By: ABP Desam | Updated at : 04 Sep 2022 09:14 PM (IST)
కామన్ మ్యాన్ కేటగిరీలో ఆదిరెడ్డి ఎంట్రీ - ఎవరితడు?
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. కామన్ మ్యాన్ సెలెబ్రిటీగా యూట్యూబర్ ఆదిరెడ్డి షోలో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ రియాలిటీ షోలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తూ.. నెటిజన్లకు దగ్గరయ్యారు ఆదిరెడ్డి. సరదాగా బిగ్ బాస్ షోలపై విశ్లేషణలతో మొదలైన అతడి ప్రస్థానం ఇప్పుడు అదే షోకి ఎంపికయ్యే వరకు సాగడం విశేషం. మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు.
ఆదిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆదిరెడ్డి నెల్లూరులో డిగ్రీ చదువుతూ చివరి ఏడాది మానేశారు. అదే ఏడాది వైఎస్సార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంతో ఆదిరెడ్డి బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ సెలెక్షన్స్ లో ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరే సమయంలో అతడి తల్లి మరణించింది. దీంతో రెండేళ్లపాటు ఇంటి పట్టునే ఉండిపోయారు ఆదిరెడ్డి. ఆ తరువాత జాబ్ కోసం బెంగుళూరు వెళ్లారు.
అక్కడ ఉద్యోగం చేస్తూనే.. సరదాగా బిగ్ బాస్ షోపై తన విశ్లేషణలను యూట్యూబ్ లో పోస్ట్ చేసేవారు. కౌశల్ పై ఆదిరెడ్డి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటినుంచి అతడి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సొంతంగా తన పేరుతో యూట్యూబ్ ఛానెల్ ను మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన విశ్లేషణలు బిగ్ బాస్ సీజన్ 5 వరకు కంటిన్యూ చేశారు. అలానే ఓటీటీ షోపై కూడా రివ్యూస్ ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందట. మరి ఈ అవకాశాన్ని అతడి వినియోగించుకోగలరో లేదో చూడాలి..!
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం చాలా మంది పోటీదారులు ఉన్నారు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
We welcome our 18th contestant #AdiReddy to Bigg Boss house.
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022
#AdiReddyOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/yI5l7O5jL0
Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం
Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?
ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!
Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?