అన్వేషించండి

Sivaji: ఫౌల్ గేమ్స్ ఆడినవాడిని రన్నరప్ చేశారు, నాగార్జునకు చెడ్డ పేరు వస్తుంది - శివాజీ

Sivaji about Amardeep: బిగ్ బాస్ సీజన్ 7కు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వగా.. అమర్‌దీప్ రన్నర్‌గా నిలిచాడు. ఇక అమర్ రన్నర్ అవ్వడంపై తాజాగా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు శివాజీ.

బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 3వ కంటెస్టెంట్‌గా నిలిచాడు శివాజీ. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా అప్పటికే ప్రేక్షకులకు శివాజీ ఎవరో బాగా తెలుసు. కానీ అసలు శివాజీ బయట ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు అనే విషయాలను బిగ్ బాస్ ద్వారానే తెలుసుకున్నారు ప్రేక్షకులు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుంచి శివాజీ ఆటతీరు చూసి తానే విన్నర్ అవుతాడని చాలామంది అనుకున్నారు. కానీ మెల్లగా పల్లవి ప్రశాంత్ టాప్ స్థానానికి చేరుకున్నారు. అయితే శివాజీ కనీసం రన్నర్ అయినా అవుతాడు అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. అమర్‌దీప్ రన్నర్ అవ్వడంపై తాను తాజాగా స్పందించాడు.

‘స్పా’ బ్యాచ్‌పై మరోసారి కామెంట్స్

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంతవరకు సీరియల్ బ్యాచ్‌తో పోటీపడుతూనే ఉన్నాడు శివాజీ. తనకు, పల్లవి ప్రశాంత్, యావర్‌కు మంచి స్నేహం కుదరడంతో ఈ ముగ్గురు పేర్లు కలిపి ‘స్పై’ అనే పేరుతో ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, యావర్‌లను ప్రతీ విషయంలో ఎప్పుడూ తోడుగా ఉండి సపోర్ట్ చేసేవాడు శివాజీ. అలాగే మిగతా కంటెస్టెంట్స్ కూడా సలహాల కోసం వచ్చినప్పుడు వారితో కూడా బాగానే మాట్లాడేవాడు. కానీ శోభా, ప్రియాంకలతో మాత్రం శివాజీ ఎప్పుడూ నెగిటివ్‌గానే ఉండేవాడు. అంతే కాకుండా వారిపై పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడు. అదే  విషయంపై నాగార్జునతో తీవ్రమైన వాగ్వాదం కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ అయిపోయి హౌజ్ నుంచి బయటికి వచ్చినా కూడా ‘స్పా’ బ్యాచ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం లేదు శివాజీ.

అంచనా వేశాను

శోభా శెట్టి ప్రవర్తన లిమిట్ దాటిపోయిందని, అందుకే మా ఇంట్లో ఆడపిల్లలయితే అలా చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చానని శివాజీ.. తన మాటలను సమర్థించుకున్నారు. బిగ్ బాస్ సీజన్ సగం పూర్తయ్యేసరికి ఎవరు విన్నర్, ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయిలాంటి విషయాలను అంచనా వేశానని బయటపెట్టాడు. అదే క్రమంలో 1,2,3 స్థానాలు మనకు దక్కబోతున్నాయని ఒకసారి పల్లవి ప్రశాంత్‌కు తాను చెప్పినట్టు కూడా గుర్తుచేసుకున్నాడు శివాజీ. అయితే తాను ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్‌నే బిగ్ బాస్ హైలెట్ చేస్తూ వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ కంటెస్టెంట్ పేరు చెప్పకపోయినా.. అమర్ గురించే శివాజీ ప్రస్తావిస్తున్నాడని అందరికీ అర్థమయ్యింది.

గుర్తింపు దక్కలేదు

బిగ్ బాస్ కూడా అతడిని పొగడం తనకు నచ్చలేదని, అతడు చపాతీలు చేస్తే చాలా బాగున్నాయని నాకు కూడా పంపించమని బిగ్ బాస్ అడిగారు కానీ నేను వడలు చేయించినప్పుడు నాకు కనీసం గుర్తింపు దక్కలేదని శివాజీ వాపోయాడు. ఎన్నోసార్లు ఫౌల్ గేమ్ ఆడినా కూడా ఆ కంటెస్టెంట్‌నే రన్నరప్ చేశారని అమర్ గురించి మాట్లాడాడు శివాజీ. బిగ్ బాస్ చేసిన తప్పుల వల్ల నాగార్జునకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని నాగార్జునకు కూడా స్వయంగా చెప్తానని అన్నాడు. న్యాయంగా అయితే టాప్ 3లో పల్లవి ప్రశాంత్, యావర్, తాను ఉండాలని స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. ఇక ప్రేక్షకుల్లో కూడా చాలామంది శివాజీనే రన్నర్ అని ఊహించారు.

Also Read: ఊహించని విధంగా ‘బిగ్ బాస్’ శోభాశెట్టి ఎంగేజ్‌మెంట్ - మళ్లీ ఎప్పుడూ రానన్న ప్రియుడు యశ్వంత్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget