Nagarjuna Akkineni: 'బిగ్ బాస్ 9' సెట్‌లో కింగ్ అక్కినేని నాగార్జునను కలిసిన TFJA నూతన కమిటీ
Telugu Film Journalists Association: 'బిగ్ బాస్' రియాలిటీ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఆయన్ను నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

బిగ్ బాస్ అంటే తెలుగు ప్రజలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). మొదటి రెండు మూడు సీజన్స్ మినహాయిస్తే కొన్నేళ్లుగా ఆ షో హోస్ట్ చేస్తున్నది ఆయనే. ప్రస్తుతం 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 జరుగుతోంది. ఆ సెట్‌లో నాగార్జునను ఇటీవల నూతనంగా ఎన్నిక అయినటువంటి 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్' (Telugu Film Journalists Association) కమిటీ మర్యాదపూర్వకంగా కలిసింది.
నాగార్జునకు సంక్షేమ కార్యక్రమాలు వివరించిన కమిటీ
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ)లో 220 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు టీఎఫ్‌జేఏ హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ అందిస్తోంది. అలాగే, పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిని నాగార్జునకు కమిటీ వివరించారు. ప్రస్తుత సంక్షేమ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడంతో పాటు సభ్యుల ఉన్నతికి తమ కమిటీ కృషి చేస్తుందని నాగార్జునకు తెలియజేసింది.
Also Read: వెండితెరకు మోహన్ లాల్ కూతురు... విస్మయ ఫస్ట్ సినిమా షురూ... దర్శకుడు ఎవరంటే?
బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో కింగ్ నాగార్జునను కలిసిన TFJA కమిటీ.
— Telugu Film Journalists Association (@FilmJournalists) October 30, 2025
ఇటీవల నూతనంగా ఎన్నికైన TFJA కమిటీ మెంబర్స్ నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కమిటీ మెంబర్స్ ఉన్నారు.@iamnagarjuna @BiggBoss pic.twitter.com/kAYnU34Ss9
సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించిన అక్కినేని నాగార్జున
సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్‌జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నాగార్జున ప్రశంసించారు. అంతే కాకుండా... టీఎఫ్‌జేఏకి అక్కినేని కుటుంబం నుంచి తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని నూతన కమిటీకి నాగార్జున తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు సహా ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ఉపాధ్యక్షులు వంశీ - ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శి జీవీ రమణ, ఇతర సభ్యులు ఉన్నారు.
Also Read: మహేష్ మేనకోడలు ఫస్ట్ హీరో ఎవరు? కూతురి మొదటి సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీతో మంజుల!





















