Vithika Sheru: సింపతీ కోసమే వితిక అబద్దం చెప్పిందా? అప్పుడలా ఎందుకు చెప్పావంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్!
Vithika Sheru: తాజాగా వితిక షేరు.. ఒక పోడ్కాస్ట్‌లో పాల్గొంది. ఒకప్పుడు తను రిచ్ అన్న వితిక.. ఇప్పుడేంటి తన ఆర్థిక పరిస్థితులు బాలేవు అంటుంది అంటూ నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
![Vithika Sheru: సింపతీ కోసమే వితిక అబద్దం చెప్పిందా? అప్పుడలా ఎందుకు చెప్పావంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్! social media is filled with negative comments on Vithika Sheru after appearing in a podcast Vithika Sheru: సింపతీ కోసమే వితిక అబద్దం చెప్పిందా? అప్పుడలా ఎందుకు చెప్పావంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/05/f0e791e4d7456287f42f234938f9261e1714892774412802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vithika Sheru Podcast: కొందరు సినీ సెలబ్రిటీలు సింపతీ కోసం ఏది కావాలంటే అది చెప్తారు అనే కామెంట్స్ తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈమధ్యకాలంలో ఇలాంటి సింపతీ డ్రామాలు ఎక్కువయ్యాయని నెటిజన్లు ఎక్కువగా ఫీలవుతున్నారు. అందుకే చాలామంది సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ వితిక షేరు కూడా అదే లిస్ట్‌లోకి చేరింది. తన బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ విజయేంద్ర సింహా ప్రారంభించిన పోడ్కాస్ట్ షోకు గెస్ట్‌గా వచ్చింది వితిక. అందులో తన ఆర్థిక పరిస్థితుల గురించి వితిక చేసిన వ్యాఖ్యలు.. తనపై నెగిటివిటీని తెచ్చిపెడుతున్నాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ప్రారంభమయిన తర్వాత మొదటిసారి అందులో కంటెస్టెంట్స్‌గా పాల్గొనడానికి ఒక కపుల్‌ను పిలిచారు. వారే వరుణ్ సందేశ్, వితిక షేరు. వీరిద్దరూ ఒక పర్ఫెక్ట్ కపుల్‌గా బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయినా కూడా అందులోకి వెళ్లినప్పటి నుండి గొడవలు పడుతూనే ఉన్నారు. అంతే కాకుండా అందులో వీరి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. అప్పుడే వరుణ్ సందేశ్ కంటే తమకే ఆస్తి ఎక్కువగా ఉందని బయటపెట్టింది వితిక. కానీ తాజాగా నిఖిల్‌తో పాల్గొన్న పోడ్కాస్ట్‌లో మాత్రం తను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది. అప్పుడు అలా మాట్లాడింది, ఇప్పుడు ఇలా అంటోంది అంటూ నెటిజన్లంతా నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
చులకనగా చూశారు..
వరుణ్ సందేశ్ కంటే ముందే వితిక షేరు.. ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ వరుణ్ కనీసం ఒకట్రెండు సినిమాలతో అయినా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వితికకు మాత్రం చెప్పుకోవడానికి ఒక్క సరైన బ్రేక్ కూడా దొరకలేదు. ఈ పొడ్కాస్ట్‌లో తనకు బ్రేక్ దొరకకపోవడంపై అభిప్రాయాన్ని బయటపెట్టింది వితిక. తనను చులకనగా చూసేవారని, నిర్మాతలు కమిట్మెంట్ అడిగేవారని గుర్తుచేసుకుంది. ఇక తనకు 11,12 ఏళ్లు వచ్చేసరికే తనపై చాలామంది ఆధారపడి ఉండేవారని చెప్పుకొచ్చింది. అది విన్న తర్వాత.. బిగ్ బాస్‌లో చెప్పినట్టుగా తనకు అంత ఆస్తి ఉండుంటే తనపై అంతమంది ఎందుకు ఆధారపడేవారు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.
కమిట్మెంట్ కావాలి..
పాడ్ కాస్ట్లో వితిక షేరు చెప్పిన మాటలు విన్న తర్వాత చాలామంది తను సింపతీ కోసమే అబద్ధాలు చెప్తుంది అంటూ నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా తనకు, వరుణ్ సందేశ్‌కు పెళ్లయ్యి ఎన్నో ఏళ్లు అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి కారణాన్ని కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది వితిక. వాళ్లు అమెరికాలో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ అయ్యానని కానీ అప్పటికీ తను తల్లి అవ్వడానికి సిద్ధంగా లేనని చెప్పుకొచ్చింది. పిల్లల్ని కనాలంటే చాలా కమిట్మెంట్ కావాలని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. మొత్తంగా ఈ పాడ్‌కాస్ట్ వల్ల వితిక షేరుపై పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)