అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : హౌజ్ లో మొదలైన ట్రయాంగిల్ లవ్ ట్రాక్ లు, ఎవరు ఎవరికి కనెక్ట్ అయ్యారంటే?

Bigg Boss Season8:గతవారం గొడవలతో చిరాకెత్తిన హౌస్లో ప్రేమయాత్రలు మొదలైనట్టు కనిపిస్తున్నాయి. నిఖిల్, సోనియా ఇద్దరూ బాగా క్లోజ్ అయినట్టుగా కనబడగా, నాగార్జున ఎలాగూ పృథ్వి, విష్ణు ప్రియకి ముడి పెట్టారు.

Bigg Boss Season 8, Love tracks:  అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగార్జున చెప్పడమే కానీ బిగ్ బాస్ సీజన్ 8లో అదే కనిపించట్లేదు. హౌస్ లో ఎంతసేపూ ఒకరితో ఒకరు గొడవ పడడం వంటి సీన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ రూటు మార్చి హౌస్ మేట్స్ ను దారిలో పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏకంగా ఒక వారం మొత్తాన్ని గొడవలతోనే నడిపించారు. కానీ ఇప్పుడు మాత్రం హౌస్ లో నెమ్మదిగా ప్రేమ గాలి ఇస్తున్నట్టుగా ప్రేక్షకులకు ఫీలింగ్ తెప్పిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 9లో ఈ విషయాన్ని స్పష్టంగా చూపించారు. కానీ ఎవరెవరికి సింక్ అయ్యింది? ఎవరెవరి మధ్య లవ్ స్టోరీ నడుస్తోంది? అనేది మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది.

Read Also: ఒక్కొక్కరుగా మాస్క్ తీస్తున్న కంటెస్టెంట్స్

హౌస్ లో నిఖిల్, సోనియా ఇద్దరూ బాగా క్లోజ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా ఇద్దరూ గుసగుసలాడుకోవడం, మాట్లాడుకోవడం, హౌస్ మేట్స్ కూడా వాళ్ల గురించి చెప్పడం చూస్తుంటే ఇద్దరికీ బాగా సింక్ అయ్యింది అనిపిస్తుంది. పైగా ఈరోజు ఎపిసోడ్ లో నిఖిల్ సోనియాకు తినాలనిపిస్తోందనే కారణంతో మేతి టమాటా కూర వండాడని సీత, విష్ణు ప్రియతో చెప్పడం, ఆమె ఎంత ప్రేమ అంటూ సెటైర్లు వేయడం కనిపించింది. అంతేకాకుండా హౌస్ లో గ్రూపుగా అయినా, లేదా కపుల్ గా అయినా సరే వీరిద్దరూ ఉంటున్నారు. అంతేకాకుండా ఈరోజు నువ్వు సిగరెట్ తాగడం మానేస్తే ఏమి అడిగినా ఇస్తాను అంటూ షాకింగ్ డైలాగ్ కొట్టింది సోనియా. నిఖిల్ కూడా కాసేపు ఆశ్చర్యపోయినప్పటికీ వెంటనే తేరుకుని మానేస్తానని చెప్పాడు. ప్రోమోలో కూడా దీనిని హైలెట్ చేశారు. కానీ నిఖిల్ ఓవైపు సోనియా, మరోవైపు విష్ణు ప్రియకు క్లోజ్ గా ఉండడం సమస్యగా మారింది. వాళ్ళిద్దరికీ పెద్దగా పడకపోవడంతో తానసలు ఎవరి వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడాలో తేల్చుకోలేకపోతున్నాడు. అయితే అప్పుడప్పుడు హౌస్ లో జరుగుతున్న సీన్లు చూస్తుంటే ఇదేమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా అనే అనుమానం వస్తుంది.

Read Also: ఆడపులికి కాబోయే వాడు ఇన్ని లక్షణాలు ఉండాలట, అలాంటి వాడు అసలు భూమ్మీద ఉన్నాడా?

నాగార్జున ఎలాగూ పృథ్వి, విష్ణు ప్రియకు ముడి పెట్టారు. అందుకే సోనియా నిఖిల్, మరోవైపు విష్ణు ప్రియ పృథ్వి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తారని అనిపించింది. కానీ తీరా చూస్తే ఈరోజటి ఎపిసోడ్లో సోనియా, పృథ్వి చేయి పట్టుకొని సిగ్గుపడుతూ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలను బయటపెట్టింది. ఆ టైంలో విష్ణు ప్రియ వచ్చి జెలసిగా ఫీల్ అవుతూనే పృథ్వి ఎంతమందికైనా ప్రేమ పంచొచ్చు అంటూ డైలాగ్స్ వేసింది. అలాగే ప్రేమ గురించి ఆమె ఒపీనియన్ విని తను ఒప్పుకోను అని పృథ్వీ చెప్పడంతో నువ్వు ఈ మూడు నెలలు అయిపోయినా నాతో ప్రేమలో పడవు అంటూ నవ్వేసింది విష్ణు ప్రియ. ఇక్కడ పృథ్వీ, సోనియాకు సపోర్ట్ చేస్తూ కనిపించాడు. మరోవైపు సోనియా, నిఖిల్ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అంటే పృథ్వీ-సోనియా-విష్ణు, నిఖిల్-సోనియా-విష్ణు అన్నట్టుగా ఉంది ఈ స్టోరీ. అసలు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారు? రెండు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడవబోతున్నాయా లేదా ఇది రెండు జంటల మధ్య లవ్ ట్రాకా ? అనే విషయం రానున్న ఎపిసోడ్లలో తేలిపోనుంది.

టాప్ హెడ్ లైన్స్

Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget