Neha Chowdary: ‘బిగ్ బాస్’ ఫినాలే నుంచి నేరుగా వెళ్లి పెళ్లి చేసుకున్న నేహా చౌదరి
‘బిగ్ బాస్’ ఫినాలే ఎట్టకేలకు ముగిసింది. సీజన్-6లో పాల్గొన్న కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లి దుస్తు్ల్లోనే ఫినాలేలో పాల్గొంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పెళ్లి చేసుకుంది.
‘బిగ్ బాస్’ సీజన్-6 ఆదివారంతో ముగిసింది. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు తమ లక్‌ను పరీక్షించుకున్నారు. అయితే, చివరికి శ్రీహాన్, రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ టాప్-5లో నిలిచారు. చివరికి రేవంత్ విన్నర్‌గా ట్రోపీని అందుకోగా, శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచారు. ఫినాలే సందర్భంగా గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. అయితే, మరికొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకుని.. వధువు గెటప్‌లోనే షోకు వచ్చేసింది ఓ కంటెస్టెంట్. ఆమె మరెవ్వరో కాదు.. యాంకర్ నేహా చౌదరి. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో వారంలోనే నేహా ఎలిమినేట్ అయ్యింది.
‘బిగ్ బాస్’ నేపథ్యంలో ఏడాది వరకు పెళ్లి చేసుకోకూడదని భావించిన నేహా త్వరగా ఎలిమినేట్ కావడంతో ఇంట్లోవారు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ పెళ్లి కూడా ‘బిగ్ బాస్’ ఫినాలే రోజే కావడం విశేషం. దీంతో నేహా.. పెళ్లికూతురు గెటప్‌తోనే ఫినాలేకు చేరుకుంది. పట్టుచీర, చేతికి గోరింటాకుతో వచ్చిన ఆమెను చూసి హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా నేహా మాట్లాడుతూ.. ‘‘మీరు బిగ్ బాస్ ఎవరో ప్రకటించేసరికి నా మెడలో మూడు ముళ్లు పడనున్నాయి. నా బెస్ట్ ఫ్రెండ్ అనీల్‌నే పెళ్లి చేసుకోబోతున్నా’’ అని పేర్కొంది. ఫినాలే మధ్యలోనే నేహా కళ్యాణ మండపానికి చేరుకుంది. అంగరంగ వైభంగా నేహా పెళ్లయ్యింది.
Also Read: రన్నర్‌గా మారిన విన్నర్ శ్రీహాన్, అత్యధిక ఓట్లు ఆయనకే, కానీ - ప్రైజ్ మనీ ఎంతొచ్చిందంటే
View this post on Instagram
ఇక ‘బిగ్ బాస్’ ఫినాలేలో.. శ్రీహాన్ తీసుకున్న నిర్ణయంతో రేవంత్ విజేత అయ్యాడు. లేకుంటే రన్నరప్ గా మిగిలేవాడు. శ్రీహాన్ గోల్డెన్ బ్రీఫ్‌కేసులో నాగార్జున ఇచ్చిన నలభై లక్షల రూపాయలకు టెంప్ట్ అయి రెండోస్థానంలో నిలిచాడు. దీంతో మిగిలిన రేవంత్ విజేత అయ్యాడు. రేవంత్ ట్రోఫీని అందుకున్నాక నాగార్జున అసలు విషయం చెప్పారు. అత్యధిక ఓట్లు పడింది శ్రీహాన్‌కేనని చెప్పారు. ఏది ఏమైనా ఈ సీజన్లో ఇద్దరు విన్నర్లు అయ్యారు. రేవంత్ ఆడకుండా ట్రోఫీ అందుకున్నాడని చెప్పలేము. శ్రీహాన్‌కి అధిక ఓట్లు పడినప్పటికీ ఆటలో రేవంత్ తక్కువేమీ కాదు. అతను ఎలా ఆడినా, ఆడకపోయినా, పక్కవాళ్లని తిట్టినా, అరిచినా, గొడవలు పడినా... ఏం చేసినా ఓట్లు మాత్రం కొన్ని వారాల పాటూ గుద్ది పడేశారు ప్రేక్షకులు. కొన్ని వారాల తరువాత మధ్యలో ఇనాయ, తరువాత రోహిత్ అతనికి కాస్త పోటీ ఇచ్చారు, కానీ అది స్వల్పకాలమే. మళ్లీ రేవంత్ ఓటింగ్లో శిఖరానికి చేరాడు. అతని ఆటకు ముగ్ధులయ్యారో, లేక పాటకు పడిపోయారో కానీ ప్రేక్షకులు ఓట్లు మాత్రం వెల్లువలా వేశారు.కానీ చివర్లో మాత్రం ట్విస్టు ఇచ్చారు ప్రేక్షకులు. శ్రీహాన్‌కు ఓట్లు గుద్దేశారు. కానీ శ్రీహాన్ తీసుకున్న నిర్ణయంతో రేవంత్ విజేత అయ్యాడు. అప్పుడు ఇండియన్ ఐడల్ గెలిచిన రేవంత్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అయ్యాడు.