Bigg Boss 7 Telugu: మళ్లీ ఉల్టాపుల్టా - పాత టాస్కులతో కొత్త ట్విస్టులు పెట్టిన ‘బిగ్ బాస్’ - పాపం శివాజీ
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ తమ ఇంటి ఫుడ్‌ను టేస్ట్ చేయాలంటే మరొక కంటెస్టెంట్ వచ్చి వారికోసం టాస్క్ ఆడాలని ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే వీక్‌కు చేరుకుంది. దీంతో కంటెస్టెంట్స్ అంతా మనస్పర్థలను పక్కన పెట్టి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్‌ను మరింత దగ్గర చేయడం వారికి ఒక కొత్త టాస్క్‌ను ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 7లోని మర్చిపోలేని టాస్కులను రివైండ్ చేసి చూసినట్టు అనిపిస్తోంది. అయితే ఈ టాస్కులు అన్నింటిని ఎవరికోసం వారు ఆడకుండా.. ఇతర కంటెస్టెంట్స్ కోసం ఆడవలసి ఉంటుంది. అదే బిగ్ బాస్ ఇచ్చిన ఉల్టా పుల్టా ట్విస్ట్.
యావర్ మరోసారి..
‘‘మీరు మీ ఇంటివారిని ఎంత మిస్ అవుతున్నారో.. మీ ఇంటి ఆహారాన్ని కూడా అంతే మిస్ అవుతున్నారని మాకు తెలుసు. మీరు కాని మమ్మల్ని సంతోషపరిస్తే.. మీ ఇంటివారు పంపిన ఆహారాన్ని బహుబతిగా ఇస్తాం’’ అంటూ హాచీ అనే పేరుతో వినిపించే వాయిస్.. కంటెస్టెంట్స్‌కు చెప్తుంది. ముందుగా అర్జున్‌కు తన ఇంటి నుంచి ఆహారం వస్తుంది. ఆ ఆహారం తనకు కావాలంటే యావర్ షేక్ బేబీ షేక్ టాస్కులో ఆడి గెలవాలని హాచీ చెప్తుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కోసం అర్జున్‌తో పాటు యావర్ తలపడి గెలిచిన టాస్క్ ఇది. ఇక అర్జున్‌కు తన ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని సంపాదించి పెట్టడం కోసం యావర్ మరోసారి ఆ టాస్క్ ఆడి గెలిచాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా సంతోషించారు.
శివాజీ కోసం ప్రియాంక ఆట..
ఆ తర్వాత శివాజీకి తన ఇంటి నుంచి ఆహారం వచ్చింది. ఆ ఆహారం తనకు దక్కాలంటే ప్రియాంక టాస్క్ ఆడి గెలవాల్సి ఉంటుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ సమయంలో యావర్, శివాజీ, ప్రియాంక కలిసి ఆడిన విల్లు మీద బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే టాస్కును శివాజీ కోసం ఇప్పుడు ప్రియాంక మళ్లీ ఆడవలసి ఉంటుంది. ఈసారి బజర్ మోగేంత వరకు విల్లుపై రెండు బాల్స్‌ను బ్యాలెన్స్ చేస్తే చాలు. ఇక ప్రియాంక ఆ టాస్కును సక్సెస్‌ఫుల్‌గా ఆడి గెలవడంతో శివాజీకి తన ఇంటి ఆహారం తినే అవకాశం దొరికింది. అర్జున్, శివాజీల తర్వాత అమర్‌దీప్‌కు తన ఇంటి నుంచి ఆహారం వచ్చింది. ఈసారి అమర్‌దీప్ కోసం ఆడాల్సిన కంటెస్టెంట్ శివాజీ.
బెలూన్స్ పగలగొట్టాలి..
ఓటు అప్పీల్ సమయంలో కంటెస్టెంట్స్‌కు ఇచ్చిన బెలూన్ టాస్కును శివాజీని మళ్లీ ఆడమని చెప్పారు బిగ్ బాస్. ఒకవేళ ఈ టాస్కులో శివాజీ ఆడి గెలిస్తే.. అమర్‌దీప్‌కు తన ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని తినే అదృష్టం లభిస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిన్ ఉన్న టోపీని పెట్టుకొని వేలాడుతున్న బెలూన్స్ అన్నింటిని మూడు నిమిషాలలోపు పగలగొట్టాల్సి ఉంటుంది. టాస్క్ ప్రారంభమయ్యే ముందు మూడు నిమిషాలు ఉంది కాబట్టి ధీమాగా పగలగొట్టేస్తాను అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు శివాజీ. కానీ టాస్క్ ప్రారంభమయిన తర్వాత మొదట్లోనే తడబడ్డాడు. ప్రోమోను బట్టి చూస్తే శివాజీ.. టాస్కులో గెలవలేక అమర్‌దీప్‌కు తన ఇంటి ఆహారాన్ని సంపాదించి పెట్టలేకపోయాడేమో అనిపిస్తోంది.
Also Read: బాలయ్య షోలో శ్రియ, సుహాసిని సందడి - ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?