Amardeep: మంచి జాబ్ వదిలేసి నటన వైపు, ఇప్పుడు బిగ్ బాస్‌తో ఊహించని క్రేజ్ - ఇదే అమర్‌దీప్ జర్నీ
Bigg Boss Amardeep: సీరియల్స్‌లో ఆర్టిస్ట్‌గా అమర్‌దీప్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నటన మీద ఆసక్తితో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్‌కు వచ్చి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
Bigg Boss Amardeep: నటన మీద ప్యాషన్‌తో మంచి జీతం ఉన్న ఉద్యోగాలు వదిలేసి.. సిటీలకు వచ్చి కష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. కానీ వారిలో చాలామందికి ఎంతో టాలెంట్ ఉన్నా లక్ కలిసిరాకపోవడం వల్ల గుర్తింపు లేకుండా మిగిలిపోతారు. కొందరు మాత్రం వారికి వచ్చే చిన్న చిన్న అవకాశాలతోనే కలలు నెరవేర్చుకుంటారు. అందులో అమర్‌దీప్ కూడా ఒకరు. బాగా చదువుకొని.. వేరే రాష్ట్రం వెళ్లి.. ఉద్యోగంలో సెటిల్ అయిన అమర్‌దీప్‌కు నటనపై ఉన్న ఆసక్తి హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగి బిగ్ బాస్ హౌజ్ వరకు వచ్చింది అమర్‌దీప్ జర్నీ.
కేరళలో ఉద్యోగం మానేసి..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో 1990 నవంబర్ 8న జన్మించాడు అమర్‌దీప్ చౌదరి. ఇంటర్ తర్వాత తను కూడా చాలామందిలాగా రొటీన్‌గా బీటెక్‌లో చేరాడు. అక్కడితో ఆగిపోకుండా మాస్టర్స్ డిగ్రీ కోసం లండన్‌కు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 2016లో ‘పరిణయం’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ తర్వాత నటనను కొన్నిరోజులు పక్కన పెట్టి కేరళలోని త్రివేండ్రంలో ఉద్యోగం వచ్చిందని అక్కడికి వెళ్లిపోయాడు. మళ్లీ ఏమైందో తెలియదు.. కొన్నాళ్లకే అక్కడ ఉద్యోగం మానేసి తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అప్పటినుండి షార్ట్ ఫిల్మ్స్‌తో తన నటన ప్రతిభ ఏంటో ప్రేక్షకులకు చూపించడం మొదలుపెట్టాడు.
షార్ట్ ఫిల్మ్స్ నుంచి సీరియల్స్ వరకు..
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్టిస్ట్‌గా చేరిన అమర్‌దీప్.. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో హీరోగా నటించాడు. ఆ షార్ట్ ఫిల్మ్సే తనను బుల్లితెరపై అవకాశం వచ్చేలా చేశాయి. మెల్లగా తనకు సీరియల్స్‌లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా పలు సీరియల్స్‌లో హీరోగా కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అమర్. ముఖ్యంగా ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌లో రామా పాత్రతో చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన ఫ్యాన్స్‌గా మార్చుకున్నాడు. అదే సమయంలో తనతో పాటు సీరియల్స్‌లో నటించే తేజస్విని గౌడతో ప్రేమ మొదలయ్యింది. 2022 డిసెంబర్ 14న బెంగుళూరులో కర్ణాటక సాంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది.
అమ్మా, నాన్న - ఇద్దరూ డ్యాన్సర్లే..
ఇక అమర్‌దీప్ ఫ్యామిలీ విషయానికొస్తే.. వారి కుటుంబం ముందు నుండే ఆర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. అమర్‌దీప్ తండ్రి అమీర్ బాషా ఒక కూచిపూడి డ్యాన్సర్. ఒకప్పుడు ఆర్‌టీసీలో విధులు నిర్వహించి.. తాజాగా రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఇక అమర్ తల్లి రూపా కూడా డ్యాన్సరే. బీజేపీ లీడర్‌గా రూపా.. రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక అమర్‌దీప్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసిన ప్రేక్షకులు.. మిగతా కంటెస్టెంట్స్ కంటే ఆర్థికంగా తను బెటర్ అని ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి అమర్.. టాస్కులకంటే ఎక్కువగా ఫన్ మీదే దృష్టిపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొన్నివారాల వరకు అసలు ఏ ఆట కనబరచకుండా, ఒక స్ట్రాటజీ అనేది లేకుండా ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ అయిపోయాడు. కానీ గత కొన్నివారాలుగా తన ఆట మారింది. ప్రతీ టాస్కులో కష్టపడడం మొదలుపెట్టాడు. దీంతో తనకు ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ వస్తోంది.
Also Read: ప్రియాంక జైన్ ప్లస్, మైనస్‌లు ఇవే - అన్నిట్లో ఫస్ట్, దోస్తుల వల్లే ట్రోఫీ దూరం?