News
News
X

Pawan Kalyan HHVM Update : పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'లో విలన్‌గా హిందీ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో విలన్‌గా హిందీ హీరోని ఎంపిక చేశారు. త్వరలో ఆయన షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

FOLLOW US: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu Movie). దీనికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. దాని కంటే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఇందులో ప్రతినాయకుడి పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటించనున్నారని తెలిసింది. 

ఔరంగజేబుగా బాబీ డియోల్!
Bobby Deol In Hari Hara Veera Mallu Movie : 'హరి హర వీర మల్లు' సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తున్నారు. మన భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆ కాలం నాటి సెట్స్ వేశారు.
 
మల్ల యోధుడు మల్లుగా పవన్ కనిపించనున్నారు. మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ (Bobby Deol As Aurangazeb) నటించనున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఆయన్ను దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) కలిసి కథ, పాత్ర తీరుతెన్నులు వివరించారని... బాబీ డియోల్ వెంటనే అంగీకరించారని సమాచారం. నవంబర్‌లో... అతి త్వరలో ఆయన షూటింగ్ చేయడానికి హైదరాబాద్ రానున్నారట.  

పవన్ స్పెషల్ వర్క్ షాప్స్!
'హరి హర వీర మల్లు' కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు. ఆ మధ్య స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరిగాయి. దానికి పవన్ అటెండ్ అయ్యారు. దాని కంటే ముందు కొన్ని రోజులు స్టంట్స్ ప్రాక్టీస్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తోదోర్ లాజరోవ్ నేతృత్వంలో పవన్ కల్యాణ్, ఇతర తారాగణంపై యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. 

Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా

News Reels

పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి (Nargis Fakhri) కీలక పాత్రలో కనిపించనున్నారు. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

'హరి హర వీర మల్లు' తర్వాత తమిళ హిట్ 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. అందులో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సెట్స్ మీదకు వెళుతుందని టాక్. మధ్యలో దర్శకుడు సుజీత్ పేరు కూడా వినబడుతోంది. ఆయన 'తెరి' రీమేక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అది కాకుండా స్ట్రయిట్ స్టోరీతో పవన్ హీరోగా సినిమా తీయాలని ట్రై చేస్తున్నారు. 

Published at : 29 Oct 2022 10:59 AM (IST) Tags: Krish Jagarlamudi Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Bobby Deol as Aurangazeb Bobby Deol In Hari Hara Veera Mallu

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి