By: Haritha | Updated at : 15 Dec 2022 11:09 AM (IST)
(Image credit: Instagram)
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ తెలియడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది. టాప్ 5 కంటెస్టెంట్లు ఫైనల్‌కి చేరుకుంటారు. ప్రస్తుతం ఆరుగురు ఇంట్లో ఉన్నారు.ఈ ఆరుగురిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజే ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్లేది. కాగా ఇప్పటికే శ్రీసత్యను ఎలిమినేట్ అయినట్టు సమాచారం వస్తోంది. ఈ రోజు రాత్రికి ఇది టెలీకాస్ట్ చేసే అవకాశం ఉంది. నిజానికి శ్రీసత్య ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. ఆమెకు ప్రేక్షకుల్లో వ్యతిరేకత బాగా ఉంది. అయినా ఆమె ఇంతవరకు ఎలా నెగ్గుకొచ్చిందో అనే సందేహం కూడా చాలా మందికి వచ్చింది.అందులోనూ ఇనాయను బయటికి పంపి, శ్రీసత్యను ఇంట్లో ఉంచడంతో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇప్పుడు శ్రీసత్యను బయటికి పంపిస్తే కాస్త ఆ వ్యతిరేకత తగ్గుతుందనుకుని ఉంటారు బిగ్ బాస్ టీమ్.
ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో నెగిటివిటీ మూటకట్టుకున్న అమ్మాయి శ్రీసత్య. ఇనాయను, కీర్తిని ఆమె వ్యక్తిగతంగా దాడి చేసి బాధపడేలా చేసింది. ముఖ్యంగా ఫిజికల్ గా వెక్కిరించడం, అర్జున్ కళ్యాణ్‌ను ఆట కోసం వాడుకోవడం కూడా చాలా చికాకు పుట్టించింది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీసత్య, ఆదిరెడ్డి ఓటింగ్ లో కింద ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారందరికీ వీరి కన్నా ఎక్కువగానే ఓటింగ్ వచ్చిందని సమాచారం. ఆదిరెడ్డికి అంత నెగిటివిటీ లేదు, అందుకే ఆయన్ను ఉంచి శ్రీసత్యను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది.
విజేత ఆయనేనా?
బిగ్ బాస్ 6 విజేత అయ్యే అవకాశం రేవంత్‌కే ఉందని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ మధ్యలో రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా చివరి నాలుగువారాలుగా రోహిత్ గ్రాఫ్ కూడా పెరిగింది. దీనికి కారణం రోహిత్ బాగా ఆడినా కూడా ఉడుకుమోతుతనం, కోపం, ప్రతి దానికి గొడవలు పడడం, ఓటమిని తీసుకోలేకపోవడం, చీటికి మాటికి అరవడం ఇవన్నీ ప్రేక్షకులకు చిరాకును కలిగిస్తున్నాయి. ఇక రోహిత్ నిదానంగా ఆడుతున్నాడు. భావోద్వేగాల విషయంల్ చాలా కంట్రోల్ గా ఉంటున్నాడు. ఎవరినీ ఇంతవరకు బాధపెట్టలేదు.రేవంత్‌లా బట్టలు చించుకుని ఆడడం లేదు కానీ, ఉన్నంతలో తన నేచర్‌ను బట్టి బాగానే ఆడుతున్నాడు. బిగ్ బాష్ అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట. ఇందులో గెలవాలంటే ఫిజికల్ టాస్కులు గెలిస్తే సరిపోదు, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకుని నిలబడాలి. ఇలా చూసుకుంటే రోహిత్, రేవంత్ కన్నా చాలా బెటర్ అనిపిస్తాడు.
Also read: కీర్తిని ఒంటరి మహా వృక్షంతో పోల్చిన బిగ్‌బాస్ - ప్రేక్షకులను కూడా ఏడిపించేశాడు
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?