అన్వేషించండి

#BSS10: 'భీమ్లా నాయక్' డైరెక్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ 'భీమ్లా నాయక్'చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్ర కాంబోలో నటిస్తున్నట్టు ప్రకటించాడు.'#BSS10' టైటిల్ తో ఈ మూవీ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది

#BSS10: 'ఛత్రపతి' హిందీ రిమేక్ టీజర్ తో లేటెస్ట్ గా బాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని 14రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ 2014లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వివి వినాయక్ దర్శకత్వంలో 'అల్లుడు శీను' చిత్రం ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మొదటి సినిమానే సూపట్ హిట్ కావడం బెల్లంకొండకు ప్లస్ గా మారింది. ఆ తర్వాత 'కవచం', 'రాక్షసుడు' లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించిన బెల్లంకొండ..మాస్ హీరోగా సొంతంగా ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. 'స్పీడున్నోడు' వంటి భిన్న కథతో వచ్చిన బెల్లంకొండ.. మొదటిసారిగా ఫ్లాప్ లిస్ట్ లో చేరాడు. అలా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా టాప్ డైరెక్టర్స్ దర్శకత్వంలోనే చేసినా.. అంతగా హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే. కానీ ఓ నటుడిగా బెల్లంకొండ మంచి పేరును తెచ్చుకోవడం చెప్పుకోదగిన విషయం.

ఇప్పటి వరకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాల్లో ఒకటి, రెండు మినహా ఏ సినిమాలూ థియేటర్లలో పెద్దగా హిట్ కొట్టలేదు. అయితే, హిందీలోకి డబ్ అయిన 'జయ జానకి నాయకా' మూవీకి యూట్యూబ్​లో ఏకంగా 710 మిలియన్ల వ్యూస్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇన్ని వ్యూస్ ప్రపంచంలో ఏ సినిమాకూ రాకపోవడం చెప్పుకోదగిన విషయం. యశ్ నటించిన 'కేజీఎఫ్' చిత్రం సెకండ్ ప్లేస్​లో ఉండగా.. ఈ సినిమాకు ఇప్పటి దాకా 703 మిలియన్​ వ్యూస్ వచ్చాయి. దీంతో యూట్యూబ్​లో ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన నెంబర్ వన్ హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిలిచారు.

18 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన ప్రభాస్ 'ఛత్రపతి'కి హిందీ రిమేక్ లో బెల్లం కొండ శ్రీనివాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ఆ మూవీ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదే ఉత్సాహంతో బెల్లంకొండ మరో కొత్త సినిమాను రివీల్ చేశాడు. తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ 'భీమ్లా నాయక్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్ర కాంబోలో నటిస్తున్నట్టు ప్రకటించాడు. #BSS10 టైటిల్ తో మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను.. బాలకృష్ణ, మహేష్ బాబులతో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన 14 రీల్స్ పతాకం పై  రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మూవీపై చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉండగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే సినిమాని గతంలో అనౌన్స్ చేశాడు. అయితే సేమ్ కథతో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ని ప్రకటించాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రకటించిన ‘స్టూవర్ట్‌పురం దొంగ’ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Also Read: ‘దసరా’ రివ్యూ - నాని పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget