అన్వేషించండి

Bigg Boss OTT 2: ‘బిగ్ బాస్’లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్, 30 సెకన్ల పాటు లిప్ కిస్ - మండిపడుతోన్న నెటిజన్స్!

ప్రస్తుతం హిందీలో ‘బిగ్ బాస్ ఓటీటీ 2’ రన్ అవుతోంది. దీనికి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. ఈ ఓటీటీ షో ప్రారంభం అయిన మొదట్నుంచీ అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా షో లో..

Bigg Boss OTT 2: ‘బిగ్ బాస్’ షో కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ భాషలో అయినా ఈ షో కు ఉండే క్రేజ్ ఒకేలా ఉంటుంది. ఒకప్పుడు ‘బిగ్ బాస్’ షో ను ఇంట్లో అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూసేవారు. అయితే ఇప్పుడు వచ్చే ‘బిగ్ బాస్’ సీజన్లు మాత్రం విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. షో పాపులారిటీ కోసం కంటెస్టెంట్ లతో రకరకాల టాస్క్ లు చేయిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో ‘బిగ్ బాస్ ఓటీటీ 2’ రన్ అవుతోంది. దీనికి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. ఈ ఓటీటీ షో ప్రారంభం అయిన మొదట్నుంచీ అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా షో లో టాస్క్ పేరుతో ఇద్దరు కంటెస్టెంట్ లు 30 సెకన్ల పాటు లిప్ కిస్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

లైవ్ కెమెరాల ముందే ఘాటు ముద్దులు..

ప్రస్తుతం హిందీలో ‘బిగ్ బాస్ ఓటీటీ 2’ రన్ అవుతోంది. ఈ షో ముందు నుంచే వార్తల్లో నిలుస్తూ వస్తోంది. షో ప్రారంభం అయిన 24 గంటల్లోనే హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక హౌస్ లో కంటెస్టెంట్ లు అయిన జాద్ హదీద్, ఆకాంక్ష పూరి వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. హౌస్ ప్రారంభం అయిన కొన్ని రోజులకే కొంత మంది జంటలుగా విడిపోయారు. వారిలో జాద్, ఆకాంక్ష కూడా ఉన్నారు. గత కొద్ది రోజులుగా వీరు చేస్తున్న చేష్టలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఇద్దరూ కలసి ఏదో పెద్ద షాక్ ఇచ్చేలా ఉన్నారు అని నెటిజన్స్ ముందు నుంచీ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా అందరూ అనుకున్నట్టే అయ్యింది. జాద్ హదీద్, ఆకాంక్ష పూరికు లిప్ కిస్ ఇచ్చేశాడు. అదీ దాదాపు 30 సెకన్లపాటు వారు ముద్దు పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రేక్షకులు లైవ్‌లో వీక్షిస్తున్నారని తెలిసి కూడా కెమెరాల ముందు రెచ్చిపోయారు. తోటి హౌస్ మెట్ అవినాష్ సచ్ దేవ్ ఇచ్చిన ఛాలెంజ్ లో భాగంగా వారు ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ లిప్ లాక్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 

‘బిగ్ బాస్ ఓటీటీ 2’ పై మండిపడుతోన్న నెటిజన్స్..

జాద్, ఆకాంక్ష లిప్ లాక్ వ్యవహారం పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. కొంత మంది దీన్ని లైట్ తీసుకుంటూ కామెంట్లు చేస్తుంటే ఎక్కువ శాతం మంది వీరి తీరుపై మండిపడుతున్నారు. ‘ఓటీటీలు అంటేనే ఇంట్లో అందరూ కలసి చూసే వేదిక, అలాంటి ఓటీటీలో ప్రసారమయ్యే షోలో ఇలా చేయడం కరెక్ట్ కాదు’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘బిగ్ బాస్ ఓటీటీకు సెన్సార్ ఉండదా, నిర్వాహకులు ఏం చేస్తున్నారు’ అంటూ మరో వ్యక్తి విమర్శించాడు. ‘పాపులారిటీ కోసం ఇలాంటి టాస్క్ ఇస్తున్నారు’ అంటూ మరోవ్యక్తి మండిపడ్డాడు. ఇలా దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఈ వ్యవహారంపై హోస్ట్ సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక జాద్ హదీద్ దుబాయ్‌లో నివసిస్తున్న ఓ మోడల్. అతను విడాకులు తీసుకున్నాడు. అతనికి ఓ చిన్న కుమార్తె కూడా ఉంది. అలాగే ఆకాంక్ష పూరి బిగ్ బాస్ 13 లో కూడా పాల్గొంది. రియాలిటీ షో ‘మికా ది వోహ్తి’ టైటిల్‌ను సైతం ఆమె గెలుచుకుంది.

Also Read: ‘చంద్రముఖి 2’ వచ్చేస్తోంది - 18 ఏళ్ల తర్వాత మళ్లీ లకలకలక!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget