Bigg Boss 6 Telugu Episode 65: నామినేషన్లలో మళ్లీ ఇనయానే టార్గెట్ చేసిన హౌస్, నామినేట్ అయింది వీళ్లే
Bigg Boss 6 Telugu: నామినేషన్ ప్రక్రియంలో మళ్లీ యథావిధిగా ఇనాయనే టార్గెట్ అయింది.
Bigg Boss 6 Telugu: ఒంటరి పోరాటం.. బిగ్ బాస్ ఇంట్లో ఇనాయను చూస్తే గుర్తొచ్చే పదం అదే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది ఇనయాను నామినేట్ చేశారు. ఆ ఎనిమిది మందితోనే ఇనాయ తన వెర్షన్ వినిపించేందుకు వాదించింది. దీంతో ఎపిసోడ్ అంతా ఆమె చుట్టూనే తిరిగింది. సోమవారం నామినేషన్ డే సందర్భంగా బిగ్ బాస్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారి ముఖాన ఎరుపు రంగు నీళ్లు కొట్టి నామినేట్ చేయమని చెప్పారు. మొదటిగా కెప్టెన్ అయిన శ్రీసత్యను నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టమని చెప్పాడు బిగ్ బాస్. శ్రీసత్య బాలాదిత్యను నామినేట్ చేసింది. వీరిద్దరూ కాసేపు వాదించుకున్నారు. గత వారం వీరిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. తరువాత శ్రీసత్య ఇనాయాను నామినేట్ చేసింది. ‘శ్రీహాన్ విషయంలో ఒక సెన్సిటివ్ మ్యాటర్ అన్నావు, శ్రీహాన్‌కు బయట ఒక లైఫ్ ఉంది, నాకూ ఉంది’ అని అంది. దానికి ఇనాయ ‘నువ్వు సూర్య గురించి ఇన్ డైరెక్ట్‌గా ఏం మాట్లాడలేదా’ అని అడిగింది. శ్రీసత్య తానేమీ అనలేదని అంది కానీ ఆమె ఎన్నోసార్లు సూర్య - ఇనాయను కలిపి ఎన్నో మాటలు అంది. కానీ నామినేషన్లో మాత్రం తానేమి అనలేదంటూ చెప్పుకొచ్చింది.
రేవంత్ వర్సెస్ ఇనాయ
రేవంత్ వాసంతిని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్యే కాసేపు గట్టిగానే వాదన అయింది. ‘నేను అగ్రెసివ్ అని రెండు వారాలు నామినేట్ చేశారు’ అంటూ మొదలుపెట్టాడు దానికి వాసంతి ‘ అది నిజమే కదా, నేను కొత్తగా చెప్పేదేముంది’ అంది. ‘ఒక వ్యక్తి మీద చేయి ఎత్తి కొట్టడం తప్పు, అది చిన్న దెబ్బా, పెద్ద దెబ్బా అనవసరం. కానీ కొట్టాలనే ఉద్దేశమే తప్పు’ అని చెప్పుకొచ్చాడు. అయితే వాసంతి మాత్రం తాను కావాలని కొట్టలేదని చెప్పుకొచ్చింది. ఎందుకో రేవంత్ కావాలనే వాసంతిని నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. రేవంత్ ప్రతి గేమ్‌లో అందరినీ ఇష్టమొచ్చినట్టు విసిరికొట్టేసినప్పుడు తప్పు లేదు కానీ, చేయి తగిలిందని హంగామా చేశాడు. ఈ ఇంట్లో ఆటలో మనుషులను విసిరికొట్టేది రేవంత్ మాత్రమే. అంతవరకు రేవంత్ ను మర్యాదగా మీరు అని పిలిచిన వాసంతి తరువాత నువ్వు అని మాట్లాడడం మొదలుపెట్టింది. దాంతో రేవంత్‌కు కోపం వచ్చింది. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అన్నీ దగ్గర పెట్టుకుని మాట్లాడండి అన్నాడు. దానికి వాసంతి ఏమాత్రం తగ్గకుండా ‘సేమ్ నువ్వు కూడా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు నాతో’ అంది. రేవంత్ అందరూ మర్యాద ఇవ్వాలని కోరుకున్నప్పుడ ఆయన కూడా ఇతరులకు మర్యాద ఇస్తే బావుంటుంది.
శ్రీహాన్ వర్సెస్ కీర్తి
శ్రీహాన్‌కు వెటకారంపాళ్లు ఎక్కువయ్యాయి. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ నామినేషన్లలో వింతగా ప్రవర్తిస్తాడు. కీర్తి శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. ‘గతవారం మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడారు’ అంది. దానికి శ్రీహాన్ ‘హ్యుమానిటి గురించి నేను మాట్లాడలేదు, నువ్వే చెప్పుకున్నావ్ పెద్ద హీరోయిన్‌లా’ అన్నాడు. దానికి కీర్తి ‘ఇక్కడ హీరోలు హీరోయిన్లు లేరు అదే తగ్గించుకుంటే మంచిది’ అంది. దానికి శ్రీహాన్ యాటిట్యూడ్ చూపిస్తూ ‘తగ్గించను’ అన్నాడు. తగ్గించకపోతే గీతక్కకు పట్టిన గతే పడుతుందని అర్థం చేసుకోలేకపోతున్నాడు శ్రీహాన్. గీతూ ఇలా అతి చేష్టల వల్లే బయటికి వెళ్లిపోయింది.
ఇక ఆదిరెడ్డి రేవంత్‌ని నామినేట్ చేశాడు. వారి మధ్య కాస్త కోపంగానే నామినేషన్ సాగింది. ఆదిరెడ్డి ‘ఇక రండి అని కోపంగా అంటావ్’ అనగానే రేవంత్ ఫైర్ అయిపోయాడు. ఆయన కోపం తగ్గించుకోవడం అనేది బిగ్ బాస్ ఇంట్లో ఉండగా జరగదు. రేవంత్ ‘నేనంతే, అది నా గేమ్ ప్లాన్. నువ్వు రాలేవా’ అని అడిగాడు. దానికి ఆదిరెడ్డి ‘నువ్వు ఎంత తోపైనా, నేను బక్కపలచుగా ఉన్నా... నేను తగ్గను’ గట్టిగా చెప్పాడు.
ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్