Bigg Boss Telugu 7: ఈవారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్, డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరూ!
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం ఎనిమిది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. వారిలో డేంజర్ జోన్‌లో ఉన్న ఇద్దరు ఎవరు అనేదాని గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 (Telugu Bigg Boss 7) ఫైనల్‌కు ఇంకా కొన్నిరోజులే మిగిలున్నాయి. ఇప్పటినుంచి జరిగే ప్రతీ ఎలిమినేషన్ కీలకంగా మారనుంది. గతవారం గౌతమ్, అశ్విని డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలిమినేషన్ లేదని నాగార్జున ప్రకటించారు. అంతే కాకుండా వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా ఆయన బయటపెట్టారు. ప్రియాంక కెప్టెన్‌గా ఉండడంతో ఈవారం తను నామినేషన్స్‌లో లేదు. దీంతో ఎలిమినేషన్ టెన్షన్ నుంచి కూడా తప్పించుకుంది. తనతో పాటు శోభా శెట్టిని కూడా ఈవారం ఎవరూ నామినేట్ చేయకపోవడంతో తను కూడా సేవ్ అయ్యింది. అయితే ఈవారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరో బయటపడింది.
నామినేషన్స్‌లో ఉన్నది వీరే..
ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, అర్జున్, అశ్విని, గౌతమ్, శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక.. ఈ ఎనిమిది మంది ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. గతవారం జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్, కెప్టెన్సీ టాస్కులలో కంటెస్టెంట్స్ ప్రవర్తనపై ఆధారపడే ఎక్కువగా నామినేషన్స్ జరిగాయి. కానీ అశ్విని మాత్రం తన దగ్గర ఇంకెవరినీ నామినేట్ చేయడానికి కారణాలు లేవని, సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేయను అని సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇక ఎప్పటిలాగానే పల్లవి ప్రశాంత్, శివాజీలు ఎక్కువ ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఓట్ల విషయంలో చివరిలో ఉండే ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఇక ఈ డేంజర్ జోన్‌లో అశ్విని, అర్జున్ ఉన్నట్టు సమాచారం.
సేఫ్ అయిన రతిక..
ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్‌దీప్‌లకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో కాస్త ఎక్కువ, తక్కువ అయినా ఈ నలుగురు కచ్చితంగా సేఫ్‌గా ఉంటారు. వీరిని పక్కన పెడితే.. రతిక, గౌతమ్, అశ్విని, అర్జున్‌లు ఓట్ల విషయంలో చివర్లో ఉంటారు. రతిక.. హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన ఆటతీరు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోలేకపోతోంది. అందుకే ఇప్పటికే మూడుసార్లు తను డేంజర్ జోన్‌లోకి వెళ్లొచ్చింది. ఇప్పుడిప్పుడే గొడవల్లో కాస్త యాక్టివ్ అవుతూ రతిక.. ఓటింగ్ విషయంలో మెరుగుపడినట్టు సమాచారం. గౌతమ్ ప్రవర్తన, మాటలు కరెక్ట్ అనుకుంటూ తనకు ఓటు వేసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇక మిగిలిన అశ్విని, అర్జున్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆట బాగున్నా ఓట్లు లేవు..
మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అశ్వినికి ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేదు. తన ఆట కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది కాబట్టి ముందు నుంచి తనకు ఎక్కువగా ఓటింగ్ పడలేదు. దీంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్‌లో అశ్విని.. బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్జున్ మంచి ప్లేయర్ అని గుర్తింపు తెచ్చుకున్నా కూడా ఎందుకో ఓటింగ్ విషయంలో మాత్రం తనకు అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. తన ఆట నచ్చినా కూడా ఎందుకో ప్రేక్షకులు మాత్రం తనకు ఓటు వేయడానికి ఎక్కువగా ముందుకు రావట్లేదు. ఈవిధంగా చూస్తే.. ఈవారం అశ్విని ఎలిమినేట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. అర్జున్ విషయంలో ఓటింగ్ అనేది వెంటనే ఇంప్రూవ్ అవ్వకపోతే తన కూడా బిగ్ బాస్‌ను వదిలి వెళ్లక తప్పదు.
Also Read: టాలీవుడ్ మన్మథుడు, ‘బిగ్ బాస్’ హోస్ట్ ఆస్తుల విలువ అన్ని వేల కోట్లా?