Puri Jagannadh: పూరీకి ఏమైంది? 8 నెలలుగా మౌనం.. బర్త్ డే విషెస్‌కు కూడా చార్మీయే రిప్లై
మంగళవారం (సెప్టెంబరు 28న) పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ తారలు, ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలు ఎంత కిక్ ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంకాక్ బీచుల్లో రాసుకొనే కథలతో.. తెలుగు రాష్ట్రాల వెండి తెరలపై బీభత్సం సృష్టించే డేరింగ్ దర్శకుడు.. గత ఎనిమిది నెలలుగా అభిమానులకు దూరంగా ఉంటున్నారు. పూరీకి బదులు ఆయన ఫ్రెండ్, నటి, నిర్మాత చార్మీ కౌర్ మాత్రమే స్పందిస్తున్నారు. ఆయన చిత్రాల ప్రమోషన్ బాధ్యతలను సైతం చార్మీయే చూస్తున్నారు. చివరికి.. పూరీ పుట్టిన రోజు శుభాకాంక్షలకు కూడా ఆమే సమాధానమిస్తున్నారు.
మంగళవారం (సెప్టెంబరు 28న) పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ తారలు, ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే, వాటికి సమాధానం మాత్రం పూరీ ఇవ్వడం లేదు. కేవలం చార్మీ మాత్రమే స్పందిస్తున్నారు. పూరీ ఇలా స్పందించారంటూ.. ట్వీట్లకు రిప్లై ఇస్తున్నారు. దీంతో పూరీ అభిమానులు నిరుత్సాహానికి గురవ్వుతున్నారు. సినిమా ప్రమోషన్ బాధ్యతలు సరే.. చివరికి వ్యక్తిగత విషయాలకు కూడా చార్మీయే స్పందించాలా అని అంటున్నారు.
హీరోలు రామ్ పోతినేని, కార్తికేయ, సత్యతోపాటు బండ్ల గణేష్, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పూరీ జగన్నాథ్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. వారి ట్వీట్లకు కూడా చార్మీ తన పర్శనల్ అకౌంట్ ద్వారా సమాధానం ఇస్తున్నారు. ‘‘నా ఫేవరెట్ మనుషుల్లో ఒకరైన.. తోపెస్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు హ్యాపీ బర్త్ డే’’ అని రామ్ పోతినేని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్‌లో పూరీ వీడియోను రామ్ పోస్ట్ చేశాడు. దీనికి ఛార్మీ సమాధానమిస్తూ.. ‘‘టన్నుల కొద్ది ధన్యవాదాలు ఉస్తాద్. లవ్ యూ, నువ్వు నా డైనమైట్ అని పూరీ గారు చెప్పారు’’ అని రిప్లై ఇచ్చారు.
Ustaaaaaaaddddddd thanks a ton 🤗🤗🤗
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Puri garu says “ love u , you are my dynamite”😘😘😘😘 https://t.co/5BaPwdWz76
పూరీ ఎందుకు మౌనం?: పూరీ జగన్నాథ్ ఈ ఏడాది జనవరి 11 నుంచి సోషల్ మీడియాకు దూరమయ్యారు. బ్యాక్ టు బ్యాక్ వర్క్ వల్ల కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ప్రస్తుతం పూరికి సంబంధించిన వ్యవహారాలన్నీ చార్మీయే చక్కదిద్దుతున్నారు. చివరికి ఆయన సోషల్ మీడియా అకౌంట్లను కూడా చార్మీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన అధికారిక ట్విట్టర్ నుంచి కాకుండా చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ నుంచే స్పందిస్తున్నారు.
— PURIJAGAN (@purijagan) January 11, 2021
See Pics: రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ షూటింగ్ అరుదైన చిత్రాలు
పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పూరీ, చార్మీ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరో నిర్మాత. ఈ పాన్ ఇండియా సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. ‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే ఉన్నాను’’ అంటూ చేతిలో మందుగ్లాసు పట్టుకుని తన ముందుకు కుర్చిలో కూర్చున్న పూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న ట్వీట్‌ను చార్మీ పోస్ట్ చేశారు. పూరీ తన కొడుకు ఆకాష్ నటిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించారు. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
Satyaaaaaa thank uuuuu .. 🤗🤗 https://t.co/kyipJKpIaF
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Thank uuuuuuuuu 🤗🤗🤗 https://t.co/vw2EW9qTQm
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Thank u Ganesh garu 🙏🏻😛 https://t.co/24FEv0zncV
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Thank u Ganesh garu 🙏🏻😛 https://t.co/24FEv0zncV
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
Also Read: చిరుత @ 14.. రామ్ చరణ్‌కు అభిమానులు అద్భుతమైన కానుక, రెండు కళ్లు సరిపోవు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

