Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల స్ట్రాటజీని బయటపెట్టిన వైరల్ వీడియో - శివాజీ చెప్పింది నిజమేనా?
బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ వేసిన అంచనాలు చాలావరకు కరెక్ట్‌గానే ఉన్నాయి. తాజాగా ఆయన అంచనాను నిజం చేసే వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
![Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల స్ట్రాటజీని బయటపెట్టిన వైరల్ వీడియో - శివాజీ చెప్పింది నిజమేనా? sivaji guesses right about amardeep and priyanka and the video which proves this is going viral Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల స్ట్రాటజీని బయటపెట్టిన వైరల్ వీడియో - శివాజీ చెప్పింది నిజమేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/bf3248596259a3f6f07f1283c9b46a891700147444535239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7)లో టాప్1 కంటెస్టెంట్ ఎవరు అంటే చాలామంది శివాజీ అనే పేరే చెప్తున్నారు. తాజాగా జరిగిన ఫ్యామిలీ వీక్‌లో కూడా ఇతర కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కూడా చాలావరకు శివాజీకే సపోర్ట్ చేస్తూ.. తానే నెంబర్ 1 అని అన్నారు. ఇక ఇటీవల జరిగిన టాప్ 1 నుంచి 10 టాస్క్‌లో కూడా చాలామంది కుటుంబ సభ్యులు తనకు టాప్ 1 స్థానం ఇచ్చారు కాబట్టి తాను కూడా టాప్1కే అర్హుడు అనుకుంటున్నానని శివాజీ చెప్పాడు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా చాలావరకు తననే టాప్ 1 అని ఒప్పుకున్నారు. అలాంటి శివాజీ.. ఇతర కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్పినా అది నిజం అయిపోవడం కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ప్రియాంక, అమర్‌దీప్‌ల గురించి శివాజీ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ నిజమే అని తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అమర్‌దీప్ (Amardeep), ప్రియాంక (Priyanka Jain), శోభా శెట్టి(Shobha Shetty)లకు కలిపి స్టార్ మా బ్యాచ్ అని ట్యాగ్ ఇచ్చేశాడు శివాజీ (Shivaji). అందులోనూ ముఖ్యంగా అమర్‌దీప్, ప్రియాంక కలిసి ఆడుతున్నారంటూ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాడు. తాను ఏం చెప్పినా అమర్‌దీప్ నెగిటివ్‌గానే తీసుకుంటాడని, ఎందుకో ముందు నుంచి తనపై అమర్‌కు నెగిటివ్ అభిప్రాయం ఉందని శివాజీ పలుమార్లు బయటపెట్టాడు. ప్రియాంక, అమర్ కలిసి ఆడుతున్నారు అని ఆరోపించినా.. వారిద్దరూ ఎప్పుడూ ఈ మాటను ఒప్పుకోలేదు. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవ్వకముందే ఎలా ఆడాలో నిర్ణయించుకొని వచ్చారని కూడా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కున్నారు ప్రియాంక, అమర్. అయితే అది నిజమేనేమో అనిపించేలా తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మేకింగ్ వీడియోతో నిజాలు బయటికి..
అమర్‌దీప్, ప్రియాంక కలిసి సీరియల్స్‌లో నటించారు. దీంతో వారికి ఎంతోకాలంగా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యే కొన్నిరోజుల ముందే వారు ఒక ఆల్బమ్ సాంగ్‌లో కలిసి నటించారు. తాజాగా ఆ ఆల్బమ్ సాంగ్ విడుదలయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే ఆల్బమ్ సాంగ్ హిట్ అవ్వడంతో.. మేకర్స్.. దీని మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ మేకింగ్ వీడియోలో వారు పెట్టుకున్న టోపీలు (తట్టలు) బాగున్నాయని బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకెళ్దామని ప్రియాంక చెప్పింది. త్వరలోనే వెళ్తున్నాం కదా తీసుకెళ్దాం అని ప్రియాంక.. అమర్‌దీప్‌తో చెప్పింది. దీంతో వీరు ముందు నుండే బిగ్ బాస్ గురించి చర్చించుకున్నారని శివాజీ చేసిన ఆరోపణలు నిజమయ్యాయి.
శివాజీ స్టేట్‌మెంట్ నిజమే..
ప్రియాంక మాట్లాడిన వీడియోతో పాటు శివాజీకి ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘వాళ్లు ఒక స్ట్రాటజీతోనే వచ్చారు. ఏ దేవుడి దగ్గర నిలబడి ప్రమాణం చేయమన్నా చేస్తా. ముందే నుండే ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి అని మాట్లాడుకున్నారు’’ అని శివాజీ.. అర్జున్, పల్లవి ప్రశాంత్‌లతో చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. దీంతో శివాజీ ఏం చెప్పినా కరెక్ట్‌గానే ఉంటుంది అని ప్రేక్షకులు మరోసారి ఫిక్స్ అయిపోతున్నారు.
View this post on Instagram
Also Read: ‘బిగ్ బాస్’లో భార్యాభర్తలు - గర్భం దాల్చిన హౌస్‌మేట్, బీబీ హౌస్‌లోనే టెస్టులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)