అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss Telugu 7: యావర్‌ది సేఫ్ గేమ్ అన్న రతిక, శోభాను ఫ్రెండ్ అంటూ కొత్త స్ట్రాటజీ!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఏ ప్లేయర్ ఎలా స్ట్రాటజీ ఉపయోగిస్తారో ఎవరూ ఊహించలేరు. తాజాగా శోభా శెట్టిని ఫ్రెండ్ అంటూ పలువురు కంటెస్టెంట్స్ అదే స్ట్రాటజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్‌ సీజన్ 7లో యావర్.. టాస్కులు ఆడి, అందరినీ ఓడించి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ పాస్ కోసం ఆడిన రెండు టాస్కులలో యావర్.. ఫౌల్ గేమ్ ఆడాడని నాగార్జున చెప్పారు. అంతే కాకుండా దానికి ప్రూఫ్‌గా వీడియోలు కూడా చూపించారు. దీంతో యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అర్హుడిని కాదు అంటూ ఆ పాస్‌ను తిరిగి ఇచ్చేస్తానని నిర్ణయించుకున్నాడు. ఆ పాస్ కంటే తన క్యారెక్టరే ముఖ్యమని అన్నాడు. నాగార్జున సైతం యావర్ మాటలను గౌరవించి పాస్‌ను తిరిగి ఇచ్చేయమన్నాడు. ఇక శనివారం ఎపిసోడ్‌.. యావర్ దగ్గర నుండి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తీసుకోవడంతో ముగిసింది. యావర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక్కొక్క కంటెస్టెంట్.. ఒక్కొక్క విధంగా రియాక్ట్ అయ్యారు. సండే ఎపిసోడ్‌లో నాగార్జున రాగానే.. ముందుగా యావర్‌తో ఇతర కంటెస్టెంట్స్ మాట్లాడిన ఫుటేజ్‌ను ప్రేక్షకులకు చూపించారు.

యావర్‌ది సేఫ్ గేమ్ అన్న రతిక..
శోభా శెట్టి వచ్చి క్యారెక్టర్ ముఖ్యమని పాస్ తిరిగి ఇచ్చేయడం మంచి నిర్ణయం అంటూ ఐ లక్యూ అని యావర్‌తో చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక కూడా తన నిర్ణయం కరెక్ట్ అని ప్రశంసించింది. అందరి చేత ప్రశంసలు పొందని యావర్.. రతిక నుండి మాత్రం ఆ ప్రశంసలను అందుకోలేకపోయారు. రతిక మాత్రం యావర్‌ది సేఫ్ గేమ్ అంటూ ఆరోపణలు చేసింది. ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తనకోసం ఉపయోగించాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశ్యంతోనే తిరిగి ఇచ్చేశావంటూ యావర్‌పై నిందలు వేసింది. బర్గర్ టాస్క్‌లో, స్కూటర్ నెంబర్ ప్లేట్స్ టాస్క్‌లో ఎలా ఆడాడో గుర్తుచేసింది. రతిక మాటలను యావర్ సీరియస్‌గా తీసుకోలేదు. ‘‘నీకు ఆకలేస్తే నీ డబ్బులతో తింటావా? పక్కనవాడి డబ్బులతో తింటావా?’’ అని ప్రశ్నించాడు. తనను నమ్మమంటూ, మళ్లీ ఆడి గెలుస్తానంటూ రతికతో అన్నాడు యావర్.

ఫ్రెండ్‌గా మారిపోయిన శత్రువు..
ఇక తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నాగార్జున రాగానే కంటెస్టెంట్స్‌ను ఇతర కంటెస్టెంట్స్ నుండి ఒక ఫ్రెండ్‌ను, బ్లాక్ చేయాలనుకుంటున్న ఒక వ్యక్తిని ఎంచుకోమన్నాడు. అనూహ్యంగా శోభాను చాలామంది కంటెస్టెంట్స్ ఫ్రెండ్ అని పిలుస్తూ తనకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను అందించారు. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కూడా శోభాపై ఎన్నో ఆరోపణలు చేసిన రతిక సైతం శోభా తనకు ముందు నుండి మంచి ఫ్రెండ్ అని, వారి మధ్యలో ఎన్ని మనస్ఫర్థలు వచ్చినా ఫ్రెండ్‌గానే ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. శోభా కూడా రతికనే తన ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అందజేసింది. ఇక ఒకరికొకరు మంచి కెప్టెన్ కాదంటూ గొడవలు పడిన యావర్ కూడా శోభాను ఫ్రెండ్ అని తనకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఇచ్చాడు. గత వారం జరిగిన నామినేషన్స్‌లో ప్రియాంకను, శోభాను తిట్టిపోసిన అశ్విని సైతం శోభాతో క్లోజ్ అయిపోయి తనను ఫ్రెండ్‌గా భావిస్తున్నానని చెప్పింది. శోభాకు సమానంగా పల్లవి ప్రశాంత్ కూడా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ అందుకున్నాడు. గౌతమ్, అమర్, ప్రియాంక.. ముగ్గురూ ప్రశాంత్‌ను తన ఫ్రెండ్ అని ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఇచ్చారు.

గౌతమ్‌ను బ్లాక్ చేసిన హౌజ్‌మేట్స్..
బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న చాలామందికి శోభా ఫ్రెండ్ అయిపోగా.. గౌతమ్‌ను బ్లాక్ చేయాలని ఉందని మెజారిటీ స్టాంప్ వేశారు. శోభా, అశ్విని వచ్చి గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అమర్‌దీప్ ఏడుస్తున్నా కూడా గౌతమ్ టార్గెట్ చేసి ఆడాడని, అది కరెక్ట్ కాదని చెప్తూ తనకు స్టాంప్ వేశారు. గౌతమ్‌తో సమానంగా రతిక కూడా బ్లాక్ స్టాంపులు పడ్డాయి. తనతో క్లోజ్‌గా ఉండే శివాజీ సైతం ఫ్రెండ్‌గా రతికను బ్లాక్ చేస్తున్నట్టు చెప్పాడు. ‘‘బిడ్డగా ఉంటుంది కానీ ఫ్రెండ్‌గా బ్లాక్ చేస్తున్నాను’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రశాంత్‌తో అమర్ కూడా రతిక బ్లాక్ అంటూ స్టాంప్ వేశారు.

Also Read: ఆమని ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా - టీమిండియాకు ధోనిలా ఆ సినిమాకు ఆమె!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget