News
News
X

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో గజిని, టాస్క్ ఏ టీమ్ గెలిచిందో తెలుసా?

Bigg Boss 6 Telugu: ఫన్నీగా సాగిన బీబీ హోటల్ టాస్కు చివరికి చేదుగా మారింది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో హోటల్ టాస్కు చాలా ఫన్నీగా జోరుగా సాగింది. ప్రేక్షకులను బాగానే అలరించారు హోటల్ సిబ్బంది, గెస్టులు. అయితే ఈనాటి ఎపిసోడ్లో టాస్కు ముగిసే సమయం వచ్చేసినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఈ సమయంలో మళ్లీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు మొదలైనట్టు ప్రోమోలో కనిపిస్తుంది. చివరికి సుదీప కంటినీరు పెట్టుకుని కనిపించింది. ఆమె ఎవరి వల్ల హర్ట్ అయ్యిందో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి. 

ప్రోమోలో ఏముందంటే...సూర్య మతిమరుపు గెస్టు పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా అతను ఈసారి గజినీలా తయారయ్యాడు. ఒంటినిండా పేర్లు రాసుకున్నాడు. శ్రీ సత్య కూడా వచ్చి తన పేరు రాసి వెళ్లిపోయింది. మధ్యలో ఫైమా వచ్చి ‘ముఖం చూడు ముఖం ఏబ్రాసి ముఖం’ అంటూ కామెడీ చేసింది.  తరువాత బిగ్ బాస్ ఏ హోటల్ సిబ్భంది ఎంత డబ్బు సంపాదించారో చెప్పమని అడిగారు. బీబీ హోటల్ మేనేజర్ సుదీప తమ దగ్గర నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉన్నట్టు చెప్పింది. ఇక గ్లామ్ ప్యారడైజ్ హొటల్ మేనేజర్ ఫైమా తమ దగ్గర అయిదు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నట్టు చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. 

బీబీ హోటల్ స్టాఫ్ నుంచి ఇద్దరిని కెప్టెన్సీ కంటెండర్ అయ్యే రేసు నుంచి తొలగించాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఫైమా రేవంత్, ఆదిత్య పేరు చెప్పింది. ఇది ఇంకా షాకిచ్చింది ఇంటి సభ్యులకు. ఇక రేవంత్, ఆదిత్య ముఖాలైతే మాడిపోయాయి.

రెండో లెవెల్
హోటల్ వర్సెస్ హోటల్ టాస్కు రెండో లెవెల్ కు చేరుకుంది. ఇందులో బీబీ హోటల్, గ్లామ్ ప్యారడైజ్ స్టాఫ్ లో కొంతమంది కలిసి మాట్లాడుకుంటున్నారు. శ్రీ సత్య నేను కూడా రావచ్చా అనగానే, సుదీప ‘ప్లీజ్ ఏమనుకోకు టూ మినిట్స్ ఉండు’ అంది. దీంతో శ్రీ సత్యకు చాలా కోపం వచ్చేసింది. తాను సోలో ఆట ఆడుతున్నానని, ఎవరికైనా డీల్ కావాలంటే తన దగ్గరికి రావచ్చని అంది. ఆదిరెడ్డి ఇంట్లో ఫుడ్ దగ్గర బేరాలాడుతూ కనిపించాడు. 

News Reels

బిగ్ బాస్ హోటల్ టాస్కు మరికాసేపట్లో ముగిసిపోతుందని ప్రకటించాడు. దీంతో అందరూ డబ్బులు లెక్కపెడుతూ కనిపించారు. ఈ విషయంలో ఆరోహికి, సుదీప, గీతూ మధ్య  ఇదే విషయంలో చర్చలు జరిగాయి. చివరికి ఏమైందో కానీ సుదీప కన్నీటితో ప్రోమో ముగిసింది. 

Also read: మరో షన్ను - సిరిలా మారిన సూర్య -ఆరోహి, ఇంట్లో బీబీ హోటల్ గేమ్, చంటికి సీక్రెట్ టాస్కు

Also read: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Published at : 28 Sep 2022 05:46 PM (IST) Tags: bb hotel task Bigg Boss 6 Telugu inaya sulthana Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Revnath Faima won the game

సంబంధిత కథనాలు

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి