అన్వేషించండి

Brahmamudi April 5th: పెళ్లి నుంచి స్వప్నని తప్పించింది కళావతేనన్న రాజ్- కావ్య తన తప్పు లేదని నిరూపించుకోగలుగుతుందా?

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్న గదిలో ఉండగా హోటల్ మేనేజర్ వచ్చి బిల్ కట్టమని అడుగుతాడు. రాహుల్ కట్టలేదా అని అడుగుతుంది. కట్టలేదని చెప్పేసరికి షాక్ అవుతాడు. అప్పుడే రాహుల్ స్వప్నకి ఫోన్ చేసి రాజ్ పోలీసులని తీసుకుని వస్తున్నాడు అర్జెంట్ గా అక్కడ నుంచి పారిపోమని చెప్తాడు. బిల్ కడతానని చెప్పి మేనేజర్ ని పంపించేసి హడావుడిగా బట్టలన్నీ సర్దుకుంటుంది. బయట కారులో కూర్చుని రాహుల్ చూస్తూ ఉంటాడు. మేనేజర్ కిందకి వచ్చేసరికి రిసెప్షన్ లో రాజ్ వాళ్ళు ఉంటారు. ఎవరు కావాలని అంటే స్వప్న అంటాడు. తను గదిలోనే ఉందని చెప్పేసరికి రాజ్ గబగబా వెళతాడు. అప్పటికే స్వప్న బ్యాగ్ తీసుకుని గది ఖాళీ చేసి తప్పించుకుని వెళ్ళిపోతుంది. రాజ్ గదిలోకి వెళ్ళి చూసేసరికి ఎవరూ ఉండరు. రాజ్ ఖచ్చితంగా స్వప్న వైపు చూసే టైమ్ కి ఎస్సై పిలవడంతో తనని చూడకుండా వెళ్ళిపోతాడు.

Also Read: తల్లడిల్లిపోతున్న మాలిని, ఖుషిని దూరం చేస్తున్న యష్- వేద ప్రేమ చూసి విన్నీ మారతాడా?

కిటికీలోనుంచి చీరలన్నీ ముడులు వేసి కిందకు వెళ్ళినట్టు క్రియేట్ చేసి తప్పించుకుంటుంది. మనం వస్తున్నట్టు ఎవరికీ తెలియదు కదా మీ ఇంట్లో తెలుసా అంటే తెలుసని రాజ్ చెప్తాడు. అయితే మీ ఇంట్లో ఎవరో ఒకరు లీక్ చేసి ఉంటారని అనేసరికి రాజ్ కావ్యని అనుమానిస్తాడు. స్వప్న వెళ్లిపోవడానికి కళావతి కారణమని రాహుల్ చెప్పిన విషయం గుర్తు చేసుకుని కావ్యనే తనని తప్పించిందని అనుకుంటాడు. హోటల్ రూమ్ లో సీసీటీవీ కెమెరాలు చూసి అవి చూస్తే నిజం తెలుస్తుందని అనుకుంటాడు. ఎస్సై ఒక్కడే బయటకి వచ్చాడని కనకం అల్లుడు రాలేదేంటని అనుకుంటుంది. ఒక పది రోజులు బ్యాక్ ది పుటేజ్ లేదని టెక్నికల్ ఎర్రర్ వచ్చి మొత్తం క్రాష్ అయిపోయిందని చెప్పేసరికి రాజ్ ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటాడు.

కావ్య హోటల్ కి రావడం చూసి తనని ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుందని అనుకుని రాహుల్ జారుకుంటాడు. కావ్య ఎందుకు వచ్చిందా అని కనకం టెన్షన్ పడుతుంది. మేనేజర్ స్వప్న రూమ్ బిల్లు గురించి అడిగితే రాజ్ చిరాకు పడతాడు. తిట్టేసరికీ మేనేజర్ బయటకి వస్తాడు. కావ్య వచ్చి స్వప్న ఏదని అడిగితే లేదు ఇందాకే పారిపోయిందని మేనేజర్ చెప్తాడు. రాహుల్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ వ్యక్తికి ఫోన్ చేసి చెప్పిన పని అయ్యిందా అని అడుగుతాడు. ఆయన చూస్తే వెంటనే గొడవ పడతారు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకునేలోపు రాజ్ చూసి ఇంట్లో మాట్లాడుకుందాం పదా అని తనని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్లిపోవడంతో స్వప్న తప్పించుకుందని అర్థం చేసుకుని రాహుల్ కూడా వెళ్ళిపోతాడు. కనకం స్వప్న గురించి తెలుసుకుందామని హోటల్ లోకి వెళ్తుంది మేనేజర్ వాళ్ళని పట్టుకుని బిల్లు కట్టించుకుంటాడు.

Also Read: జానకి మీద నింద వేసి అవమానించిన మల్లిక- కష్టాల సంద్రంలో భార్యకి అండగా నిలిచిన రామ

రాజ్ కోపంగా కావ్యని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. ఇంద్రాదేవి వచ్చి కావ్యని పైకి లేపుతుంది. రాక్షసుడిలాగా ప్రవర్తిస్తావా ఏంటని తిడుతుంది. మళ్ళీ ఏం చేసిందని అపర్ణ అడుగుతుంది. ఈ కళావతి చేసిన పని చెప్తే దారుణంగా అవమానిస్తావని అంటాడు. అసలు ఏం జరిగిందని కావ్య నిలదీస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Vijay Deverakonda Rashmika: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
Shriya Saran:  శ్రియ శరణ్ ఫ్యామిలీ టైమ్..ఫొటోస్ ఎంత బావున్నాయో చూడండి!
శ్రియ శరణ్ ఫ్యామిలీ టైమ్..ఫొటోస్ ఎంత బావున్నాయో చూడండి!
iPhone 15 : ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ.70వేల ఫోన్ రూ.30వేలకే
ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్- రూ.70వేల iPhone 15 రూ.30 వేలకే
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Embed widget