Producer Bunny Vas: సుహాస్‌ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, అందుకే ‘తండేల్‘ సినిమా చెయ్యొద్దన్నాను- బన్నీవాస్
Bunny Vas: సుహాస్ హీరోగా దుష్యంత్ కటికినేని తెరకెక్కించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. తాజా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాస్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Bunny Vas About Suhas: సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. తెలుగు అమ్మాయి శివాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘దొరసాని‘, ‘ఏబీసీడీ‘, ‘ఊర్వశివో రాక్షసివో‘, ‘బేబి‘ లాంటి హిట్ చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న బన్నీ వాస్ ఈ సినిమా గురించి, ఈ సినిమా హీరో సుహాస్ గురించి కీలక విషయాలు చెప్పారు.
శివానికి మంచి గుర్తింపు రావాలి- బన్నీ వాస్
ఇప్పటి వరకు జీఏ2 పిక్చర్స్ సంస్థలో రియలిస్టిక్ జెన్యూస్ సినిమా చేయలేదని, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాతో ఆలోటు తీరిందని బన్నీ వాస్ వెల్లడించారు. "మా గీతా ఆర్ట్స్ సంస్థలో ఒక రియలిస్టిక్ జెన్యూన్ మూవీ చేయలేదనే ఆలోచన ఉండేది. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో ఆలోటు తీరిపోయింది. దర్శకుడు దుశ్యంత్ ఈ సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు” అని వెల్లడించారు. ఇక తమ సంస్థలో తొలి సినిమా చేసిన హీరోయిన్లకు మంచి పేరు వచ్చిందని, తెలుగమ్మాయి శివానికి కూడా మంచి గుర్తింపు రావాలని ఆయన ఆకాంక్షించారు.
సుహాస్ ను ‘తండేల్’ చెయ్యొద్దు అన్నాను- బన్నీ వాస్
అటు ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ హీరో సుహాస్ పై బన్నీ వాస్ ప్రశంసల జల్లు కురిపించారు. సుహాన్ ను చూస్తుంటే ఇరవై ఏళ్ల కింద మమ్మల్ని మేము చూసుకున్నట్లు ఉంటుందన్నారు. “'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ ఆ ఊరికి వెళ్లినట్లు ఫీల్ అవుతారు. థియేటర్లలో కూర్చున్న అందరికీ ఒక మంచి సినిమా చూశాం అనిపిస్తుంది. ఈ సినిమా చూసే వాళ్లను దర్శకుడు దుశ్యంతో అంబాజీపేటకు తీసుకెళ్తారు. అంత అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ‘తండేల్’ సినిమాలో హీరో తర్వాత అంతటి మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా అంతా సాయి పల్లవి పక్కనే ఉంటుంది. దర్శకుడు ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. ఆ ఫేస్ చూస్తేనే ఓ జెన్యూనిటీ రావాలి అనేవారు. నాకు కళ్లు మూస్తే సుహాస్ కనిపించే వాడు. సుహాస్ కు ఆ కథ చెప్పి కూడా మళ్లీ చెయ్యకు అని చెప్పాను. హీరోగా చేస్తున్నావు. మంచి పొజిషన్ లో వెళ్తున్నావు. ఈ క్యారెక్టర్ వద్దులే అని చెప్పాను. సుహాస్ ను చూస్తుంటే 20 ఏండ్ల క్రితం మా జీవితాలు మాకు గుర్తుకు వస్తాయి. మేం ఎలా కష్టపడ్డామో? ఆయన కూడా అలాగే కష్టపడుతున్నారు. సుహాస్ జెన్యూనిటీ, సింప్లీసిటీ, హానెస్టీ ఆయనను టాప్ పొజిషన్ కు తీసుకెళ్తుంది” అన్నారు. ఈ మూవీలో ‘పుష్ప’ ఫేం జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Also: 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మకు స్పెషల్ గిఫ్ట్ - వామ్మో, అన్ని కోట్లా?