Bigg Boss 6 Telugu: రేవంత్ ఫిజికల్ అవుతున్నాడంటూ ఆరోపిస్తున్న ఇంటి సభ్యులు - ఆదిరెడ్డి సవాల్
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆట ఫిజికల్‌గా మారుతోంది.
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో టాస్కు జోరుగా సాగుతోంది. బిగ్‌బాస్ మైంగ్ గేమ్ కన్నా ఫిజికల్‌గా ఆడే ఆట ఇవ్వడంతో అందరూ కింద మీద పడి దొర్లుతున్నారు. ఒకరు మీద ఒకరు పడి లాక్కుంటున్నారు. మళ్లీ వారే ‘ఫిజికల్ అవ్వద్దు ఫిజికల్ అవ్వద్దు’ అని అరుచుకుంటున్నారు. బిగ్‌బాస్ ఆ టాస్కు ఇచ్చిందే వారు కొట్టుకుని కంటెంట్ ఇస్తారని. ఇక అందులో ఫిజికల్ అవ్వకపోతే కంటెంట్ ఏమొస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో ఫైమా కావాలనే ఇనాయ మీదకి వెళ్లి మరీ విసిరేయించుకుంది. తోసేస్తుందని తెలిసి కూడా కావాలనే ఫైమా ఇనాయ దగ్గరికి వెళ్లినట్టు కనిపిస్తోంది. అలా అయితే ఇనాయకు ఈ వీకెండ్లో క్లాసు పడే అవకాశం ఉంది కదా. ఇలాంటి కన్నింగ్ గేమ్ ఆడితే గీతూలాగే ఫైమాకు గేట్లు ఓపెన్ అవుతాయి.
ఇక ప్రోమోలో ఏముందంటే... బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు ‘నాగమణి’ఇచ్చారు. నలుగురు ఇంటి సభ్యులు మణులను కాపాడుకుంటే, నలుగురు ఇంటి సభ్యులు వాటిని దోచుకుంటారు. దీంతో ఒకరిపై ఒకరు పడి దొర్లారు. రేవంత్ వచ్చిన వారిని తోసేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి వీరంతా ఫిజికల్ అవ్వద్దు అంటూ రేవంత్‌ను తప్పుబట్టారు. అసలే షార్ట్ టెంపర్ పర్సన్ అయినా రేవంత్ వారు అలా అనడంత్ ఇంకా రెచ్చిపోయాడు. ఫైమా రేవంత్ తో గొడవ పెట్టుకుంది. శ్రీసత్యతో కూడా రేవంత్ చిన్నగా గొడవ పడ్డాడు. నాగమణులను రక్షించేందుకు మెరీనా, శ్రీసత్య, బాలాదిత్య, రేవంత్ చాలా కష్టపడ్డారు. అయినా చాలా మణులను ఫైమా, కీర్తి కొట్టేశారు. వేలు విరిగినప్పుటికీ కీర్తి ఈ ఆటలో బాగా కష్టపడింది. దీంతో ఆమెకు ఈ వారం ఓటింగ్ బాగానే ఉంటుంది.
ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్
రేవంత్ ‘నేను ఫిజికల్ అవ్వకుండా అయినట్టు ఆరోపణలు వేశారు కాబట్టి ఎవరిదైనా చిన్న గోరు తగిలినా నేను ఫిజికల్ అవుతా’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘గోరు తగిలినా ఫిజికల్ అవుతా అంటున్నాడు...రెజ్లింగా?’ అని అరిచాడు. దానికి రేవంత్ ‘నామినేషన్ కారణాలు వెతుక్కో... ఆ పనిలో ఉండు’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘నామినేషన్ వేయడానికి నీ విషయంలో కారణాలు వెతుక్కోపనిలేదు, నువ్వు అరగంటకొకటి ఇస్తావ్, ఏసుకో నువ్వు నామినేషన్ వేసుకుంటావో, ఏం వేసుకుంటావో వేసుకో, ఐ డోంట్ కేర్. నేను నీట్‌గా ఆడతా, ఫిజికల్ అవ్వను’ అన్నాడు.
మొత్తమ్మీద ఈ టాస్కు ముగిసే సమయానికి నిచ్చెన టీమ్ గెలిచినట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్లుగా రేవంత్, మెరీనా, శ్రీసత్య, బాలాదిత్య, రాజశేఖర్ ఉన్నట్టు సమాచారం. వీరికి కెప్టెన్సీ పోటీ పెట్టబోతున్నారు బిగ్ బాస్. ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరవుతారో చూడాలి.
ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్
Also read: ఇనయానే టార్గెట్ చేస్తున్న ఫైమా - పీక్స్‌కు చేరిన వీరిద్దరి ఫైట్