BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా.

FOLLOW US: 

'ఉప్పెన' అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు సానా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ లవ్ స్టోరీ వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ సినిమా వచ్చి మూడేళ్లయినా.. ఇప్పటివరకు తన తదుపరి సినిమా మొదలుపెట్టలేదు ఈ దర్శకుడు నిజానికి 'ఉప్పెన' సినిమా మేకింగ్ కోసం చాలా సమయం పట్టింది. అనుకున్న దానికంటే దాదాపు ఏడాది ఆలస్యంగా విడుదలైంది ఈ సినిమా. 

లేట్ అయినా.. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. కానీ రెండో సినిమా విషయంలో ఆయన మరింత ఎదురుచూడక తప్పేలా లేదు. 'ఉప్పెన' సినిమా తరువాత అతడికి మంచి అవకాశాలే వచ్చాయి. అయితే తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమానే చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు చాలా కాలంగా పరిచయమున్న స్టార్ హీరో ఎన్టీఆర్ కి కథ చెప్పారు. 

ఆ కథ ఎన్టీఆర్ కి కూడా నచ్చింది. సినిమా చేస్తానని కూడా అన్నారు. బుచ్చిబాబు మొదటి సినిమాను ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ సినిమాను కూడా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. బుచ్చిబాబు స్క్రిప్ట్ రెడీ చేసుకొని టెక్నీషియన్లను వెతికే పనిలో పడ్డాడు. కానీ ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. 

కొరటాల శివతో ఎన్టీఆర్ చేయాలనుకుంటున్న సినిమా ఆలస్యమవుతోంది. ప్రశాంత్ నీల్ సినిమా మీద కూడా క్లారిటీ లేకపోవడంతో.. బుచ్చిబాబు సినిమాను ముందుగా మొదలుపెడతారనే ప్రచారం జరిగింది. అలా కాకపోయినా.. కొరటాల సినిమా తరువాత బుచ్చిబాబు సినిమా ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు దానికి ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చింది. తన నెక్స్ట్ రెండు సినిమాలను కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. 

ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తారో లేదో కూడా సందేహమే. అయినప్పటికీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్నారు బుచ్చిబాబు సానా. ఇప్పటికైనా ఆయన రియలైజ్ అయ్యి ఎన్టీఆర్ తో సినిమా చేసే కంటే ముందు మరో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుంటారేమో చూడాలి!

Also Read: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Published at : 22 May 2022 03:37 PM (IST) Tags: ntr prashanth neel Koratala siva Buchi Babu Sana

సంబంధిత కథనాలు

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి వాయనం, రుక్మిణి ఫోన్ ట్యాప్ చేసిన మాధవ

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి  వాయనం, రుక్మిణి  ఫోన్ ట్యాప్  చేసిన మాధవ

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

టాప్ స్టోరీస్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?