News
News
X

Bigg Boss: కూల్ బాయ్‌కి కోపం వచ్చింది - కెప్టెన్సీ టాస్క్‌లో ఫైర్ అయిన రోహిత్, కూల్‌గా ఉన్న రేవంత్

బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ వాడివేడిగా మొదలైంది. ఈ రోజు కూడా ఇంట్లో వాడీ వేడి వాతావరణం సాగుతోంది.

FOLLOW US: 
 
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. ఇప్పటి వరకు కూడా ఆట మీద ఎక్కువ ఫోకస్ పెట్టని వాళ్ళు కూడా ఈసారి తమ సత్తా ఎంతో నిరూపించుకుంటున్నారు. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులు తమవంతుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్సీ కి పోటీదారులు బిగ్ బాస్ వస్తా.. నీ వెనుక అనే టాస్క్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఎప్పుడు శాంతంగా ఉండే రోహిత్ కి బాగా కోపం వచ్చేసింది. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు.

తాజా ప్రోమో ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్లుగా కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, మేరీనా నిలిచినట్టు తెలుస్తోంది. వారికి ఇచ్చిన టాస్ ప్రకారం మూడు భాగాలుగా ఉన్న సర్కిల్ లో తిరుగుతూ తమ భుజాల మీద ఉన్న పేపర్ బాల్స్ బస్తాలని పట్టుకుని కాపాడుకోవాలి. ఒకదాని తర్వాత ఒక సర్కిల్ లో తిరుగుతూ తమ బ్యాగ్స్ ని కాపాడుకోవాలి. అలా రెండో సర్కిల్ తిరిగే సమయానికి మేరీనా, కీర్తి అవుట్ అయిపోయినట్లు తెలుస్తోంది. తర్వాత రింగ్ లో రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య పోటీపడ్డారు.

ఫైమా రోహిత్ బాడీ ని టచ్ చేయడంతో అలా చేయవద్దని రోహిత్ చెప్పాడు. మధ్యలో రాజశేఖర్ కల్పించుకునేసరికి రోహిత్ సీరియస్ అయ్యాడు. తర్వాత పోటీదారులు తమ బస్తాలు పట్టుకోకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఫైమా బ్యాగ్ చించేయడానికి ఆదిరెడ్డి, రోహిత్ చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళిద్దరినీ ఫైమా అడ్డుకునేందుకు చాలా ట్రై చేసింది కానీ తన బస్తాలోనివన్నీ కిందపోయాయి. ఆదిరెడ్డి తన బ్యాగ్ పట్టుకుంటూనే రోహిత్ బ్యాగ్ చింపడానికి ట్రై చేశాడు. బ్యాగ్ పట్టుకోకూడదు కదా అని రోహిత్ గట్టిగా అరుస్తున్నా రేవంత్ పట్టించుకోడు. దీంతో మేరీనా కల్పించుకుని ప్రేక్షకులు చూస్తున్నారు వదిలేయ్ అని కూల్ చేసేందుకు చూస్తుంది. ఏం జరిగిందో ఏమో మరి రోహిత్ కి బాగా కోపం వచ్చేసి తన బ్యాగ్ ని కాలితో తన్నేసి అరుస్తాడు.

News Reels

ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్

రేవంత్ ‘నేను ఫిజికల్ అవ్వకుండా అయినట్టు ఆరోపణలు వేశారు కాబట్టి ఎవరిదైనా చిన్న గోరు తగిలినా నేను ఫిజికల్ అవుతా’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘గోరు తగిలినా ఫిజికల్ అవుతా అంటున్నాడు...రెజ్లింగా?’ అని అరిచాడు. దానికి రేవంత్ ‘నామినేషన్ కారణాలు వెతుక్కో... ఆ పనిలో ఉండు’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘నామినేషన్ వేయడానికి నీ విషయంలో కారణాలు వెతుక్కోపనిలేదు, నువ్వు అరగంటకొకటి ఇస్తావ్, ఏసుకో నువ్వు నామినేషన్ వేసుకుంటావో, ఏం వేసుకుంటావో వేసుకో, ఐ డోంట్ కేర్. నేను నీట్‌గా ఆడతా, ఫిజికల్ అవ్వను’ అన్నాడు. మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. 

ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు వీళ్లే
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్

Also read: ఇచ్చిందే ఫిజికల్ టాస్కు, ఇక ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు?

Published at : 10 Nov 2022 02:24 PM (IST) Tags: rohith Revanth Bigg Boss 6 Telugu Geethu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!