By: ABP Desam | Updated at : 06 Sep 2023 07:24 PM (IST)
Image Credit: Bigg Boss 7 Telugu/Twitter
‘బిగ్ బాస్’ సీజన్ 7 సందడి మొదలయ్యింది. ఇక హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన మొదటిరోజే నామినేషన్స్‌తో హౌజ్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశారు ‘బిగ్ బాస్’. ఈ నామినేషన్స్ వల్ల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి, వాగ్వాదాలు అయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులకు తగిన ఎంటర్‌టైన్మెంట్ అందించాయి. హౌజ్‌లోకి వచ్చి రెండు రోజులే అయినా కూడా అప్పుడే ప్రేక్షకులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అని డిసైడ్ చేసి, వారికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. అయితే ప్రతీ ‘బిగ్ బాస్’ సీజన్‌తో పోలిస్తే.. ఈసారి ఓటింగ్ విషయంలో కూడా మార్పులు జరగనున్నాయి అని లాంచ్ ఎపిసోడ్‌లోనే నాగార్జున ప్రకటించారు.
ప్రేక్షకుల చేతిలో నిర్ణయం..
‘బిగ్ బాస్’లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్లిపోవాలి అనే విషయాలు.. ప్రేక్షకుల చేతిలో ఉంటాయని మొదటి సీజన్ నుండే ‘బిగ్ బాస్’ టీమ్ చెప్తోంది. అది పూర్తిగా నిజమా, కాదా తెలియకపోయినా.. ప్రేక్షకులు మాత్రం స్వచ్ఛందంగా తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేస్తారు. కొందరు మాత్రం ఇష్టంగా ‘బిగ్ బాస్’ చూసినా.. ఓట్ల వల్ల కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వరు అనే విషయాన్ని నమ్మకపోవడంతో అసలు ఓట్లు వేయకుండా కేవలం.. షోను చూసి వదిలేస్తారు. ప్రతీవారం ‘బిగ్ బాస్’ ఓటింగ్ విషయంలో అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ హౌజ్ నుంచి కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు.
10 కాదు ఒకటి మాత్రమే..
ప్రతీ ‘బిగ్ బాస్’ సీజన్‌తో పోలిస్తే.. ఈసారి ఓటింగ్ ప్రక్రియలో అనేక మార్పులు జరిగాయి. ఒకప్పుడు హాట్‌స్టార్ యాప్ ద్వారా, మిస్డ్ కాల్ ద్వారా రోజుకు 10 ఓట్లు వేసే సౌలభ్యం.. ప్రతీ ప్రేక్షకుడికి లభించేది. కానీ ఈసారి అలా కాదు.. ప్రతీ ప్రేక్షకుడు హాట్‌స్టార్ ద్వారా అయినా.. మిస్ట్ కాల్ ద్వారా అయినా.. కేవలం ఒక ఓటు మాత్రమే వేయగలరని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వీటితో పాటు వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. రోజుకు ఒక ఓటు మాత్రమే వేసే అవకాశం ఉండడంతో ప్రేక్షకులు కూడా చూసి జాగ్రత్తగా ఓట్లు వేయాలని ఆయన అన్నారు. ఇలా రూల్స్ అన్నీ మారడంతో ‘బిగ్ బాస్’ సీజన్ 7 ఇంకా ఎన్నెన్ని ఉల్టా పుల్టా వింతలు చూపిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నామినేషన్స్‌లో ఉన్నది వీరే..
‘బిగ్ బాస్’ సీజన్ 7 మొదటి నామినేషన్స్ పూర్తయ్యే సమయానికి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్.. ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. వారే శోభ, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని. ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్న వ్యక్తులు.. ఎవరికి వారుగా ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా శోభా శెట్టి అయితే నామినేషన్స్ సమయంలో అందరికంటే ఎక్కువగా గొడవలకు దిగింది. అంతే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇక ‘బిగ్ బాస్’లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు ఓటు వేయడం కోసం కరెక్ట్ ప్రక్రియ ఏంటి అని టీమ్ స్పష్టంగా బయటపెట్టింది.
హాట్‌స్టార్‌లో ఓటింగ్ ప్రక్రియ..
1. హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. అందులో ‘‘బిగ్ బాస్’ తెలుగు’ అని సెర్చ్ చేసి ఓటు వేయాలి.
2. అలా చేసిన తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫోటోలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
3. ప్రేక్షకుడు ఓటు వేయాలని అనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటోపై క్లిక్ చేసి, ఎన్ని ఓట్లు వేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.
4. ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే చాలు.. ఓటు వెళ్లిపోతుంది.
5. ఈ ప్రక్రియతో రోజుకు ఒక ఓటు మాత్రమే వేయగలరు ప్రేక్షకులు.
Also Read: ‘‘బిగ్ బాస్’’ సీజన్ 7లో కుస్తీ పోటీలు - కన్నీళ్లు పెట్టుకున్న ఆట సందీప్, గౌతమ్ కృష్ణ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
/body>