Bigg Boss 6 Telugu Episode 66: ఇనయానే టార్గెట్ చేస్తున్న ఫైమా - పీక్స్‌కు చేరిన వీరిద్దరి ఫైట్
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఇనయా ఒంటరి పోరాటం సాగుతూనే ఉంది.
Bigg Boss 6 Telugu: ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ ఏదైనా ఉందంటే అది ఇనయా వర్సెస్ ఫైమా ఫైట్. వీరిద్దరూ ఫిజికల్‌గా పోటీపడి ఒకరినొకరు లాగేసుకున్న తీరు కొంతమందికి నవ్వు తెప్పిస్తే, మరికొంతమందికి చికాకు తెప్పించింది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిదంటే నామినేషన్ తరువాత రాత్రి అందరూ వాటి గురించే మాట్లాడుకున్నారు. ఫైమా ప్రతి ఒక్కరి దగ్గరకెళ్లి ఇనయా గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు ఫ్రెండు ఫ్రెండు అంటూ ఇప్పుడు ఆమె గురించి అందరి దగ్గరికెళ్లి తానే మాట్లాడడం తప్పని మాత్రం ఫైమాకు అర్థం కావడం లేదు.
కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో భాగంగా పాములు నిచ్చెన టాస్కు ఇచ్చారు బిగ్ బాస్. ఆ టాస్కులో భాగంగా పాము - నిచ్చెన ఆట ఇచ్చారు. ఇందులో ఒక మూల ‘వేర్ హౌస్’ నిర్మించారు. అందులో మట్టిని సమయాను సారంగా పెడుతూ వచ్చారు. ఆ మట్టిని తెచ్చి సగం మంది ఇంటి సభ్యులు నిచ్చెనలు కట్టాలి. సగం మంది ఇంటి సభ్యులు పామును నిర్మించాలి. అయితే పాపం కీర్తి ఒక చేతి వేలి విరిగిపోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. మట్టి ఎత్తి తెచ్చుకుని పామును కట్టేందుకు ఇబ్బంది పడింది.
ఆ తరువాత పాము బుస్ మనే శబ్ధాన్ని ఇచ్చినప్పుడు పాము బొమ్మలు నిర్మించిన వారిలో ఒకరు, నిచ్చెనలు కట్టిన వారిలోని ఒకరిని ఎంచుకుని వారి నిచ్చెనలోని మట్టిని లాక్కోవాల్సి ఉంటుంది. ఇలా లాక్కునే ఆటలో మాత్రం ఇనయా - ఫైమా పడి పడి దొర్లారు. ఫైమా ప్రతిసారి ఇనాయనే టార్గెట్ చేస్తుండడంతో ఆమె ఫైమాను ఎత్తిపడేసింది. బక్క పలుచగా ఉండే ఫైమా ఇనాయ శక్తి ముందు ఆగలేకపోయింది. కానీ ఇంట్లో ఉన్నవాళ్లెవరూ ఇనాయకు సపోర్ట్ గా రాలేదు. బిగ్ బాస్ ఈ గేమ్ సంచాలకులుగా ఇనాయ - ఫైమాలనే నిర్ణయించారు. నిచ్చెనలు కడుతున్న వారిలో తక్కువ మట్టి ఉన్న వారిని ఫైమా ఎలిమినేట్ చేయాలి. ఇక పాములు నిర్మిస్తున్న వాళ్లని ఇనాయ ఎలిమినేట్ చేయాలి.
రోహిత్‌ను ఫైమా ఎలిమినేట్ చేయగా, వాసంతిని ఇనాయ ఎలిమినేట్ చేసింది. ఇనయా తన నిచ్చెనను కాపాడేందుకు ఎంతమందిని సాయం అడిగినా ఎవరు రాలేదు. ఇక రేవంత్ వచ్చినా పెద్దగా అడ్డుకోలేదు. దీంతో ఇనాయ తాను ఒంటరిగా ఆడుతున్నానని అంది. ఫైమా, శ్రీహాన్ ఇలా పాముల టీమ్ లో ఉన్న వాళ్లు ఇనాయనే టార్గెట్ చేశారు. ఇక ఫైమా ఇనాయ నిచ్చెన చిన్నగా ఉందంటూ ఆమెనూ ఎలిమినేట్ చేసింది. వాసంతి మట్టిని తీసుకోవడానికి ఓసారి శ్రీసత్య ప్రయత్నించగా ఆమెను కదలకుండా లాక్ చేసి పడేసింది వాసంతి. వేలికి దెబ్బతగిలి ఆట ఆడలేకపోయినా కీర్తి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ టాస్కు ఇంకా కొనసాగుతోంది.
ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్
Also read: నామినేషన్లలో మళ్లీ ఇనయానే టార్గెట్ చేసిన హౌస్, నామినేట్ అయింది వీళ్లే