
Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా
Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి