తేజకి బిగ్ బాస్ వార్నింగ్ - కేక్ కోసం అమర్, తేజ మధ్య గొడవ!
బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం కెప్టెన్సి టాస్క్ నడుస్తోంది. ఈ టాస్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మెన్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. అందుకు సంబంధించిన తాజాగా ప్రోమో విడుదలైంది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి స్కిట్ చేయడంతో పాటు మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో పాల్గొంటున్నారు. హౌస్ లోని సభ్యులు గులాబీపురం, జిలేబి పురం అనే రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరైతే గ్రహాంతరవాసులను మెప్పిస్తారో వారికి ఆ ఊరు నుంచి కెప్టెన్సీ వస్తుందని బిగ్ బాస్ తెలిపాడు. ఈ సందర్భంగా వాళ్ళతో స్కిట్ చేయించాడు. హౌస్ మేట్స్ తమ తమ పాత్రల్లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు ఊర్లలో ప్రజలుగా హౌస్ మేట్స్ గా నటించారు. వారిలో గులాబీపురం ఊరికి శోభ సర్పంచ్.
పల్లెటూరి అమ్మాయి కోసం వెతుకుతున్న ఎన్నారై అబ్బాయిగా యావర్. ఊర్లో వాళ్ళందరి గాసిప్స్ చెప్పే టీ కొట్టు ఓనర్ గా అమర్ దీప్. సర్పంచ్ శోభను ప్రేమిస్తున్న రోడ్ సైడ్ రోమియోగా గౌతమ్. ఓ పల్లెటూరి అమ్మాయిగా పూజా. పక్క ఊరి అర్జున్ అంటే ఆమెకి క్రష్. జిలేబి పురం సర్పంచ్ గా ప్రియాంక. జ్యోతిష్యుడిగా బోలె. తనతో మాట్లాడే వారితో మాత్రమే మాట్లాడతాడు. ఆ ఊరిలోకి కిల్లి కొట్టు యజమానిగా సందీప్. గల్లీ గుండాగా అర్జున్. పల్లెటూరి అందమైన అమ్మాయిగా అశ్విని. అర్జున్ వెంట తిరిగే కుర్రాడిగా ప్రశాంత్.. ఇలా ఎవరి పాత్రల్లో వారు జీవించారు. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో స్కిట్ పూర్తయిన అనంతరం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు.
అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. ప్రోమోని గమనిస్తే..' గ్రహాంతర వాసులను సంతోషపరిచేందుకు వారి స్పేస్ షిప్ ను చార్జ్ చేయాల్సి ఉంటుంది' అనే టాస్క్ ఇవ్వగానే ఓ గ్రూప్ నుంచి ప్రశాంత్ మరో గ్రూప్ నుంచి గౌతమ్ టాస్క్ పెర్ఫార్మ్ చేశారు. అది పూర్తయిన అనంతరం బిగ్ బాస్ తేజ ఏ డిజైన్ ఫిక్స్ అయ్యారా? అంటూ అడగగా టాస్క్ అయిపోయాక మాట్లాడదాం బిగ్ బాస్ అని తేజ బదులిస్తాడు. దానికి బిగ్ బాస్, ఈ టాస్క్ అయిపోయిన తర్వాతే మీ టాస్క్ అని అంటాడు. దీంతో హౌస్ మెంట్స్ అంతా నవ్వేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓ కేక్ తో పాటూ లెటర్ పంపారు. ఆ లెటర్లో తేజ ఇది ముగింపు కాదు ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని రాసి ఉంది.
అది చూసిన తేజ ముసళ్ళ పండగే ఏంటి? క్రొకోడైల్ ఫెస్టివల్ ఏంటి? అని హౌస్ మేట్స్ తో చెబుతాడు. తర్వాత ఆ కేక్ ని తినేందుకు అమర్ ప్రయత్నిస్తాడు. దాంతో తేజ, అమర్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. ఆ డిస్కషన్ లో అమర్ వినకపోవడంతో తేజ తినేసేయండి అని చెప్పడంతో అమర్ వెంటనే కేక్ తినేస్తాడు. దాంతో తేజ మాకు పంపించినప్పుడు మమ్మల్ని అడిగిన తర్వాత తినాలి అని అంటాడు. ఆ సమయంలో డెసిషన్ తీసుకోండి అని చెప్తే తేజ రేపొద్దునైనా తీసుకుంటా లేక రాత్రి అయినా తీసుకుంటాం, ఈ లోపు ఆగలేని వాళ్ళు కేక్ కోసుకుని తినేసేయండి' అంటూ తేజ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇంతకీ ఆ కేక్ బిగ్ బాస్ ఎందుకు పంపించాడు? దాన్ని అమర్ వెంటనే తినడంతో తేజ కి ఎందుకు కోపం వచ్చింది? అనేది తెలియాలంటే బుధవారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read : ఫ్యాన్స్‌తో కలిసి 'లియో' మూవీని చూసిన లోకేష్, అనిరుద్ - వీడియో వైరల్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial