Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన టాస్కులో అర్జున్.. తనను తోశాడంటూ ప్రశాంత్ ఆరోపించాడు. అది నచ్చని అర్జున్.. తనపై సీరియస్ అయ్యాడు.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం ఫన్ టాస్కుల వీక్ నడుస్తోంది. చూడడానికి, ఆడడానికి ఈ టాస్కులు ఫన్నీగానే అనిపించినా.. వీటిలో గెలిచినవారికి ప్రేక్షకుల నుంచి ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పటికే ప్రసారమయిన ఎపిసోడ్‌లో రెండు ఫన్ టాస్కులు పూర్తి అవ్వగా.. అందులోని ఒక టాస్క్ గెలిచిన శోభాకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కింది. ఇక నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మరో రెండు టాస్కులు జరగగా.. అందులో నుంచి ఒకరికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
శాండ్ కేక్‌పై చెర్రీ..
‘‘మీ అందరికీ ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఎంత ముఖ్యమో బిగ్ బాస్‌కు తెలుసు. అందుకే ఈ గేమ్ గెలిచి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం పొందే ప్రయాణంలో మరింత ముందుకు వెళ్లండి’’ అని చెప్తే.. టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ఇందులో ప్రతీ కంటెస్టెంట్‌కు ఒక శాండ్ కేక్‌ను ఇచ్చారు. దానిపై ఒక చెర్రీ కూడా ఉంది. ఆ చెర్రీ కిందపడకుండా కేక్‌ను కార్డ్‌తో పూర్తిగా కట్ చేయాలి. ఇక ఇందులో తమ చెర్రీ కిందపడిపోవడంతో యావర్, అర్జున్, శివాజీ, ప్రియాంక టాస్క్ నుంచి తప్పుకున్నట్టు ప్రోమోలో చూపించారు. ఇక ఈ ప్రోమోను బట్టి చూస్తే అమర్‌దీప్.. శాండ్ కేక్ టాస్కులో విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది.
ఒకరినొకరు తోసుకుంటూ..
మొదటి టాస్క్ పూర్తయిన తర్వాత రెండో టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ‘‘ఓటు అప్పీల్ సాధించేందుకు, రెండవ కంటెండర్‌గా నిలవడానికి మీరు ఆడాల్సిన గేమ్ - బజర్ మోగినప్పుడు ఎవరైతే అక్కడ ఏర్పరచిన బెల్ మోగిస్తారో.. వారికే రెండో కంటెండర్‌గా నిలిచే అవకాశం లభిస్తుంది’’ అని తెలిపారు. దీంతో ముందుగా కంటెస్టెంట్స్ అంతా హౌజ్‌లోపలికి వెళ్లిపోయి.. బజర్ మోగిన వెంటనే గార్డెన్ ఏరియాలో ఉన్న బెల్ కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో అర్జున్, యావర్, పల్లవి ప్రశాంత్.. ఒకరిపై ఒకరు పడుతూ, ఒకరిని ఒకరు తోసుకుంటూ పరిగెత్తారు. అందరికంటే ముందుగా అర్జున్.. బెల్ కొట్టాడు.
ప్రశాంత్, అర్జున్‌ల మధ్య గొడవ..
ఇక టాస్క్ ముగిసిన తర్వాత ‘‘నా దవడకు తాకించాడు ఫస్ట్ నుంచి చూశావా? ఇలా అన్నాడు’’ అని సంచాలకుడిగా ఉన్న అమర్‌కు చెప్పుకున్నాడు ప్రశాంత్. ‘‘నాకు తాకింది ఫస్ట్ దవడకు. ఇక్కడ తాకింది. ఇలా అన్నాడు’’ అని చేసి చూపించాడు. అది విని అర్జున్‌కు కోపమొచ్చింది ‘‘సోది చెప్పకు. వెధవ రీజన్స్ చెప్పకు’’ అని ప్రశాంత్‌పైకి అరిచాడు. ‘‘నువ్వే తాకించావు’’ అని ప్రశాంత్ మళ్లీ అనగా.. తాను తోయలేదని అర్జున్ సీరియస్ అయ్యాడు. దాంతో ప్రశాంత్ సైలెంట్ అయ్యాడు. ఇక అందరికంటే వెనకబడిపోయిన ప్రియాంక.. ‘‘తోసుకుంటూ ఎందుకు వెళ్తారు మీరు మీ దారిలో పోండి’’ అని చెప్తూ బాధపడింది. ఇక మంగళవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో కూడా ప్రశాంత్.. తానే కరెక్ట్‌గా ఆడాను అన్నట్టుగా సంచాలకుడిగా వాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు కూడా అదే ప్రవర్తన రిపీట్ అవుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?