Biggboss: బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం... బ్యాన్ చేయాలంటున్న నారాయణ
బిగ్ బాస్ షో పై మండిపడ్డారు నారాయణ. ఈ షో వల్ల ఉపయోగం లేదని, నిషేధించాలని డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ ప్రారంభమయ్యాక ప్రతి సీజన్లోను సీపీఐ నాయకులు నారాయణ ఆ కార్యక్రమాన్ని నిషేధించాలని కోరుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో మొదలై వారం రోజులు అయ్యిందో లేదో... నారాయణ ఆ షోను, ప్రసారం చేస్తున్న ఛానెల్ ను కూడా నిషేధించాలని అన్నారు. ‘బిగ్ బాస్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా... సమాజానికి ఇలాంటి షోల వల్ల ఏం ఉపయోగం’అంటూ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి షోలకు ఎందుకు అనుమతిస్తున్నాయని ప్రశ్నించారు. బిగ్ బాస్ షో ఒక బూతుల ప్రపంచమని, దాన్ని వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నారని అన్నారు. షోలో ఉన్న వారి తిట్లు, కొట్లాటలు చాలా అనైతికంగా అనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ షోపై కోర్టులో వ్యాజ్యం వేసినా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ తనకు సహకరించలేదని తెలిపారు.
గతంలో కూడా నారాయణ బిగ్ బాస్ షోను ఆపాలంటూ డిమాండ్ చేశారు. యువతీ యువకులను వంద రోజులకు పైగా ఒక ఇంట్లో ఉంచి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆయన అడిగారు. గతేడాది బిగ్ బాస్ 4 సీజన్ లో హోస్ట్ నాగార్జునపై కూడా మండి పడ్డారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నారని బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది. 2021 సెప్టెంబరు 5న షో మొదలైంది. మొత్తం 19 మందిని హౌస్లోకి పంపించారు. ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నిజానికి సీజన్ 5 ఈ ఏడాది జూన్ నెలలోనే ప్రారంభమవ్వాల్సి ఉంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సీజన్లో యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ చంద్ర, సీరియల్ హీరోలు మానస్, సన్నీ, ఆర్జే కాజల్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, సీనియర్ నటీమణులు ప్రియ, ఉమా, కమెడియన్ లోబో, యూట్యూబ్ స్టార్లు సిరి హనుమంత్, షణ్ముక్ జస్వంత్, మోడల్ జెస్సీ లాంటి వారు ఉన్నారు.
Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
Also read: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం
Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని