అన్వేషించండి

Shivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి హీరో శివాజీ, ‘జైలు అనుభవం’ అంటూ కామెంట్స్

రాగానే ఇలా చూస్తానని అనుకోలేదు అంటూ శివాజీని పలకరించారు నాగార్జున. అయితే తన ఫస్ట్ చెక్ నాగార్జుననే ఇచ్చినట్టుగా శివాజీ గుర్తుచేసుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి రెండో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు హీరో శివాజీ. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. ఆ తర్వాత సినిమాల నుంచి రాజకీయాల సైడ్ షిఫ్ట్ అయ్యారు. గత కొన్నాళ్లుగా శివాజీ అసలు ఎక్కడా యాక్టివ్‌గా కనిపించడం లేదు. సడెన్‌గా ఇప్పుడు బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవుతూ కనిపిస్తున్నాడు. మనం తీసుకునే నిర్ణయాలు, దాని వల్ల జీవితంపై పడే ప్రభావం గురించి చెప్తూ ఒక ఇంట్రెస్టింగ్ ఏవీతో శివాజీని కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు నాగార్జున.

శివాజీ స్టేజ్ మీదకు రాగానే ఇలా చూస్తానని అనుకోలేదు అంటూ పలకరించారు నాగార్జున. తన ఫస్ట్ చెక్ నాగార్జుననే ఇచ్చినట్టుగా శివాజీ గుర్తుచేసుకున్నాడు. వైవీఎస్ చౌదరీ తెరకెక్కించిన ‘సీతారాముల కళ్యాణం చూతుమురారండి’ సినిమా కోసం తన ఫస్ట్ చెక్ అందుకున్నట్టు చెప్పారు. బిగ్ బాస్ ఎందుకు ఎంచుకున్నాడు అనే ప్రశ్నకు.. జీవితంలో ఎన్నో చూశాను. జైలు ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నాను’ అంటూ బిగ్ బాస్‌ను జైలుతో పోల్చారు. బిగ్ బాస్‌ను జైలు అంటున్నావా అంటూ నాగార్జున నవ్వారు. ముందు సీజన్స్ అన్నీ దాదాపుగా చూశానని చెప్పారు. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా ఉంటుందంటూ నాగ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన లైఫ్‌లో ఉల్టా పుల్టా మూమెంట్ అంటే సినిమాల్లోకి రావడమే అని శివాజీ బయటపెట్టారు.

వైవీఎస్ చౌదరీ ఇచ్చిన చెక్, ‘మాస్టర్’ మూవీ కోసం అల్లు అరవింద్ ఇచ్చిన చెక్ కలిపి తన కలను నిజం చేసుకున్నానని శివాజీ అన్నారు. ఎప్పటినుండో తనకు ఒక ల్యాండ్ కొనాలని డ్రీమ్ ఉండేదని, తన మొదటి రెండు చెక్స్ వల్ల ఆ కల నేరవేరిందని తెలిపారు. ఇప్పుడు ఆ ల్యాండ్ చాలా ఉపయోగపడుతోందని అన్నారు. అయితే నాగార్జున సినిమాలు చూస్తున్నప్పుడు తిట్లు పడుతున్నాయని, ఆయన అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారని ప్రశంసించాడు శివాజీ. మేము అంతా పొట్టలు పెంచేసుకున్నాం, మీరు మాత్రం అలాగే ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచేశాడు.

ఆ తర్వాత తన అమ్మ ఫోటో చూపించగా.. శివాజీ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ఫోటో చూడగానే.. చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతీ విషయం గుర్తొస్తుంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వారు చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో ఉండేవారని గుర్తుచేసుకున్నాడు. అమ్మకు ఎప్పుడూ మెడలో పసుపు తాడు వేసుకొని ఉండేదని, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు గోల్డ్ చైన్ కొన్నానని గర్వంగా చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు అందులోని పరిస్థితులు ఎలా ఎదుర్కుంటారు అని అడిగినప్పుడు నోరు వేసుకొని పడిపోతా అని సూటిగా చెప్పేశాడు శివాజీ. పవర్ అస్త్రా గురించి శివాజీకి వివరించిన తర్వాత శివాజీని హౌజ్‌లోకి పంపించాడు నాగ్. ఆ తర్వాత హౌజ్‌లోకి ఎంటర్ అయ్యి ప్రియాంక జైన్‌ను పరిచయం చేసుకున్నాడు. ప్రియాంక జైన్‌ను గుర్తుపట్టి పలకరింపులు జరిపాడు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget