By: ABP Desam | Updated at : 06 Jan 2023 01:16 PM (IST)
Image Credit: Suhana Khan - Agastya Nanda/Instagram
ఒకప్పుడు హీరో, హీరోయిన్ తెరపై కాకుండా ఎక్కడ బయట కనిపించినా వారు ప్రేమలో ఉన్నారేమో అంటూ వార్తలు వచ్చేసేవి. ఇది వరకు వాటిని సీరియస్‌గా తీసుకుని అవి సృష్టించేవారిపై కేసులు, దావాలు వేసేవారు. కాలం మారుతున్న కొద్దీ వాటిని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ట్రెండ్ మారినట్లుంది. హీరో, హీరోయిన్ల గురించి కాకుండా వారి పిల్లల గురించి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. ఇటీవల షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహితో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కిడ్స్ గురించి డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వారెవరో కాదు.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, కింగ్ ఖాన్ షారుక్ కూతురు సుహానా ఖాన్. వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించిన ‘ఆర్చీస్’ అనే సినిమాలో వీరిద్దరూ నటించారు. సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని బీటౌన్ టాక్. అంతేకాదు, ఇటీవల కపూర్ కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు అగస్త్యతో కలిసి సుహానా హాజరైనట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో అగస్త్యతో తాను ప్రేమలో ఉన్నట్లు కూడా చెప్పిందట. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ అగస్త్య తల్లి శ్వేతాకు కూడా సమ్మతమేనని, కాకపోతే ఇప్పుడే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారట.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఏదన్నా సినిమా వచ్చే ముందు అందులో నటించే నటీనటులు కలిసి కాసేపు బయట తిరగడం, డిన్నర్ లంచ్ వంటి వాటికి వెళ్లడం కూడా చూస్తూనే ఉంటాం. వీరిద్దరి కాంబినేషన్‌లో కూడా ఏదో సినిమా రాబోతోందని అందుకే సెల్ఫీ దిగి కావాలని ప్రొమోషన్స్ కోసం వైరల్ అవ్వడానికి డేటింగ్‌లో ఉన్నట్లు డౌట్ వచ్చేలా ఫొటోలు దిగుతున్నారని మరికొందరు నెటిజన్ల వాదన. ఇదే విషయం గురించి తెలుసుకునేందుకు అక్కడి మీడియా వర్గాలు అగస్త్య టీంను సంప్రదించినప్పటికీ వారు ఎటువంటి కామెంట్స్ చేయాలనుకోలేదట. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ మొత్తానికి షారుక్ ఇద్దరు పిల్లలు తమ లైఫ్ పార్ట్‌నర్లను వెతికేసుకున్నట్లే అనిపిస్తోంది. ఆల్రెడీ షారుక్ కుమారుడు ఆర్యన్... నోరా ఫతేహితో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క బిగ్‌బి మనవరాలైన నవ్య నవేలీ నంద కూడా బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇక ఈ స్టార్ కిడ్స్ సినిమాల విషయానికొస్తే.. సుహానా ఖాన్, అగస్త్య నంద నటించిన ‘ఆర్చీస్’ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. ఆర్యన్ ఖాన్ మాత్రం తనకు సినిమాల్లో నటించాలని లేదని ఎప్పుడో నిర్ణయించుకున్నాడట. అందులోనూ ఇటీవల డ్రగ్స్ కేసులో కొన్ని రోజులు రిమాండ్‌లో ఉన్న ఆర్యన్ ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్నాడు.
MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్
Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్
Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత