Brahmamudi April 3rd: కళావతిని వెనకేసుకొచ్చిన మిస్టర్ డిఫెక్ట్- స్వప్నని తీసుకురావడానికి వెళ్ళిన రాజ్
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్ తిక్క కుదర్చడం కోసం కావ్య కావాలని కాలు బెణికినట్టు నటిస్తుంది. దీంతో ఇంద్రాదేవి తనని ఎత్తుకుని ప్రదక్షిణలు చేయమని చెప్తుంది. వద్దని చెప్పమని రాజ్ మెల్లగా అంటాడు కానీ కావ్య మాత్రం పంతానికి అయినా ఎత్తుకునేలా చేస్తానని చెప్పి నొప్పి అని నాటకం ఆడుతుంది. దీంతో చేసేది లేక రాజ్ కావ్యని ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ఇదంతా చాటుగా స్వప్న చూస్తూ రగిలిపోతుంది. కనకం సంతోషపడుతుంది. చూడటానికి పిట్ట లాగా ఉన్నావ్ కానీ ఎత్తుకుంటే గుట్టలాగా ఉన్నావ్ అని తిట్టుకుంటూనే ప్రదక్షిణలు పూర్తి చేస్తాడు. భుజాలు నొప్పులు పుట్టి అల్లాడిపోతాడు అది చూసి కావ్య నవ్వుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి హారతి తీసుకునేందుకు చూస్తారు. ఏంటి ఈ చిన్నపిల్లల ఆటలు ఇద్దరూ కలిసి హారతి తీసుకోమని ఇంద్రాదేవి చెప్తుంది.
కళావతి టార్చర్ తగ్గేలా ఏదో ఒకటి చేయమని రాజ్ కోరుకుంటాడు. మిస్టర్ డిఫెక్ట్ పొగరు తగ్గేలా చూడమని కావ్య కోరుకోవడం ఫన్నీగా ఉంటుంది. పంతులు తీసుకొచ్చి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్తాడు. దీంతో ఇద్దరూ మొహాలు తిప్పుకుంటారు. భార్యాభర్తలిద్దరికీ కలిపి ఒకే ప్రసాదం ఇస్తారు. అందరూ గుడిలో ఒక చోట కూర్చుంటారు. రాజ్, కావ్య ప్రసాదాన్ని ఒకరి చేతిలో మరొకరు పెట్టుకుంటూ ఉంటారు. అదేంటి ఒకరికొకరు తినిపించుకోమని ఇంద్రాదేవి చెప్తుంది. అది చూసి స్వప్న కావాలని వాళ్ళ మధ్య నుంచి ప్రసాదం కింద పడేలా చేయబోతుంది. కానీ రాజ్ దాన్ని నేల పాలు కాకుండా పట్టుకుంటాడు. ఇద్దరూ మళ్ళీ కాసేపు వాదించుకుంటారు. మన కుటుంబ పరువు, ప్రతిష్టలు, అమ్మాయి భవిష్యత్ నీ చేతుల్లోనే ఉన్నాయని ఇంద్రాదేవి అంటుంది. ఇక రాజ్ భార్యకి ప్రసాదం తినిపించగానే కావ్య కూడా భర్తకి పెడుతుంది.
Also Read: జ్ఞానంబకి నడిరోడ్డు మీద వార్నింగ్ ఇచ్చిన రౌడీ తండ్రి- తప్పు ఒప్పుకుని క్షమించమన్న జానకి
అది చూసి కనకం సంతోషపడుతుంది. గుడిలో నుంచి మీనాక్షి, కనకం వెళ్తుంటే వాళ్ళకి అపర్ణ వాళ్ళు ఎదురపడతారు. మీనాక్షి జంప్ అయి వెళ్ళి ముష్టి వాళ్ళ పక్కన కూర్చుంటుంది.
అపర్ణ: ప్రశాంతంగా గుడికి కూడా రానివ్వరా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రత్యక్షమవుతారా? మేము వస్తున్నట్టు మీ అమ్మాయి చెరవేసిందా?
కనకం: నా కూతురికి ఏమి తెలియదు. మీరు వస్తున్నట్టు నాకు తెలియదు మనసు బాగోక గుడికి వచ్చాను మిమ్మల్ని చూసి వెళ్లిపోతున్నాను
అపర్ణ: నిజాలు ఎందుకు చెప్తారు అబద్ధాలు చెప్పేందుకే పుట్టారు కదా
కావ్య: ఇందులో మా తప్పేమీ లేదు మీరు కారణాలు వెతుకుతున్నారని అనుకోలేదు
అపర్ణ: ఆపు.. ఇంటి పరువు పోకూడదని నిన్ను ఈ ఇంట్లో పెట్టుకున్నా అంతే కానీ మీకు పేరు ఉన్నాయని కాదు. ఇంకోసారి ఇలా ఎదురుపడితే చీర పెట్టి మరి పుట్టింటికి పంపించాల్సి వస్తుంది
కనకం: నేను ఎదురుపడితే కూతురు కాపురం పోతుందంటే ఎదురుపడను దేవుడి సాక్షిగా చెప్తున్నా మీరు వస్తున్నట్టు నాకు తెలియదు
రాజ్: ఇది గుడి ఒక్కడికి ఒకరిని రాకూడదనే హక్కు మనకి లేదు. ఫోన్ కూడా నీ దగ్గరే ఉంది కదా కళావతి ఎలా చెప్తుంది
ఇంద్రాదేవి: నీకూతురు బాగుంటుంది నువ్వు దిగులు పడకని ధైర్యం చెప్తుంది.
Also Read: తులసమ్మ ఇంట్లో పెళ్లి భాజాలు- రాజ్యలక్ష్మి కుట్ర నుంచి దివ్యని ప్రియ కాపాడుతుందా?
స్వప్న కోపంతో రగిలిపోతుంటే రాహుల్ వచ్చి ఏమైందని అడుగుతాడు. రాజ్ అక్కడికి వచ్చారు. నువ్వు చెప్పిన దాని కంటే వందరెట్లు ఎక్కువే నటిస్తుంది. చివరికి మా అమ్మ కూడా నన్ను అసహ్యించుకునేలా చేసింది దాన్ని వదిలిపెట్టనని అంటుంది. రాజ్ కి ఎస్సై ఫోన్ చేసి కావ్య తన అక్క కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిందని చెప్పడంతో షాక్ అవుతాడు. కావ్య తన తల్లిని అపర్ణ చేసిన అవమానం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది.