Prince Yawar: టైటిల్ మ్యాటరే కాదు, హౌజ్‌లో మాస్క్ వేసుకొని తిరిగింది వారే - రివీల్ చేసిన యావర్
Prince Yawar: బిగ్ బాస్ హౌజ్ నుండి సూట్‌కేస్ తీసుకొని తప్పుకున్న తర్వాత బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు యావర్. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
Prince Yawar: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఫైనల్స్ వరకు చేరుకున్న తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ ఒక సూట్‌కేస్ ఆఫర్ వస్తుంది. అది తీసుకొని తప్పుకుంటే.. ఆ సూట్‌కేస్‌లోని డబ్బులు వారి సొంతమవుతాయి. కానీ ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ ఆరు సీజన్స్‌లో కేవలం ఒక్క సీజన్‌లో మాత్రమే ఆ సూట్‌కేస్ ఆఫర్‌ను కంటెస్టెంట్ స్వీకరించాడు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో అలా సూట్‌కేస్‌ను, అందులోని డబ్బును తీసుకొని పక్కకు తప్పుకున్న కంటెస్టెంట్‌గా యావర్ నిలిచాడు. అలా చేయడంపై తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతే కాకుండా హౌజ్‌లో ఎవరు మాస్కులు వేసుకొని ఉన్నారు అన్న విషయాన్ని కూడా బయటపెట్టాడు.
ఫ్యామిలీ కోసమే..
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు యావర్. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ‘‘రూ.15 లక్షలు తీసుకొని హ్యాపీగా వచ్చేశావు’’ అని అనగా.. ‘‘ఫ్యామిలీ కోసమే నేను వచ్చాను అంతే’’ అని యావర్ అన్నాడు. ‘‘అది తీసుకోకపోయింటే ఒకవేళ విన్నర్ అయ్యేవాడివేమో’’ అని చెప్పగా.. ‘‘గెలవడం అంటే టైటిల్ రావడం. అది మ్యాటరే కాదు’’ అని కొట్టిపారేశాడు యావర్. ‘‘నాకు తెలుగు రాదు అనే ఒక పాయింట్‌ను నీకు తగినట్టుగా ఉపయోగించుకున్నావు హౌజ్‌లో అనిపించింది’’ అని గీతూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దానికి సమాధానం చెప్పకుండా వ్యంగ్యంగా నవ్వి వదిలేశాడు యావర్.
నామినేషన్స్‌లో ఎప్పుడూ అంతే..
‘‘శివాజీ అన్నను నువ్వు ఆరోజు అది అన్నావు. నాకు నచ్చలేదు. నేను నామినేట్ చేస్తున్నా. అలా ఎందుకు ప్రతీసారి నామినేషన్స్‌లో వేరేవారికి స్టాండ్ తీసుకుంటావు?’’ అని గీతూ ప్రశ్నించింది. ‘‘దానికి కొన్ని ఉదాహరణలు చెప్పగలవా?’’ అని యావర్ కూల్‌గా అడిగాడు. ‘‘చాలావరకు సందర్బాల్లో నువ్వు నామినేట్ చేసిన కారణాలు అవే’’ అని సూటిగా చెప్పింది గీతూ. ‘‘స్పై బ్యాచ్ వారు ఎప్పుడూ పాక్షికంగా లేరా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా నామినేట్ చేసుకున్నారా’’ అని అడిగింది. దానికి యావర్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు.
కంటెస్టెంట్స్ అందరికీ ట్యాగ్స్..
ఇక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాలను బయటపెట్టాడు యావర్. ‘‘హౌజ్‌లో జిత్తులమారి ఎవరు?’’ అని గీతూ అడగగా శోభా పేరు చెప్పాడు యావర్. ‘‘ఫేక్ ఎవరు?’’ అనే ప్రశ్నకు చాలాసేపు ఆలోచించాడు. ‘‘మాస్క్ వేసుకొని తిరిగేది ఎవరు?’’ అని అడగగానే అమర్‌దీప్ అని సమాధానిమిచ్చాడు. ‘‘సింపథీ గేమర్ ఎవరు హౌజ్‌లో’’ అని అడగగా.. అశ్విని పేరు చెప్పాడు. ‘‘డబుల్ ఫేస్డ్ ఎవరు’’ అంటే గౌతమ్ అన్నాడు. రెండు ఆప్షన్ ఇస్తూ.. ఆ రెండిటిలో నుంచి ఒకటి ఎంచుకోమని చెప్పింది గీతూ. ‘‘రతిక లేదా సుబ్బు’’ అంటే సుబ్బు అన్నాడు. ‘‘రతిక లేదా నయని’’ అంటే నయని పేరు చెప్పాడు. ‘‘రతిక లేదా పల్లవి ప్రశాంత్’’ అంటే పల్లవి ప్రశాంత్‌ను ఎంచుకున్నాడు. ‘‘రతిక లేదా శివాజీ’’ అంటే శివాజీ అన్నాడు. దీంతో రతికను అసలు ఎంచుకోవడం లేదని కన్ఫ్యూజ్ అయ్యింది గీతూ. ‘‘ఇది ఉల్టా పుల్టా’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు యావర్.
Also Read: అమర్‌దీప్, గీతూ, అశ్వినీ కార్లు ధ్వంసం, ఆర్టీసీ బస్సుపైనా దాడి - ఆకతాయి ఫ్యాన్స్ అరాచకం