అన్వేషించండి

Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయిపోయారు. రేపు (ఆదివారం) నయని పావని ఎలిమినేషన్ ఎపిసోడ్‌ ప్లే కానుంది.

Nayani Pavani Eliminated From Bigg Boss 8: బిగ్ బాస్ 8 తెలుగు నుంచి మరో వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. గేమ్ స్టార్ట్ అయిన 35 రోజుల తర్వాత ఏడుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మెహబూబ్ గతవారంలో ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు నయని పావని కూడా హౌజ్ నుంచి బయటకు వస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా నయని పావని వైల్డ్ కార్డ్‌గానే హౌజ్‌లోకి వెళ్లారు. కానీ పోయినసారి వారంలోనే బయటకు వచ్చేశారు. ఈసారి మాత్రం దాదాపు నాలుగు వారాలు హౌజ్‌లో ఉన్నారు.

మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం పూర్తిగా గొడవలతోనే గడిచిపోయింది. నామినేషన్స్‌లో మొదలైన గొడవలు చినికి చినికి గాలివానగా మారి ఏకంగా మెగా చీఫ్ టాస్క్ వరకు జరిగాయి. బీబీ ఇంటికి దారేది అనే టాస్కుల్లో చివరకు వరకు నిలబడ్డ అవినాష్ మెగా చీఫ్ ఈసారి అయ్యాడు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మెగా చీఫ్ టాస్కే జరిగింది. ఆ తరువాత దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లందరికీ బిగ్ బాస్ సర్ ప్రైజ్‌లు ఇచ్చాడు. వారి వారి ఫ్యామిలీ వీడియోలను ప్లే చూసి అందరినీ ఎమోషనల్ చేశాడు

మెగా చీఫ్ టాస్కులో నిఖిల్, నబిల్, ప్రేరణ అవినాష్ మధ్య ప్రధానంగా పోరు జరిగింది. నబిల్‌ను నిఖిల్ కావాలని టార్గెట్ చేసినట్టుగా క్లియర్‌గా కనిపించింది. అవినాష్‌ని మెగా చీఫ్ చేయాలన్న మోటివ్‌తోనే నబిల్ ఆడినట్టుగా ఇందులో కనిపించింది. నబిల్ కావాలనే ఓడిపోయాడన్న విషయం కూడా అందరికీ అర్థమైంది. మెగా చీఫ్ అయిన తర్వాత అవినాష్‌తో నయని పావని ఏవో ముచ్చట్లు చెప్పింది. ‘నువ్వు సరిగ్గా పని చేయలేవని, కిచెన్ టీం అయితే తక్కువ పని ఉంటుందని అడిగావంట కదా.. అందుకే నిన్ను విష్ణు కిచెన్ టీంలో వేసిందట.’ అని నయని పావని అవినాష్‌తో చెప్పింది.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 61 రివ్యూ: యష్మిని టార్గెట్ చేసిన నిఖిల్... చిన్న పిల్లల్లా మారిన అవినాష్, ప్రేరణ - స్టామినా లేదంటూ ఏడ్చిన టేస్టీ తేజా

ఈ మాటలకు టేస్టీ తేజ సాక్ష్యమని చెప్పింది. కానీ తేజ మాత్రం అలా చెప్పలేదు అంటూ నయనికి షాక్ ఇచ్చాడు. తేజ అలా అనేసరికి ‘నేను అయితే మాటలు మార్చను’ అంటూ నయని హర్ట్ అయిపోయినట్లు కనిపించింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏంటి? ఇలా అంటూ గౌతమ్ మధ్యలోకి వచ్చాడు. దీంతో గౌతమ్ మీద నయని ఒక్కసారిగా విరుచుకుపడింది. నీకు మ్యాటర్ లేదు. అదీ ఇదీ అంటూ ఏదేదో నోటికొచ్చినట్లు అనేసింది. దీంతో గౌతమ్‌కు కూడా ఫుల్లుగా కోపం వచ్చింది. అక్కా అంటూ కౌంటర్ వేయడానికి వెళ్లిపోయాడు. అక్కా ఏంటి? అంటూ నయని పావని మళ్లీ తెగ ఫైర్ అయింది. ‘నీకు మ్యాటర్ లేదు అని నేను అనలేదు.. నీకు సంబంధం లేని మ్యాటర్‌లోకి అస్సలు రావొద్దని అంటున్నా’ అని నయని పావని చెప్పింది.

అక్కా అని అనకు.. అది స్టైల్ అనుకోకు.. అందరినీ అక్కా అనడం అలవాటు అయిందంటూ నయని ఏదేదో అనుకుంటూ వెళ్లిపోయింది. అక్కా అంటే ఇంత మంది మనోభావాలు దెబ్బ తింటాయని నాకు బిగ్ బాస్ ఇంటికి వచ్చాకే అర్థమైందని గౌతమ్ మళ్లీ సెటైరికల్‌గా అన్నాడు. దీపావళి కదా అని బిగ్ బాస్ స్వీట్లు పంపితే.. నబిల్‌కు ఫుల్‌గా నోరూరిపోయింది. పండుగ కదా.. ఈ ఒక్క రోజుకి తిను అని నబిల్‌కు ఆఫర్ ఇచ్చేశాడు బిగ్ బాస్. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినా కూడా తనను ఎవ్వరూ గుర్తించడం లేదు అంటూ కిచెన్ టైంను పెంచడంపై కంటెస్టెంట్లకు కౌంటర్ వేశాడు బిగ్ బాస్.

Also Readబిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 62 రివ్యూ: గౌతమ్, నయని గొడవ... కంటెస్టెంట్లను ఏడ్పించారు - ప్రేక్షకుల సంగతేంటి బిగ్ బాస్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget