Tamanna Simhadri: అప్పుడు నారా లోకేష్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ - బలమైన ప్రత్యర్థులపై బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ
Tamanna Simhadri: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన తమన్నా సింహాద్రి.. ఇప్పుడు ఏకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు పోటీ అభ్యర్థిగా నిలబడుతోంది. గత ఎన్నికల్లో కూడా నారా లోకేష్‌పై పోటీ చేసి ఓడిపోయింది.
Tamanna Simhadri Contests Against Pawan Kalyan In Pithapuram: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా పిఠాపురంలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ ఏడాది ఎలా అయినా జనసేనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే సినీ సెలబ్రిటీలు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారానికి మద్దతునివ్వడానికి ముందుకొస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు పోటీగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన తమన్నా సింహాద్రి రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన తమన్నా.. నారా లోకేష్‌కు పోటీగా నిలబడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై పోటీకి దిగడంపై ఆమె స్పందించారు.
ఏం జరుగుతుందో తెలియదు..
భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తమన్నా సింహాద్రి.. పవన్ కళ్యాణ్ జనసేనకు పోటీగా పిఠాపురం ఎన్నికల్లో నిలబడ్డారు. ఆ విషయంపై ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఉండే అంచనాలకు, నిజానికి జరిగేదానికి చాలా తేడా ఉంటుందన్నారు. తాను పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని బయటపెట్టారు. తమ పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయమని ఆదేశించడంతో మరో మాట మాట్లాడకుండా పోటీకి దిగానని వివరించారు తమన్నా సింహాద్రి.
బలమైన ప్రత్యర్థి..
గతంలో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేశారు తమన్నా సింహాద్రి. తాను పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్నానంటూ తన కోరికను బయటపెట్టారు. కానీ ఆయన ఇప్పుడు సీఎం అయ్యే పరిస్థితిలో లేరని, అందుకే ఆయనపై పోటీకి దిగుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఒక్కరు బలమైన ప్రత్యర్థి కావాలనే కోరుకుంటారని, అందుకే తాను పవన్ కళ్యాణ్‌కు బలమైన ప్రత్యర్థి అనే ఉద్దేశ్యంతో తనపై పోటీకి దిగడానికి ఒప్పుకున్నానని తెలిపారు. అంతే కాకుండా ప్రజల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకొని తాను ఈ నిర్ణణం తీసుకున్నట్టు ప్రకటించారు.
View this post on Instagram
దానివల్లే బిగ్ బాస్ అవకాశం..
గత ఎన్నికల విషయానికొస్తే.. అప్పట్లో మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు తమన్నా సింహాద్రి. కానీ ఆ పోటీలో తాను గెలవలేకపోయారు. అందుకే అప్పటి ఓటమి అనుభవాలను గుర్తుపెట్టుకొని ఇప్పుడు కచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురంలో ప్రచారం విషయంలో కూడా ఏ మాత్రం విరామం లేకుండా ప్రజలను కలుస్తూ తమ హామీల గురించి చెప్పుకొస్తున్నారు తమన్నా. గత ఎన్నికల్లో నారా లోకేష్‌పై పోటీ చేయడం వల్లే తనకు బిగ్ బాస్‌లో అవకాశం కూడా వచ్చింది. రాజకీయాలంటే అస్సలు ఐడియా లేనివారు తమన్నా సింహాద్రిని ఇప్పటికీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌లాగానే గుర్తుపడతారు.
Also Read: బాబాయి కోసం అబ్బాయి ప్రచారం - పవన్ కళ్యాణ్ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు