News
News
X

Bigg Boss 6 Telugu: నామినేషన్లో టార్గెట్ చేసిన ఇంటిసభ్యులు,బాత్రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ పెట్టుకున్న ఇనయా

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్న ఇనయా చాలా హర్ట్ అయింది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: మొదట్నుంచి ఇంటి సభ్యుల్లో కొంతమంది ఎందుకో ఇనయా విషయంలో చాలా తేలికగా మాటలు అంటున్నారు. ముఖ్యంగా నామినేషన్ టైమ్‌లో శ్రీహాన్, గీతూ, ఆదిరెడ్డి ఇనయాకు కనీస మర్యాద కూడా ఇవ్వరు. ఈ నామినేషనే కాదు, పాత నామినేషన్లలో కొన్నింటిని చూస్తే అర్థమవుతుంది. ఆ అమ్మాయిని అంతగా తేలిక చేసిన మాట్లాడేంత తప్పు ఏం చేసింది. 

సూర్య అంత గేమరా?
కేవలం ఇనయానే సూర్యను బయటికి పంపినట్టు మాట్లాడుతున్నారు ఇంటి సభ్యులు. నామినేషన్లోకి తక్కువగా వచ్చిన వాళ్లు ఎప్పటికైనా త్వరగా వెళ్లిపోతారు. నిత్యం నామినేషన్లో ఉన్నవారికి ఓటు బ్యాంకు పెరుగుతుంది. సూర్యకు ఓటు బ్యాంకే లేదు. ఎందుకంటే ఆయన కేవలం రెండుసార్లే వచ్చాడు నామినేషన్లోకి. ఇనయా నామినేట్ చేయకపోతే ఆయన వెళ్లడా? ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళతాడు. అతను అంత గొప్ప గేమర్ అయితే ప్రేక్షకులే కాపాడుకునేవారు. కానీ సూర్య వెళ్లడం ఇనయా తప్పే అన్నట్టు ఇంటి సభ్యులంతా టార్గెట్ చేశారు. ఆమెను ఒంటరిని చేసి దాడి చేశారు. 

శ్రీసత్య చేసింది తప్పు కాదా?
ఇనయా సూర్యను వాడుకుంది అన్న మాటలు అన్నారు చాలా మంది ఇంటి సభ్యులు. మరీ శ్రీసత్య అర్జున్ ఉన్నంత కాలం ఆయన్ను వాడుకోలేదా?  హోటల్ టాస్కులో తన చుట్టు తిప్పుకుని మరీ ఆయన వీక్ నెస్‌ను తన బలంగా మార్చుకుంది. డబ్బులు సంపాదించి కెప్టెన్సీ కంటెండర్ అయింది. మరి అది కూడా ఫ్రెండ్ వాడుకోవడమే కదా. నిజం చెప్పాలంటే శ్రీసత్య హైలైట్ అవ్వడానికి అర్జునే కారణం. ఆమె చుట్టూ ఆయన తిరగకపోతే మరోలా ఉండేది శ్రీసత్య కథ.

గీతూ కన్నా చాలా బెటర్
నిజం చెప్పాలంటే ఆటలో గీతూ కన్నా ఇనయా చాలా బెటర్. కన్నింగ్ ఆటలు, ఒకరి వీక్‌నెస్‌ తో ఆటలు ఆడదు. గీతూ ఒకరి ఎమోషన్‌కు కూడా విలువివ్వదు. మాట్లాడే తీరు ఎంత ఛండాలంగా ఉంటుందో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆదిరెడ్డి అయితే ఈమె వెనుక బౌన్సర్‌లా తిరుగుతూనే ఉన్నాడు.

News Reels

ఇనయా వల్ల బయటకు వెళ్లిన సూర్య కూడా అంత ఫీలవ్వడం లేదు, కానీ మిగతా వాళ్లు  ఎక్కువ ఫీలైపోతున్నారు. నిజానికి ఇనయాను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతోనే సూర్య టాపిక్‌ను పదే పదే తీస్తున్నారు.  పెద్దగా ఆటే ఆడని సూర్య అంటే వీరికి ఎందుకంత ఇష్టమో మరి.

ఇక ప్రోమోలో ఏముందంటే... నామినేషన్ ప్రక్రియ ముగిశాక అందరూ గుంపుగుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గీతూ, ఆదిరెడ్డి, శ్రీ సత్య, శ్రీహాన్, ఫైమా ఒక గ్రూపుగా ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. ఈలోపు ఇనయా బాత్రూమ్ లోకి వెళ్లిపోయి ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో అందరూ వెళ్లి బయటికి రమ్మని పిలిచారు. అయినా ఇనయా రానని ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో తలుపు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇంటి సభ్యులు.  ఏమవుతుందో ఎపిసోడ్లో చూడాలి.

Also read: గీతూ ఇక మారదా? ఎదుటివారి వీక్‌నెస్‌తోనే ఆడుతుందా - బుద్ధిబలం అంటే ఇదేనా?

Published at : 01 Nov 2022 06:51 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల