Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది
Bigg Boss 6 Telugu: ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో చూస్తే పెద్ద వేడుకలా ఉంది.
Bigg Boss 6 Telugu: ఈ సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాలే ఉండడతో శనివారం నాగార్జున క్లాసులు తీసుకోవడం మానేశారు. ఈ రోజు ఎపిసోడ్ కూడా పండుగలా నిర్వహించారు. పాత కంటెస్టెంట్లను, ఇప్పటి ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్లను తీసుకొచ్చారు. వారి రాకతో ఇంటి సభ్యుల ఆనందం రెట్టింపైంది.
ఇక ప్రోమోలో ఏముందంటే...ఇనయా కోసం సొహెల్, ఆమె కుటుంబసభ్యుడు ఒకరు వచ్చారు. సోహెల్‌ను చూడగానే ఆమె ఆనందంతో అరిచింది. సోహెల్ కోసం మణికొండ షిప్టు అయి మరీ జిమ్‌లో జాయిన్ అయినట్టు బయటపెట్టింది. సోహెల్ ఎందుకు మానేసిందో కనుక్కోండి అనగానే ఇనయా ‘సోహెల్ ఇద్దరమ్మాయిలతో జిమ్ చేస్తాడు’ అంటూ ఏదో చెప్పబోయింది. ఆమెను మధ్యలోనే ఆపేసి సోహెల్ ‘నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావ్’ అంటూ కామెడీ చేశాడు. ఇక ఫైమా కోసం ఆమె సోదరి సల్మా, జబర్దస్త్‌లో ఆమె టీమ్ లీడర్ బుల్లెట్ భాస్కర్ వచ్చారు. ఫైమా ‘అందరూ బాగున్నారా’ అంటూ నొక్కి నొక్కి అడిగింది. దీంతో భాస్కర్ ‘అందరూ బాగున్నారు, వాడు కూడా బాగున్నాడు’ అంటూ చెప్పాడు. ఇనాయ గురించి మాత్రం పెద్ద జోక్ వేశాడు. ‘మీరు మాట్లాడుతుంటే వీధిలోని పది టీవీల్లో తొమ్మిది టీవీలు మ్యూట్ లో పెట్టుకుంటున్నారు’ అన్నాడు.
శ్రీహాన్ కోసం శివ బాలాజీ, శ్రీహాన్ తండ్రి వచ్చారు. రేవంత్ గురించి మాట్లాడుతూ బుల్లెట్ భాస్కర్ ‘ మీరాడుతుంటే జల్లికట్టు అవుతుందేమో అనిపిస్తుంది, బిగ్ బాస్ సెట్ పక్కన ఒక అంబులెన్స్ రెడీగా పెట్టారు’ అని చెప్పాడు. రేవంతో కోసం వాళ్లన్నయ్య, రోల్ రైడా వచ్చారు. రేవంత్ అన్నయ్య చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో నాగార్జున ‘నువ్వు లోపలుండుంటే వాళ్లంతా ఏమై ఉండేవారో’ అన్నారు.
ఈ రోజు ఎలా ఉంటుందోనని ఎంతో మంది ప్రేక్షకులు ప్రోమో కోసం ఎదురుచూశారు. ఇంకా రెండు వారాలే ఉంది, అందులోనూ ఈ ఆటలేమీ లేవు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చారు... కాబట్టి నాగార్జున అంత సీరియస్ క్లాసులేవీ తీసుకోరని ఊహించారు ప్రేక్షకులు. వారు ఊహించినట్టే ఈనాటి ఎపిసోడ్ వేరేగా ఉంది. ఇక ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. రాజ్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం వచ్చింది. అదెంత వరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి.
View this post on Instagram
Also read: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా