అన్వేషించండి

Bigg Boss 8 Telugu: ఆదిత్య ఓం తర్వాత నైనిక అవుట్, ఐదో వారం ఎలిమినేట్ అయ్యేది ఆ అమ్మాయే... ఓటింగ్‌లో ఇంత దారుణమా?

Bigg Boss 8 Telugu nominations this week: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించిన 5 వ వారం ఎలిమినేషన్ డే వచ్చేసింది. ఈ వారం నైనిక ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో ప్రస్తుతం ఐదవ వారం ఎండింగ్లో ఉంది. అయితే ఈ వారం కూడా అనుకున్నట్టుగానే నైనిక ఎలిమినేట్ అయ్యింది. 

ఈ వారం నైనిక ఎలిమినేషన్ 
సెప్టెంబర్ 1న ఈ షోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా, వారానికి ఒకరు చొప్పున ఇప్పటిదాకా నలుగురు కంటెస్టెంట్స్ బయటకెళ్లారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల వరుసగా ఎలిమినేట్ అయ్యారు. తాజా వారానికి సంబంధించిన మిడ్ నైట్ ఎలిమినేషన్ జరగగా, అందులో ఆదిత్య ఓం అనుకున్నట్టుగానే బయటకు వచ్చేశారు. ఈ వారం మొదట్లోనే నాగర్జున డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అందులోనూ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మిస్ కాకుండా చూడండి అంటూ షోపై ఆసక్తిని పెంచేసిన విషయం తెలిసిందే. మొత్తానికి గురువారం నాడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య బయటకు వెళ్లడంతో వీకెండ్ ఎవరిని బయటకు పంపబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఐదవ వారం నామినేషన్స్ లో నైనిక, నిఖిల్, ఆదిత్య ఓం, నబిల్, విష్ణు ప్రియ, మణికంఠ ఉండగా.. అందులో ఆల్రెడీ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మొత్తం ఐదు మంది ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు. అయితే వీకెండ్ లో ఎప్పటిలాగే ముందుగా ఊహించినట్టుగానే నైనిక ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం.

Read Also : Matka Teaser: వరుణ్ తేజ్ 'మట్కా' టీజర్... హైలెట్స్ ఇవే - మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే, అదిరిందంతే!

ఆమె ఓటింగ్ దారుణం... 
ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే ఎప్పటిలాగే నబిల్ అఫ్రిది అగ్రస్థానంలో ఉండగా, నిఖిల్ రెండవ స్థానంలో కొనసాగాడు. ఇక మణికంఠ ఎప్పటిలాగే మూడో స్థానం కంటిన్యూ చేయగా, విష్ణు ప్రియ నాలుగో స్థానంలో ఉంది. చిట్ట చివరి స్థానంలో ఢీ ఫేమ్ నైనిక ఉండడంతో ఆమె డేంజర్ జోన్ లో పడింది. పైగా పైనున్న నలుగురితో పోలిస్తే నైనికాకే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గేమ్స్ బాగానే ఆడి ఆకట్టుకున్నప్పటికీ ఓటింగ్ పెద్దగా లేకపోవడంతో ఈ బ్యూటీని ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి వీకెండ్ ఆడపులిలా గేమ్ ఆడి, చీఫ్ అయ్యింది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆమె గేమ్ డల్ అవుతూ వచ్చింది. ఈ కారణంగానే ఆమెకు తక్కువ ఓట్లు పడ్డట్టుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా హౌస్ లో ఉన్న వారందరూ ఆమె వీక్ అంటూ ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బయట ప్రేక్షకులు కూడా ఆమె గేమ్ పట్ల ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు. తాజా ఎలిమినేషన్ తో ఆమె బయటకు రావడంతో అదే ప్రూవ్ అయింది. ఇక ప్రస్తుతం అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నది బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి. ఇవి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల పేరిట ఏకంగా ఎనిమిది మంది అడుగు పెట్టబోతున్నారు. అందులో ఎవరెవరు ఉండబోతున్నారో చూడాలి.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget