అన్వేషించండి

ఫ్యాన్స్​తో కలిసి 'లియో' మూవీని చూసిన లోకేష్, అనిరుద్ - వీడియో వైరల్!

విజయ్ నటించిన 'లియో' చిత్రాన్ని అభిమానులతో కలిసి చేసేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్, అనిరుద్ రవిచంద్రన్ చెన్నైలోని ఓ థియేటర్ కి వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన 'లియో'(Leo) మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని చూసేందుకు చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్రన్ థియేటర్ కి వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గత ఏడాది 'విక్రమ్' మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విజయ్ తో తెరకెక్కించిన 'లియో' మూవీకి గత కొద్ది రోజులుగా ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో తెలిసిందే. ఆ హైప్ తోనే ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని ఎదురు చూస్తున్న తరుణంలో అక్టోబర్ 19న లియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీంతో థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. డబ్బు కొడుతూ, పటాకుల మోతలతో థియేటర్స్ ముందు నానా హంగామా చేశారు. ఇదిలా ఉంటే లియో ఫస్ట్ డే ఫస్ట్ షోకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తూ ఉదయం 9 గంటల నుంచి స్క్రీనింగ్ లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు మినహా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా ఇతర దేశాల్లో తెల్లవారుజామున నాలుగు గంటలకే లియో విడుదలైంది. తమిళనాడులో ఉదయం తొమ్మిది గంటలకు షో మొదలవడంతో అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేశారు.

ఈ క్రమంలోనే చెన్నైలోనే వెట్రీ థియేటర్ కి అభిమానులతో కలిసి లియో సినిమా చూసేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, చిత్ర బృందం వచ్చారు. లోకేష్, అనిరుధ్ లను థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చూసి ఈలలు వేస్తూ గోలలు చేశారు. దీంతో అనిరుద్ ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత ఆడియన్స్ అందరితో కలిసి లియో సినిమాని వీక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 34 దేశాలకు పైగా రిలీజ్ అయింది. దీంతో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. అమెరికా, యూకే, దుబాయ్ ఇతర దేశాల్లో భారీ కలెక్షన్స్ కూడా రాబడుతోంది.

ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 'లియో' మూవీకి సామాజిక మాధ్యమాల ద్వారా మంచి స్పందన వస్తోంది. విజయ్ ఖాతాలో లియోతో మరో హిట్ పడినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో విజయ్ పర్ఫామెన్స్, అనిరుద్ బిజిఎం, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉన్నాయంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముందు ముందు 'లియో' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

Also Read : కొత్త సినిమాపై అదిరిపోయే అప్​డేట్​ ఇచ్చిన విశాల్ - '#Vishal34' ఫస్ట్ లుక్, టీజర్ లోడింగ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget