News
News
X

Captain Telugu Trailer: ఏలియన్స్‌తో ఆర్యా ఫైట్, ఉత్కంఠభరితంగా ‘కెప్టెన్’ ట్రైలర్

తమిళ హీరో ఆర్యా నటించిన తాజా మూవీ ‘కెప్టెన్‘ ట్రైలర్ విడుదల అయ్యింది.. ఏలియన్స్‌తో ఆర్యా ఫైట్ ఆకట్టుకుంటుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది..

FOLLOW US: 

ఆర్యా..  తమిళ హీరో అయినా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. వరుడు సినిమాతో తెలుగు జనాలకు నేరుగా పరిచయం అయ్యాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆర్యా నటించిన పలు సినిమాలు తెలుగులోకి అనువాదమై విడుదల అయ్యాయి. ప్రస్తుతం ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ ‘కెప్టెన్’ను త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

శక్తి సౌందర రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కెప్టెన్ సినిమాలో ఆర్యా ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన  ట్రైలర్ రిలీజ్ అయ్యింది. థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆర్మీ ఆఫీసర్ గా  శత్రువును ఎన్ని రకాలుగా గుర్తించాలి? వారిని ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి పద్దతులు పాటించాలి? అనే విషయాలను ఆర్యా తోటి వారికి వివరించడం కనిపిస్తుంది.

మన సైన్యాన్ని దెబ్బకొట్టేందుకు శత్రు దేశాలు తెర మీదకు తీసుకొచ్చిన వింత జీవులు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఏలియన్స్ లాంటి జీవులను ఆర్మీ అధికారిగా ఆర్యా ఎలా ఎదుర్కొనబోతున్నాడో ఇందులో కనిపించింది. ఆర్మీ ఆఫీసర్ గా ఈ జీవులను అంతం చేయడానికి తన టీమ్ తో కలిసి చేసే ఆపరేషన్ ను ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ వింత జీవులతో ఆర్యా చేసే పోరాటం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? అనేవి సినిమాలో చూపించబోతున్నారు.  

అద్భుతమైన టేకింగ్.. అంతకు మించి ఒళ్లుగగుర్పొడిచేలా రూపొందించిన వింత జీవులు సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠంగా ఉంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం హిందీలో రిలీజ్ చేస్తున్నారా లేదా అనేది తెలియరాలేదు. ఒక వేళ విడుదల చేస్తే.. దీనిపై కూడా బాలీవుడ్‌లో చర్చ నడిచే అవకాశం ఉంటుంది. ఈ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 8, 2022 రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో ఆర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ  నటించింది.  సిమ్రాన్, హరీష్ ఉత్తమన్ ప్రధాన పాత్రల్లో నటించారు.  డి. ఇమ్మాన్ మ్యూజిక్ అందించారు. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.  ఆర్య హీరోగా నంటిచిన టెడ్డీ, సార్బట్టా పరంపరై వంటి సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు కెప్టెన్ గా ఆర్యా థియేటర్లో అడుగు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలై జనాలను బాగా ఆకట్టుకుంది. సినిమా యూనిట్ ముందుగానే ప్రకటించినట్లుగా  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇవాళ(ఆగస్ట్ 22, 2022న) ఉదయం 11 గంటలకు విడుదల అయ్యింది. గ‌తంలో ఆర్య‌, శ‌క్తి రాజ‌న్ కాంబోలో వ‌చ్చిన  టెడ్డీ నేరుగా డిస్నీ హాట్ స్టార్ లో విడుద‌లై ఆధరణ దక్కించుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ అంటున్నారు. 

Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు

Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?
Published at : 22 Aug 2022 03:13 PM (IST) Tags: arya Aishwarya Lekshmi Captain Movie Official Trailer Captain Telugu Trailer

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!