అన్వేషించండి
Advertisement
Vijay: అల్లు అర్జున్ ఫీట్ ను విజయ్ రిపీట్ చేయగలడా?
అల్లు అర్జున్ నటించిన సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. నిజానికి ఈ సినిమాను నార్త్ లో పెద్దగా ప్రమోట్ చేయనప్పటికీ.. అక్కడ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాపై అంత బజ్ పెరగడానికి కారణం.. పాటలనే చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందు సాంగ్స్ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చాలా మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇప్పటికీ 'పుష్ప' సాంగ్స్ పై వందల సంఖ్యలో రీల్స్ వస్తూనే ఉన్నాయి.
అల్లు అర్జున్ నటించిన సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. అది కూడా 'పుష్ప' సినిమా హిట్ అవ్వడానికి హెల్ప్ అయ్యేలా చేసింది. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతోంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ సాంగ్ కి డాన్స్ చేస్తూ.. వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
రీసెంట్ గా సమంత కూడా ఈ పాటకి స్టెప్పులేసింది. విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా కోసం ఈ పాటను కంపోజ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ కి భారీ క్రేజ్ వస్తోంది. 'బీస్ట్' సినిమాను తమిళ, తెలుగు భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఆ సమయానికి సినిమాలో మిగిలిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తే.. సినిమాపై బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం.
కానీ విజయ్ కూడా అదే రేంజ్ లో సినిమాను బాలీవుడ్ లో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. 'పుష్ప'కి వచ్చిన కలెక్షన్స్ లో సగమైనా 'బీస్ట్'కి రావాలంటే అగ్రెసివ్ గా సినిమా ప్రమోషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయ్ కి నార్త్ లో పెద్దగా గుర్తింపు లేదు. తెలుగులో కొందరు యంగ్ హీరోలకు బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కూడా విజయ్ కి లేదు. ఇప్పటివరకు ఆయన కోలీవుడ్ పైనే ఫోకస్ చేశారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ పై దృష్టి పెట్టారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion