(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు సపోర్ట్‌గా స్పై బ్యాచ్, అర్జున్‌పై రివెంజ్ కోసమేనా?
Bigg Boss 7 Telugu: ప్రస్తుతం జరుగుతున్న ఫినాలే అస్త్రా టాస్కులో స్పై బ్యాచ్ అంతా కలిసి అమర్‌దీప్‌కు సపోర్ట్ చేస్తోంది. కానీ దాని వెనుక వారికి పర్సనల్ కారణాలు ఉన్నాయని అర్థమవుతోంది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నకొద్దీ కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు పెరుగుతూ వస్తున్నాయి. ఎవరు ఏం చేసినా, ఏం మాట్లాడిన మరొకరు తప్పుగానే తీసుకుంటున్నారు. అందుకే ఎక్కువగా ఎవరి స్ట్రాటజీలు వారు ఉపయోగిస్తూ.. ఎవరి ఆటలు వారు ఆడుకుంటున్నారు. అదే విధంగా తాజాగా శివాజీపై ఒక స్ట్రాటజీని ప్లే చేశాడు అర్జున్. కానీ అది తిరిగి అర్జున్‌కే మైనస్ అయ్యింది. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో శివాజీని నామినేట్ చేయడంతో అర్జున్‌ను పూర్తిగా నెగిటివ్‌గా మార్చేశాడు శివాజీ. ఇప్పటివరకు ఈ విషయంపై అర్జున్ మాట్లాడలేదు. కానీ తాజాగా అమర్‌దీప్‌తో శివాజీ గురించి మాట్లాడాడు. నామినేషన్స్ గురించి గుర్తుచేసుకున్నాడు.
క్షమించి మాట్లాడేయాలా?
ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా ఫినాలే అస్త్రా టాస్కుల్లో బిజీగా ఉండగా.. చివరి కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన విషయాలను అమర్, అర్జున్ కలిసి మరోసారి గుర్తుచేసుకున్నారు. శివాజీ కావాలనే తన ఫోటో కాల్చలేదని అర్జున్ అన్నాడు. అవన్నీ మాట్లాడుకోకూడదు, రాసిపెట్టలేదంతే అని టాపిక్‌ను ముగించే ప్రయత్నం చేశాడు అమర్‌దీప్. అయితే తనకు సపోర్ట్ చేసిన విషయాన్ని తప్పుబట్టడం లేదని, అందరికి అది రీచ్ అయిన విధానం తప్పుగా ఉందని శివాజీ విషయంలో జరిగినదాని గురించి అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
‘‘నన్ను పిచ్చోడిని చేశారు. నేను ఆయన చేసింది తప్పు అనడం లేదు. కానీ ఇంకోసారి అలా చేసేముందు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పాను. అది యావర్‌కు సగం అర్థమయ్యి.. సగం అర్థం అవ్వక నామినేషన్స్ అవ్వగానే మీరు చేసింది తప్పు అని అక్కడే చెప్తున్నాడు. వారికి ఫేవర్ చేస్తే తప్పు చేసినా క్షమించి మాట్లాడేయాలా? అవన్నీ మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. శివాజీ అన్న ఇంటెన్షన్ కూడా తప్పు కాదు. ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు కలిసుండాలి, మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే నేను ఊరుకున్నాను. కావాలంటే ఇప్పుడు కూడా దానిని రచ్చ చేయొచ్చు’’ అంటూ నామినేషన్స్ తర్వాత శివాజీ ప్రవర్తన గురించి చెప్పుకొచ్చాడు అర్జున్.
స్పై బ్యాచ్ గురించి స్పా బ్యాచ్ డిస్కషన్..
అమర్ కూడా ఫినాలే అస్త్రా టాస్క్‌లో శివాజీ ప్రవర్తనను గుర్తుచేసుకున్నాడు. సంచాలకులుగా శివాజీ, శోభా కలిసి బాల్ ఛాలెంజ్‌లో తప్పుడు రూల్స్ పెట్టారన్నాడు. ఆ టాస్క్‌లో ప్రియాంకతో అమర్ ప్రవర్తనను గుర్తుచేసుకున్న అర్జున్.. పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడకు అన్నాడు. తనకు కూడా అలా చేయడం నచ్చలేదు అని ఫీలయినట్టు నటించాడు అమర్. ఆ తర్వాత అమర్ వెళ్లి.. తన స్పా బ్యాచ్‌తో డిస్కషన్ పెట్టాడు. స్పై బ్యాచ్ అంతా కలిసి తనకు సపోర్ట్ చేయడానికి కారణం అర్జున్ అని అన్నాడు. అర్జున్ గెలవకూడదు అని వాళ్లు ఫీలవుతున్నారని చెప్పాడు. ‘‘అర్జున్‌కు స్టాండ్ తీసుకొని అందరూ పిచ్చోళ్లు అయ్యారని అనుకుంటున్నారు. అందుకే శివాజీ బాధపడ్డాడు. నామినేషన్స్ సమయంలో యావర్‌తో మాట్లాడు అని అర్జున్ చెవిలో చెప్పాడంట. వాళ్ల మధ్య సైలెంట్ వార్ జరుగుతోంది. నేను కూడా వెళ్లి యావర్‌తో మాట్లాడాను. ఆరోజు జరిగిన సంఘటన తర్వాత నేను ఎవ్వరినీ అడగను. నా అనేవాళ్లు ఉన్నారు. వాళ్లు చేస్తే చేస్తారు అని యావర్‌తో చెప్పాను. అలా అనొద్దు మేము ఉన్నం కదా అన్నాడు. మరి కెప్టెన్సీ అప్పుడు ఏమైంది అనుకున్నాను’’ అంటూ స్పై బ్యాచ్ గురించి స్పా బ్యాచ్ డిస్కషన్ పెట్టింది.
Also Read: ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్‌గా మాత్రం కాదు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*