అన్వేషించండి

Tasty Teja vs Gowtham Prerana: ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోయిన టేస్టీ తేజ... గౌతమ్ - ప్రేరణలపై ఎందుకంత ఫైర్? కావాలనే చేస్తున్నాడా?

Bigg Boss 8 Telugu: కూల్ అండ్ కామ్ అనుకున్న టేస్టీ తేజ మెల్లమెల్లగా ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోతున్నాడా? గౌతమ్, ప్రేరణపై ఎందుకు అంట ఫైర్ అయ్యాడు? కావాలని చేస్తున్నాడా? అతని గేమ్ మీద అనాలసిస్....

బిగ్ బాస్ (Bigg Boss 8) సీజన్లు అన్నిటినీ కలిపి చూసినా సరే 'టేస్టీ' తేజ కంటే తెలివైన కటిస్టెంట్ కనపడడు. 'బిగ్ బాస్' ఒక టాస్క్ పెడితే దాని వెనక స్ట్రాటజీ ఏమై ఉంటుందో ముందుగానే ఊహించి చెప్పగల సమర్డుడు డు టేస్టీ తేజ (Tasty Teja). ఈ సీజన్లో అయితే మైండ్ గేమ్ తో పాటు ఫిజికల్ టాస్క్ ల్లోనూ అదరగొడుతున్నాడు. అయితే నిన్నటి నుంచి మాత్రం మరో హౌస్ మేట్ గౌతమ్ (Gautham Krishna)తో అనవసర గొడవలు పెట్టుకుంటున్నాడు. ప్రేరణతో (Prerana Kambam)ను కారణం లేని చోట దోశెల విషయంలో పెద్ద రచ్చే చేశాడు. నిజానికి ఆ సమయంలో దోసెలు వేయవలసిన పని ప్రేరణది కాదు. అయినప్పటికీ ఆమె హౌస్ మేట్స్ అందరి కోసం ఆ పని చేస్తుంటే కావాలనే గొడవ పెట్టుకున్నట్టు తేజ వైఖరి చూస్తే అర్థమవుతుంది. తేజ మాటలతో విసిగిపోయిన ప్రేరణ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఏడ్చింది.

గౌతమ్ కృష్ణతోనూ అనవసర పంచాయితీ
ఏ గ్రూపులోనూ చేరకుండా 'సోలో బాయ్'గా ఆడే గౌతమ్ కృష్ణతోనూ తేజ గొడవ పెట్టుకున్నాడు. కారణం అంతకుముందు జరిగిన 'టికెట్ టూ ఫినాలే' కంటెండర్  కోసం జరిగిన మూడో టాస్క్ లో తనను ఎంచుకోలేదని గౌతమ్ కృష్ణపై కోపం చూపించాడు. గౌతమ్ ఆ టాస్క్ లో ప్రేరణను కంటైనర్ గా సెలెక్ట్ చేయడం తేజకు నచ్చలేదు. నిజానికి గౌతమ్ అలాంటి వాగ్దానం ఏది తేజతో గాని వేరే ఏ హౌస్ మేట్ తో గాని చేయలేదు. పైపెచ్చు అంతకు ముందు జరిగిన టాస్క్ వన్ లో పోటీపడి మరీ తేజ లాస్ట్ లో వచ్చాడు. నిజానికి సంచాలకులుగా వచ్చిన ఎక్స్ హౌస్ మేట్స్ అఖిల్, హారికలు టికెట్ టూ ఫినాలేలో పాల్గొనకుండా తేజకు బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాల్సి ఉన్నా బిగ్ బాస్ మొత్తం సీజన్ పెర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని దానికి విష్ణుప్రియకి ఇచ్చారు. దానితో బతికిపోయిన తేజ  టాస్క్ త్రీలో తనను కంటెండర్ గా ఎంచుకోలేదంటూ గౌతమ్ మీద అనవసరంగా గొడవకు వెళ్లాడు. గౌతమ్ గేమ్ ను ఎక్స్ పోజ్ చేస్తానని "అతను సోలోగా ఆడుతున్నాడు" అనే ముద్ర కోసం ప్రయత్నిస్తున్నాడని నెక్స్ట్ నామినేషన్స్ లో ఈ పాయింట్లు చెబుతానని గౌతమ్ గురించి ఇతర హౌస్మేట్ల దగ్గర మాట్లాడాడు. విచిత్రం ఏంటంటే గౌతం చెప్పేదీ అదే. అలాంటప్పుడు గౌతం ఆటను కొత్తగా ఎక్స్ పోజ్ చేసేది ఏంటో తేజకే తెలియాలి. తేజ మాటలతో ఏడ్చిన గౌతమ్ ఎప్పటిలాగే కెమెరాలతో తను గోడు చెప్పుకున్నాడు. దానిని కూడా తేజ తప్పుపట్టాడు.

Also Read: చేజేతులా గేమ్ పాడుచేసుకున్న నబీల్... ఇలా ఆడితే బిగ్ బాస్‌ టైటిల్ నెగ్గడం కష్టమేనా?

ఇప్పుడు టేస్టీ తేజ కావాలనే ఇదంతా చేస్తున్నాడా?
ఈ వారం నామినేషన్స్ లో తేజ ఉన్నాడు. తాను ఎక్కడ ఈ వారం ఎలిమినేట్ అవుతాడో అనే భయంతో డిప్రెషన్ లోకి వెళ్లి తేజ ఇలా చేస్తున్నాడా అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. లేకుంటే ఎప్పుడూ బ్యాలెన్స్ తో  ఉంటూ తెలివిగా ఆడే తేజ  ఇలా చిరు బుర్రు లాడుతూ రెండు రోజుల నుంచి హౌస్ లో నస పెట్టడం ఏంటనేది తన అభిమానులే అంటున్నారు. మరోవైపు ఇదంతా ఒక స్ట్రాటజీ అనీ నామినేషన్స్ లో ఉండడంతో  వీలైనంత స్క్రీన్ స్పేస్ పొందడం కోసం  తేజ కావాలనే ఇలా  గౌతమ్, ప్రేరణలతో గొడవ పెట్టుకున్నాడని ఇంకో వాదన వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తేజ పథకం ఏ మేరకు ఫలించిందో ఈవారం తెలిసిపోతుంది.

Also Readరోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget