Brahmamudi May 9th: సూపర్ ట్విస్ట్, రాజ్‌కు దొరికిపోయిన స్వప్న, రాహుల్ - కావ్యని భార్యగా అంగీకరిస్తాడా?
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
గుడిలో కావ్యకి పదహారు రోజుల పండుగ పూజ ఏర్పాటు చేస్తారు. రాజ్ పక్కన కూర్చుని కావ్య పూజ చేస్తుంది. రాజ్ పక్కన అపర్ణ కూర్చోమంటే అమ్మాయి పక్కన కనకం కూర్చుంటుంది. వియ్యపురాలు హోదాలో కూర్చోమని చెప్పేసరికి కనకం తెగ సంబరపడుతుంది. పూజ జరుగుతూ ఉండగా అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. దినకంత్రి రాహుల్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. ఇక్కడ స్వప్న కూడా హడావుడిగా బయల్దేరుతుందని చెప్తుంది. రాహుల్ కూడా బయల్దేరారని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఏదో రిసార్ట్ లో రొమాంటిక్ డేట్ ప్లాన్ చేసుకున్నారని అప్పు అంటే వాళ్ళని పట్టుకోవడానికి ఇంతకు మించి మంచి ఛాన్స్ దొరకదని అనుకుంటారు. అటు అప్పు స్వప్నని, రాహుల్ ని కళ్యాణ్ ఫాలో అవుతారు.
Also Read: చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్- మాళవిక పెళ్లికి అందరినీ ఒప్పించిన వేద
అపర్ణ అయిష్టంగానే పంతులు చెప్పిన తంతు పూర్తి చేస్తుంది. మధ్యలో మీనాక్ష్మి కల్పించుకుని తిక్క తిక్కగా వాగుతుంది. రాహుల్ మా పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లాన్ చేశాడో తెలుసుకోవాలి అవసరమైతే ఆ ప్లాన్ లో నేను కూడ ఇన్వాల్వ్ అవాలని స్వప్న అనుకుంటుంది. ఆస్తి లేదని తెలిసి వదిలేద్దామని అనుకున్నా కానీ తన అందం చూసి వదల్లేకపోతున్నా పెళ్లి చేసుకోమని అంటే ఈసారి ఏం చెప్పాలా అని రాహుల్ ఆలోచిస్తాడు. రాజ్ ని పసుపు తాడు కావ్య మెడలో కట్టి పెళ్ళిలో కట్టిన పుస్తెల తాడు ఇవ్వమని పంతులు చెప్తాడు. రాజ్ కావ్య మెడలో మరోసారి మూడు ముళ్ళు వేస్తాడు. కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేసి కాసేపు బుర్ర తింటాడు. చదువుడు, రాసుడు తప్ప ఏమి తెలియదని మనసులో తిట్టుకుంటుంది. రాహుల్ చెప్పిన చోటుకి స్వప్న చేరుకుంటుంది. అప్పుడే రాహుల్ కూడా వస్తాడు. మీ అన్నని రమ్మని వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టించవచ్చని అప్పు ఐడియా ఇస్తుంది. కానీ వాళ్ళు పూజలో ఉన్నారు కదా ఎలా అంటాడు.
ALso Read: అత్తాకోడళ్లకు చీవాట్లు పెట్టిన గోవిందరాజులు- జానకి చేతికి చిక్కిన కీలక ఆయుధం, ఇక మనోహర్ కి చుక్కలే
అప్పు కనకానికి ఫోన్ చేసి కావ్యతో మాట్లాడుతుంది. స్వప్న బియ్యపు పిండి రాహుల్ గాడిని కలుసుకుంది. నీ చీమలు పట్టిన మొహం మొగుడిని పంపించమని చెప్తుంది. త్వరగా రమ్మని అంటుంది. నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి ఎలా అని కావ్య ఆలోచిస్తుంది. రాహుల్ స్వప్నని తీసుకుని రిసార్ట్ లోకి వెళతాడు. కావ్య పీటల మీద నుంచి లేచి వెళ్తుంది. ఇల్లు జైలులా ఉంది. వీధిలో వాళ్ళందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు నాకు ఏదోలా ఉందని చెప్తుంది. ఎవడో ఒకడిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాడు.
View this post on Instagram