Vismaya Mohanlal: వెండితెరకు మోహన్ లాల్ కూతురు... విస్మయ ఫస్ట్ సినిమా షురూ... దర్శకుడు ఎవరంటే?
Vismaya Mohanlal Debut Film Thudakkam: మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ కుమార్తె విస్మయ మొదటి సినిమా పూజతో మొదలైంది. నటిగా ఆమె వెండితెరపైకి రానున్నారు.

మలయాళ అగ్ర కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన మోహన్ లాల్ (Mohanlal) వారసుడు ఇండస్ట్రీకి వచ్చారు. 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న... 'డెయిస్ ఇరాయ్'తో అక్టోబర్ 31, 2025న థియేటర్లలోకి వస్తున్న ప్రణవ్ మోహన్ లాల్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మోహన్ లాల్ వారసురాలు వస్తున్నారు. ఆయన కుమార్తె విస్మయ కథానాయికగా రానున్నారు. పూజ కార్యక్రమాలతో ఆమె మొదటి సినిమా మొదలైంది.
'తుడక్కం'తో విస్మయ ప్రయాణం మొదలు!
Vismaya Mohanlal First Movie Starts With Pooja: 'తుడుక్కం' సినిమాతో విస్మయ మోహన్ లాల్ వెండితెరకు పరిచయం కానున్నారు. కేరళలోని కొచ్చిలో ఈ రోజు పూజ కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మోహన్ లాల్, సుచిత్ర దంపతులతో పాటు విస్మయ అన్నయ్య ప్రణవ్ మోహన్ లాల్ సైతం ఈ పూజకు హాజరు అయ్యారు. ఇంకా చిత్రసీమ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
എന്റെ പ്രിയപ്പെട്ട മായക്കുട്ടിക്ക്, എല്ലാ പ്രാർത്ഥനകളും.
— Antony Perumbavoor (@antonypbvr) July 1, 2025
ഒരു മികച്ച ‘തുടക്കം’ നേരുന്നു.
All the best, Maya Kutty!♥️ #Thudakkam #TheBeginning #VismayaMohanlal #JudeAnthanyJoseph pic.twitter.com/XMgzlWRyoU
వెండితెరకు విస్మయ పరిచయం కానున్న సినిమా ప్రారంభోత్సవంలో మోహన్ లాల్ మాట్లాడుతూ... ''మా పిల్లలు సినిమాల్లో నటిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే... వాళ్ళ వ్యక్తిగత జీవితానికి మేం పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వాళ్ళ గోప్యతను గౌరవించాం. సుచి, నేను అన్నింటికీ అంగీకరించాం. అప్పు (ప్రణవ్), మాయ (విస్మయ) సినిమాల్లోకి రావాలనేది ఆంటోనీ కోరిక. కాలంతో పాటు నేను ముందుకు సాగాను. ప్రేక్షకులు నన్ను నటుడిని చేసి 48 ఏళ్ళు ఇండస్ట్రీలో నిలబెట్టారు. ఇప్పుడు మా పిల్లలను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నేను ఓ అద్భుతంలా భావిస్తా. అందుకే మా అమ్మాయికి విస్మయ అని పేరు పెట్టాను. సినిమాల్లో నటించడం అంత తేలికైన విషయం కాదు. మా అమ్మాయి విస్మయ ట్రైనింగ్ తీసుకుంది. చాలా నేర్చుకుంది. మాకు నిర్మాణ సంస్థ ఇది. మాతో పాటు ఓ నిర్మాత కూడా ఉన్నారు. అందుకే... సరైన కథ దొరికినప్పుడు విస్మయను సినిమాల్లోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నాం'' అన్నారు. ఈ సినిమాలో ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు సైతం కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
Also Read: అప్పుడు అమ్మను రానివ్వలేదు... ఇప్పుడు కూతుర్ని మహేష్ ఫ్యాన్స్ వద్దంటారా?
#Thudakkam:
— AB George (@AbGeorge_) October 30, 2025
Starring Vismaya, Aashish Joe and Mohanlal.
Directed by Jude Anthany Joseph
DOP Jomon T John
Music Jakes Bejoy
Editor Chaman Chacko
Stunt Choreography Yannick Ben & Stunt Silva
Produced by Antony Perumbavoor under Aashirvad Cinemas banner & Gemini.
May 1, 2026… pic.twitter.com/KhHYTvQ6M6
'2018' దర్శకుడితో... విడుదల ఎప్పుడంటే?
Thudakkam movie director and release date: 'తుడక్కం' చిత్రానికి '2018' ఫేమ్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. విస్మయతో పాటు మోహన్ లాల్, ఆశిష్ జోయ్ ఇతర ప్రధాన తారాగణం. మే 1, 2026లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం పూజ చేశారు. కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సంస్థలో 37వ చిత్రమిది.
Also Read: ఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?





















