Bigg Boss 6: చలాకీ చంటి, అమర్ దీప్ - బిగ్ బాస్ 6 కోసం మరింతమంది కంటెస్టెంట్స్!
బుల్లితెర నటుడు అమర్ దీప్ బిగ్ బాస్ షోలోకి రాబోతున్నారట. ఆయనతో పాటు చలాకీ చంటి కూడా వస్తున్నట్లు టాక్.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా షోకి సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. చిన్న వీడియో వదిలారు. మల్టిపుల్ కలర్స్ తో ఈ లోగోను డిజైన్ చేశారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ షో మొదలవుతుందని టాక్. సెప్టెంబర్ నుంచి వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపించనున్నారు.
గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న లిస్ట్ ప్రకారం.. యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది.
Chalaki Chanti, Amardeep in Bigg Boss6: వీరితో పాటు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ వస్తున్నాడని సమాచారం. ఇక బుల్లితెర నటుడు అమర్ దీప్ కూడా రాబోతున్నారట. ఇటీవలే అతడు తన ప్రేయసి, సహనటి తేజస్వితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. మరిప్పుడు పెళ్లి వాయిదా వేసుకొని వస్తాడా..? లేదంటే త్వరగా పెళ్లి చేసుకొని బిగ్ బాస్ షోకి రెడీ అవుతారా..? అనేది చూడాలి. ప్రతి సీజన్ లో ఓ కమెడియన్ ఉన్నట్లే.. ఈసారి కూడా ఓ కమెడియన్ ను తీసుకురావాలనుకుంటున్నారు.
అందులో భాగంగా చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోపై రివ్యూ ఇచ్చే వ్యక్తి ఆది రెడ్డిని కూడా తీసుకొస్తున్నట్లు టాక్. ఆదిరెడ్డితో పాటు గీతూరాయల్ కూడా రాబోతుంది. వీరితో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించనున్నారు. యాంకర్ శివ, మిత్రాశర్మ, అనిల్ రాథోడ్ లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించే ఛాన్స్ ఉంది. కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారు.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!
Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!