అన్వేషించండి

Brahmamudi June 1st: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్

స్వప్న రాహుల్ గురించి నిజం చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్నని కళ్యాణ్ వాళ్ళు రాహుల్ ఎంగేజ్మెంట్ జరిగే దగ్గరకి తీసుకొస్తారు. రాహుల్ స్టేజ్ మీద వెన్నెలకి ఐలవ్యూ చెప్తాడు. నిన్ను ఎంత మోసం చేశాడో ఇప్పటికైనా తెలిసిందా? కావ్య అక్క ఎంత చెప్పినా నమ్మలేదు కదా ఇప్పటికైనా తెలిసిందా అని అప్పు అంటే స్వప్న కోపంగా ఏడుస్తూ బయటకి వెళ్ళిపోతుంది. రాహుల్ తనకి చెప్పిన మాయ మాటలు, మోసం అంతా గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం నీకు జరగాల్సిందే ఇలానని అప్పు దెప్పి పొడుస్తుంది. అప్పుడే కావ్య ఎంట్రీ ఇస్తుంది. నువ్వు కూడా నన్నే అనడానికి వచ్చావా అని స్వప్న మళ్ళీ తన మీద నోరు పారేసుకుంటుంది. స్వప్న కడుపుతో ఉన్న సంగతి అప్పు చెప్పేసరికి కావ్య షాక్ అవుతుంది. వాడు నిన్ను నమ్మించి వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో రాహుల్ తోనే నీ పెళ్లి జరగాలని కావ్య తనని మళ్ళీ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది.

రాహుల్ వెన్నెల వేలికి ఉంగరం తొడిగే టైమ్ కి కావ్య స్వప్నని తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళని చూసి రాహుల్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆగావ్ ఏంటి రాహుల్ రింగ్ తొడుగు అని కావ్య అంటుంది. ఏంటి ఇది ఎందుకు ఆగిపోయావని రుద్రాణి సీరియస్ అవుతుంది. మీ అక్కని ఎందుకు తీసుకొచ్చావ్ ఇలాంటి వాళ్ళు మాలాంటి ఇంటికి రాకూడదని అపర్ణ అంటుంది.

ALso Read: వేద ఆంటీ చాలా మంచిదన్న ఆదిత్య- యష్ కాపురంలో చిచ్చు పెట్టేందుకు సిద్ధమైన మాళవిక

కావ్య: మరి ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చా మేడమ్

రుద్రాణి: ఏంటి ఈ న్యూసెన్స్ నువ్వు కానివ్వు రాహుల్

కావ్య: వెన్నెలకి ఉంగరం తొడుగు కానీ ఒక కండిషన్ మా అక్క వేలికి తొడిగిన ఉంగరం తీసి అప్పుడు తొడుగు అనేసరికి అందరూ షాక్ అవుతారు.

రాజ్: ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది

కావ్య: నేను ముసుగు వేసుకుని మిమ్మల్ని కావాలని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా ఇప్పుడు నిజం ఏంటో తేలుస్తాను. మా అక్కకి ఈ ఉంగరం ఎప్పుడు తొడిగావో గుర్తుందా?

రాహుల్: మీ అక్కకి నేను ఎందుకు ఉంగరం తొడుగుతున్నాను ఏం మాట్లాడుతున్నారు. ఈ పెళ్లి ఆపడం కోసం ఇలా చేస్తున్నారా?

ఇంద్రాదేవి: కావ్యకి పెళ్లి ఆపాల్సిన అవసరం ఏముంది?

రుద్రాణి: ఇదంతా మనకి ఇప్పుడు అనవసరం

అరుంధతి: ఏం జరిగిందో మీకు అనవసరం కావచ్చు కానీ నాకు అవసరం

స్వప్న: ఐయామ్ సోరి రాజ్ పెళ్లి మండపం నుంచి నేను పారిపోలేదు ఈ రాహుల్ నన్ను లేవదీసుకుపోయాడు

వెన్నెల: ఒక ఆడపిల్ల నేను పలనా వాడితో లేచిపోయానని అబద్ధం చెప్తుందా?

రాహుల్: వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అబద్ధాలు చెప్పి బతికేస్తారు

కావ్య: షటప్ రాహుల్ ఇంకొక్క సారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడకు

స్వప్న: మన గురించి ఇంట్లో నిజం చెప్పమన్నాను. ఇప్పుడు కూడా రాకపోతే ఇంకొక అమ్మాయి జీవితం సర్వనాశనం చేస్తావని ఇక్కడికి వచ్చాను

సీతారామయ్య: ముందే నిజం చెప్పి ఉండవచ్చు కదా ఇప్పుడు ఎందుకు పరువు తీస్తున్నావ్

అపర్ణ: అక్కడ ఉంది నా స్నేహితురాలు తనకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది

Also Read: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్

రాజ్: రాహుల్ మీద ఇలాంటివి ఏంటి?

స్వప్న: తప్పలేదు నీ నెంబర్ అడిగితే తన నెంబర్ ఇచ్చి రోజూ నాకు ఫోన్ చేసి నా అందం పొగిడే వాడు. నీకంటే తానే బెటర్ ఆప్షన్ అని నన్ను నమ్మించాడు. మీతో పెళ్లి దాకా రాకముందే మా పెళ్లి జరగాలని అడిగాను. కానీ ఆఖరి నిమిషం దాకా ఆపి పీటల మీద నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత వదిలేశాడు రెండు రోజులు గుడిలో పడుకున్నా తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. అప్పటి నుంచి పెళ్లి చేసుకోమని అడిగితే ఇంట్లో ఒప్పుకోవడం లేదని మర్చిపొమ్మని సలహా ఇచ్చాడు

రాహుల్: నువ్వు ఎవడితోనో వెళ్ళిపోయి మా కుటుంబానికి  చెడ్డ పేరు తీసుకురావడం కోసం నా మీద నిందలు వేస్తున్నవా? ఇది నిజమని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం చూపించమనండి

కావ్య: చూపించగలను అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. నువ్వు ఇలా మాట్లాడతావని నాకు ముందే తెలుసు అందుకే సాక్ష్యం తీసుకుని వచ్చాను. ఆ వీడియో రాజ్ చూసి షాక్ అవుతాడు. ఇలాంటి మోసాగాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఆ నిజం ఏంటో చెప్పమని అంటుంది.

అప్పు: మా అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్

కళ్యాణ్: జరిగిన దాంట్లో కావ్య వదిన తప్పు లేదు నీకు రాహుల్ ని పట్టించాలని చాలా ప్రయత్నాలు చేశాం

రాహుల్ తప్పించుకునేందుకు అబద్ధాలు చెప్పాలని చూస్తాడు కానీ రాజ్ లాగి పెట్టి కొడతాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget