అన్వేషించండి

HanuMan Pre Release Event: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్, చీఫ్ గెస్టుగా చిరంజీవి - ఆ విషయం లీక్?

HanuMan Pre Release Event: ‘ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

HanuMan Pre Release Event: ‘యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘జాంబిరెడ్డి’ అనే సినిమా విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ‘హనుమాన్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 12న థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ తో పాటు పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ మాత్రం హాలీవుడ్ రేంజిలో అలరించాయి.

‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా ఏర్పాట్లు

‘హనుమాన్’ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఈవెంట్ కోసం చిత్రబృందం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

‘హనుమాన్’ పాత్రలో చిరంజీవి?

ఇక తేజ సజ్జ మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో చిరంజీవి చిన్నప్పటి పాత్రను తేజ పోషించాడు. ఇక ఇప్పుడు తేజ సినిమాలో చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. వాస్తవానికి ‘హనుమాన్’ ట్రైలర్ విడుదలైనప్పుడు హనుమాన్ కళ్లు మాత్రమే చూపించారు. అయితే, ఈ చిత్రంలో హనుమంతుడిని గ్రాఫిక్స్ రూపంలో చూపించబోతున్నట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పారు. కానీ, ఆ కళ్లను చూసి చిరంజీవి మాదిరిగానే ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవి హనుమంతుడిగా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో హనుమంతుడి గురించి ప్రశాంత్ వర్మ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఆ పాత్రను ఎవరు పోషించారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. అయితే, ఈ క్యారెక్టర్ ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతుందన్నారు. ఆయన మాటలను బట్టి కచ్చితంగా చిరంజీవియే హనుమంతుడి రూపంలో కనిపిస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఒక వేళ చిరంజీవి ఈ వేడుకలో పాల్గొన్నట్లయితే.. తప్పకుండా హనుమంతుడి పాత్రపై లీక్ ఇస్తారని మెగా అభిమానులు భావిస్తున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో విడుదల

ఇప్పటికే ‘హనుమాన్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ను అందించింది. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ తో సహా 11 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఇక టాలీవుడ్ లో ఈ మూవీ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలతో పోటీ పడుతోంది.

Read Also: గొప్ప మనసు చాటుకున్న నటుడు జయరాం, 13 ఆవులను కోల్పోయిన యువ రైతుకు చేయూత

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Embed widget